హైదరాబాదీ బ్యూటీ ‘ఫాతిమా సనా షేక్’ బాలీవుడ్ సోషల్ మీడియాలో గత కొన్ని రోజులుగా హాట్ టాపిక్ అయిపోయింది. స్టార్ జంట ఆమిర్ ఖాన్- కిరణ్‌రావు దంపతుల మధ్యలో దూరి.. అమీర్ తో సన్నిహితంగా మెలుగుతూ.. మొత్తానికి కిరణ్ రావుకి అమీర్ విడాకులు ఇచ్చేలా చేసిందని, ఇలా ఈ భామ పై అనేక విమర్శలు, మరెన్నో పుకార్లు.
అమీర్ దంపతుల మధ్యలో చిచ్చు పెట్టింది నువ్వే అంటూ కొంతమంది నెటిజన్లు డైరెక్ట్ గానే ఫాతిమాను ట్రోల్ చేసినా ఆమె మాత్రం ఎక్కడా స్పందించలేదు. దాంతో నెటిజన్లు మరింతగా రెచ్చిపోతూ.. దంగల్‌లో అమీర్ కూతురిగా నటించిన ఫాతిమా.. ప్రస్తుతం అతని భార్య కాబోతుందని, అతనితో జీవితాన్ని పంచుకోబోతుందని ఇలా నెగిటివ్ కామెంట్స్ చేస్తూ పోతున్నారు.
బయట తన గురించి పరిస్థితులు ఇలా ఉంటే, ఫాతిమా సనా షేక్ మాత్రం, వరుస హాట్ హాట్ ఫొటోషూట్లతో రెచ్చిపోతూ అందాల కనువిందు చేస్తూ దూసుకుపోతుంది. క్రాప్ టాప్‌నకు జీన్స్ జతచేసి సింపుల్ డ్రెస్సింగ్ తో కేక పుట్టిస్తోంది. అందుకే బాలీవుడ్ నటులు అనిల్ కపూర్, సాన్యా మల్హోత్రా.. ‘నిప్పు రాజేస్తున్నావ్’ అంటూ ఫాతిమాని ఉద్దేశించి ఫైర్ ఎమోజీలను కూడా పోస్ట్ చేశారు.
అయితే, ఇప్పుడు ఒకరి కామెంట్ మాత్రం తెగ వైరల్ అవుతుంది. ఇంతకీ ఎవరిది ఆ కామెంట్ అంటే.. అమీర్ ఖాన్ ముద్దుల తనయ ఇరా ఖాన్ ది. ఫాతిమా బోల్డ్ స్టిల్స్ పై అమీర్ కూతురు స్పందిస్తూ.. ‘ఎంత అందంగా ఉన్నావో నువ్వు’ అంటూ ఒక మెసేజ్ పోస్ట్ చేసింది. మరి ఈ పోస్ట్ కావాలని పెట్టిందా ? లేక, క్యాజువల్ గా పెట్టిందా అనేది ఇరా ఖాన్ కే తెలియాలి.