https://oktelugu.com/

ప్చ్.. లైంగిక సుఖం ఇస్తేనే అవకాశం !

సినీ లోకంలో మత్తు ఉంటుంది. ఆ మత్తుకి మించిన ఎత్తులు ఉంటాయి, వాటిని మించిన కుయుత్తులు ఉంటాయి. అందుకే ఈ రంగురంగుల లోకంలో కనబడని ఆ రంగుల వెనుక ఎన్నో కుట్రలు, వేధింపులు, కష్టాలు, కన్నీళ్లు బయట వ్యక్తుల ఎవ్వరికీ కనిపించవు. అవి వ్యక్తుల వ్యక్తిగత జీవితాలను హరించి వేస్తాయి. ముఖ్యంగా ఈ కష్టాలు నటీమణుల జీవితాల్లో ఎక్కువగా ఉంటాయి. కాస్టింగ్ కౌచ్ లాంటి తీవ్రమైన సమస్యల బారినపడిన నటీమణులు ఎంతో మంది ఆ మధ్య మీటూ […]

Written By:
  • admin
  • , Updated On : April 19, 2021 / 04:35 PM IST
    Follow us on

    సినీ లోకంలో మత్తు ఉంటుంది. ఆ మత్తుకి మించిన ఎత్తులు ఉంటాయి, వాటిని మించిన కుయుత్తులు ఉంటాయి. అందుకే ఈ రంగురంగుల లోకంలో కనబడని ఆ రంగుల వెనుక ఎన్నో కుట్రలు, వేధింపులు, కష్టాలు, కన్నీళ్లు బయట వ్యక్తుల ఎవ్వరికీ కనిపించవు. అవి వ్యక్తుల వ్యక్తిగత జీవితాలను హరించి వేస్తాయి. ముఖ్యంగా ఈ కష్టాలు నటీమణుల జీవితాల్లో ఎక్కువగా ఉంటాయి. కాస్టింగ్ కౌచ్ లాంటి తీవ్రమైన సమస్యల బారినపడిన నటీమణులు ఎంతో మంది ఆ మధ్య మీటూ అంటూ తమ బాధను సిగ్గు విడిచి చెప్పుకొని కుమిలిపోయారు.

    మళ్లీ అలాంటి బాధనే చెప్పి బాధ పడింది బాలీవుడ్ హీరోయిన్ ఫాతిమా సనా షేక్. ఇండస్ట్రీలో నెలకొన్న కాస్టింగ్ కౌచ్ గురించి ఎక్కువగా మాట్లాడుకోవడం వృధా. అది లేని చోటు ఈ ప్రపంచంలో ఎక్కడా లేదు అంటూ ఫాతిమా చెబుతోంది. ఫాతిమా సనా షేక్ చిన్ననాటి నుండి సినిమాల్లో నటిస్తోంది. 1997లో కమల్ హాసన్ కుమార్తెగా ఒక సినిమాలో కనబడింది. ఆమిర్ ఖాన్ నటించిన ‘దంగల్’ సినిమాలో హీరో పెద్ద కుమార్తె పాత్రలో నటించి అందరి మన్ననలూ పొంది.. ప్రస్తుతం హీరోయిన్ గానూ రాణిస్తోంది.

    అయితే, ఆమెకు స్టార్ డమ్ మాత్రం రావట్లేదు. వరుస అవకాశాలు వస్తున్నా.. ఆ అవకాశాల వెనకే ఇబ్బందులూ ఆమె తలుపు తడుతున్నాయట. ఇండస్ట్రీలో అవకాశం దొరకాలంటే లైంగిక సుఖం ఇస్తేనే దొరుకుతుందని.. ఇది చాలా మందికి తెలుసు అని, కొన్ని సందర్భాల్లో నాకు అలాంటి అనుభవాలు వచ్చాయని, వాటి మూలానే చాలా చోట్ల పనిని కోల్పోయానని ఫాతిమా చెప్పుకొచ్చింది. అయితే తనను ఎవరు ఇబ్బంది పెట్టారు అనే విషయాన్ని మాత్రం ఫాతిమా చెప్పలేదు. వేధింపులను బయటకు చెప్పడానికి చాలామంది సంకోచిస్తారు కానీ మహిళల ప్రపంచం మారుతోంది అమ్మాయిలు ధైర్యంగా తమ చేదు అనుభవాలను వివరిస్తున్నారు.