Vangalapudi Anitha : టార్గెట్ ఫిక్స్ చేసుకున్న ఏపీ హోం మంత్రి.. ఆ వైసిపి నాయకుడిని జైల్లోకి పంపిస్తారట..

Vangalapudi Anitha ఇన్నాళ్లపాటు ఇబ్బందులు పడిన కొడాలి నాని బాధితులు ఇప్పుడు స్వేచ్ఛగా బయటికి వస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.

Written By: NARESH, Updated On : June 16, 2024 10:13 pm

Vangalapudi Anitha

Follow us on

Vangalapudi Anitha : ఏపీలో రాజకీయాలు రోజురోజుకు రసవత్తరంగా మారుతున్నాయి. మొన్నటి ఎన్నికల్లో ఆరోపణలు ప్రత్యారోపణలతో నాయకులు తెగ హడావిడి చేశారు. మీడియాను తమ వైపు తిప్పుకున్నారు. ఎన్నికలు పూర్తయ్యాయి. ఫలితాలు వచ్చేసాయి. ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారం చేశారు. ఈ ఎన్నికల ఫలితాలలో కనీసం ప్రతిపక్ష పార్టీ లేకుండా చేశారు. గత అధికార పార్టీని కేవలం 11 స్థానాలకే పరిమితం చేశారు.. కొత్త ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత కూడా ఏపీలో రాజకీయాల్లో కాక తగ్గడం లేదు. మరోవైపు చంద్రబాబు నాయుడు తన మంత్రివర్గాన్ని ప్రకటించారు. ఇందులో కీలకమైన హోం శాఖను పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనిత కు కేటాయించారు. తెలుగుదేశం పార్టీలో ఫైర్ బ్రాండ్ లీడర్ గా అనిత పేరు పొందారు.

వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు.. అనిత ఆ పార్టీ నాయకుల చేతిలో విమర్శలు ఎదుర్కొన్నారు. కేసులు, రకరకాల వేధింపులను చవి చూశారు. అవి సహజంగానే ఎన్నికల్లో ఆమెకు ఉపకరించాయి. సానుభూతి రూపంలో ఓట్లు పడి ఆమెను ఎమ్మెల్యేగా చేశాయి. ఇప్పుడు ఏకంగా హోం మంత్రి కావడంతో తన లక్ష్యమేమిటో ఆమె స్పష్టంగా చెప్పేస్తున్నారు. చట్టం ప్రకారం నడుచుకుంటామని.. వ్యక్తిగత కక్ష లేదని.. నాడు తమను ఇబ్బంది పెట్టిన వారు చేసిన అక్రమాలను బయటపెడతామని.. కచ్చితంగా జైల్లోకి పంపిస్తామని అనిత స్పష్టం చేస్తున్నారు.

సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించి ఒక వీడియో ట్రెండ్ అవుతోంది. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణ ఇటీవల నిర్వహించిన ఇంటర్వ్యూలో అనిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాధాకృష్ణ పలు ప్రశ్నలు అనితను ఉద్దేశించి సంధించారు. ” వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కేసులు కూడా చవి చూశారు. ఇలాంటప్పుడు మీరు ఏం చేయబోతున్నారు.. ఒకవేళ అధికారంలోకి వస్తే ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు” అని రాధాకృష్ణ ప్రశ్నించగా.. ” ఆ వ్యక్తుల పేర్లు చెప్పమంటారా.. లేకుంటే ఇండికేషన్లు మాత్రమే సరిపోతాయా” అని అనిత సమాధానం ఇవ్వగా…” ఇండికేషన్లు ఎందుకు నేరుగా వ్యక్తుల పేర్లు చెప్పేయండి” అంటూ రాధాకృష్ణ అన్నారు.. దానికి వంగలపూడి అనిత స్పందించారు. ” మేము సిస్టం ప్రకారమే నడుచుకుంటాం. వ్యక్తిగత ద్వేషాలు ఉండవు. కక్షలు అసలు పెట్టుకునే పరిస్థితి లేదు. ఇందులో ముందుగా జైలుకు పంపించాల్సింది కొడాలి నాని గారిని” అని ఆమె బదులిచ్చారు. వంగలపూడి అనిత హోం శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత.. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిని టిడిపి నాయకులు తెగ ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొడాలి నాని ని అరెస్టు చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే గుడివాడలో కొడాలి నాని కొన్ని భూములను ఆక్రమించారని.. ఇన్నాళ్లపాటు ఇబ్బందులు పడిన కొడాలి నాని బాధితులు ఇప్పుడు స్వేచ్ఛగా బయటికి వస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.