నేడు రంజాన్ పర్వదినం. ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలుపుతూ ఎన్టీఆర్ ట్వీట్ చేశాడు. ‘ప్రతి ఒక్కరికీ రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు. నేను కోవిడ్ నుండి త్వరగా కోలుకోవాలని నా ఆరోగ్యం కోసం ప్రార్థనలు చేస్తున్న మీకు, మీ ప్రేమాభిమానాలకు నా ప్రత్యేక ధన్యవాదాలు. ఇప్పుడిప్పుడే కరోనా నుంచి కోలుకుంటున్నాను. త్వరలోనే కొవిడ్ నుంచి పూర్తిగా కోలుకుని, మీ ముందుకు వస్తా. అందరూ కరోనా నుండి సురక్షితంగా ఉండండి. అన్ని జాగ్రత్తలు పాటించండి’ అంటూ ఎన్టీఆర్ పోస్ట్ పెట్టాడు.
ఎన్టీఆర్ ఈ నెల 10న కరోనా బారిన పడిన దగ్గర నుండి ఆయన అభిమానులు తారక్ త్వరగా కోలుకోవాలని ప్రత్యేక పూజలు కూడా చేస్తున్నారు. ‘మా నందమూరి తారకరామారావు గారు కోవిడ్ నుంచి తొందరగా కోలుకోవాలని ఈ రోజు తిరుపతిలో దేవాలయానికి, మసీదుకు, చర్చికి వెళ్లి మత ప్రార్థనలు చెయ్యడం జరిగింది’ అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ పూజ జరిపించిన ఆ విజువల్స్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ప్రస్తుతం ఎన్టీఆర్ హోమ్ ఐసోలేషన్‌లో ఉంటూ వైద్యుల సూచనలు పాటిస్తున్నారు. ఎన్టీఆర్ గత రెండు రోజుల నుండి మీడియా ప్రముఖులతో పర్సనల్ గా జూమ్ కాల్ లో సంభాషిస్తున్నారు. ఈ సందర్భంగా తారక్ అనేక విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నారు. తన తరువాత సినిమాల లిస్ట్ తో పాటు అవకాశం వస్తే హాలీవుడ్ చిత్రాల్లో కూడా నటిస్తా అని క్లారిటీ ఇచ్చాడు.
ఇక తారక్ ప్రెజెంట్ చేస్తోన్న ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమా పూర్తయిన వెంటనే కొరటాల శివ సినిమాని పట్టాలెక్కించనున్నారు. అలాగే ఆ తరువాత ప్రశాంత్ నీల్ తో ఒక సినిమా, ఆ తరువాత త్రివిక్రమ్ నూ మరో సినిమా చేయనున్నాడు.
మా నందమూరి తారకరామారావు గారు కోవిడ్ నుంచి తొందరగా కోలుకోవాలని ఈ రోజు తిరుపతిలో దేవాలయానికి, మసీదుకు, చర్చికి వెళ్లి మత ప్రార్థనలు చెయ్యడం జరిగింది.@tarak9999❤#NTRCharitableServices pic.twitter.com/6VUSMp8sOM
— NTR Charitable Services (@NTR_Charities) May 12, 2021
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Fans pray for for fast recovery jr ntr
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com