https://oktelugu.com/

Mahesh Babu: మహేష్ బాబు ని గుర్తు పట్టలేక పోతున్న అభిమానులు.. ఇదేమి లుక్ అండీ బాబోయ్..వైరల్ గా మారిన లేటెస్ట్ ఫోటో!

మహేష్ బాబు అంటే మన చిన్నతనం నుండి మీసం, గెడ్డం లేకుండా హాలీవుడ్ హీరోలాగా కనిపించడమే మనం చూసాము. ఆ తర్వాత కొన్నాళ్ళకు ఆయన సన్నని మీసం, సన్నని గెడ్డం తో ట్రెండీ లుక్ లో కనిపించడం చూసాము. ఇప్పుడు ఆయన ఏకంగా రాజమౌళి సినిమా కోసం గుబురు గెడ్డంతో కనిపించడం మనం చూస్తూ ఉన్నాము.

Written By:
  • S Reddy
  • , Updated On : August 29, 2024 / 03:35 PM IST

    Mahesh Babu(1)

    Follow us on

    Mahesh Babu: ఈ ఏడాది సంక్రాంతి కానుకగా సూపర్ స్టార్ మహేష్ బాబు ‘గుంటూరు కారం’ చిత్రంతో మన ముందుకు వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమా తర్వాత ఆయన రాజమౌళి తో ఒక సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమా కోసం మహేష్ బాబు ఎంతో కష్టపడుతున్నాడు. షూటింగ్ ప్రారంభానికి ముందు రాజమౌళి నిర్వహిస్తున్న వర్క్ షాప్ లో మహేష్ బాబు గత రెండు నెలల నుండి పాల్గొంటున్నాడు. ఈ వర్క్ షాప్ అల్యూమినియం ఫ్యాక్టరీ లో జరుగుతుంది. ఇకపోతే ఈ సినిమా కోసం మహేష్ బాబు ఎవ్వరూ ఊహించని విధంగా మారబోతున్నాడు. అసలు ఇతను నిజంగా మహేష్ బాబేనా అని అభిమానులు సైతం ఆశ్చర్యపోయేలా ఆయన లేటెస్ట్ లుక్ తయారైంది.

    మహేష్ బాబు అంటే మన చిన్నతనం నుండి మీసం, గెడ్డం లేకుండా హాలీవుడ్ హీరోలాగా కనిపించడమే మనం చూసాము. ఆ తర్వాత కొన్నాళ్ళకు ఆయన సన్నని మీసం, సన్నని గెడ్డం తో ట్రెండీ లుక్ లో కనిపించడం చూసాము. ఇప్పుడు ఆయన ఏకంగా రాజమౌళి సినిమా కోసం గుబురు గెడ్డంతో కనిపించడం మనం చూస్తూ ఉన్నాము. రీసెంట్ గానే ఆయన తన కొడుకు గౌతమ్ ని యాక్టింగ్ స్కూల్ లో చేర్పించేందుకు అమెరికాకి వెళ్ళాడు. అక్కడ ఒక అమ్మాయి మహేష్ బాబు తో సెల్ఫీ తీసుకుంటూ సోషల్ మీడియాలో అప్లోడ్ చేసిన ఫోటో తెగ వైరల్ గా మారింది. అనంత్ అంబానీ పెళ్లిలో మహేష్ బాబు గెడ్డం లుక్ లోనే కనిపించినప్పటికీ కాస్త సాఫ్ట్ గా అనిపించాడు. కానీ ఈ ఫొటోలో మాత్రం చాలా రఫ్ గా కనిపిస్తున్నాడు. సినిమా ప్రారంభం అయ్యే సమయానికి ఆయన ఇంకా రఫ్ గా కనిపిస్తాడని టాక్ వినిపిస్తుంది. అంతే కాదు ఈ సినిమా కోసం మహేష్ బాబు సిక్స్ ప్యాక్ బాడీ ని కూడా పెంచాడు. తన సినీ కెరీర్ మొత్తం మీద ఇప్పటి వరకు మహేష్ బాబు ఒక్క సినిమాలో కూడా చొక్కా విప్పి సిక్స్ ప్యాక్ బాడీని చూపించిన దాఖలాలు లేవు. 1 నేనొక్కడినే అనే చిత్రంలో వెనుక షాట్ నుండి చొక్కా లేకుండా ఉండడాన్ని చూపిస్తాడు డైరెక్టర్ సుకుమార్.

    ఇప్పుడు రాజమౌళి ఆయనని పూర్తి స్థాయి షర్ట్ లెస్ అవతారం లో చూపించబోతున్నాడు. మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్ చొక్కా లేకుండా సిక్స్ ప్యాక్ బాడీ ని చూపిస్తే థియేటర్స్ పరిస్థితి ఏమిటో ఒక్కసారి ఊహించుకోండి, అభిమానులు సీట్స్ లో కూర్చోగలరా?, అలాంటి అద్భుతమైన ట్రీట్ ని రాజమౌళి అభిమానులకు ఇవ్వబోతున్నాడు. ఇది ఇలా ఉండగా ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ దాదాపుగా పూర్తి అయ్యినట్టే అట. ప్రస్తుతం డైలాగ్ వెర్షన్ స్క్రిప్ట్ ని రాస్తున్నాడు విజయేంద్ర ప్రసాద్. ఫారెస్ట్ అడ్వెంచర్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా 2027 వ సంవత్సరంలో పాన్ వరల్డ్ రేంజ్ విడుదల కానుంది. #RRR తో ఆస్కార్ అవార్డుని టాలీవుడ్ కి తీసుకొచ్చిన రాజమౌళి, ఈ సినిమాతో ఇంకెన్ని అద్భుతాలు చేస్తాడో చూడాలి.