https://oktelugu.com/

Allu Arjun: అల్లు అర్జున్ మా పవన్ కళ్యాణ్ కాళ్ళను మొక్కాలి..అప్పుడే పుష్ప 2 ని రిలీజ్ చేయిస్తాం అంటూ మరో జనసేన లీడర్ వార్నింగ్!

ఈమధ్యనే ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వెళ్లిన అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ అభిమానులను కవ్వించే ప్రయత్నం చెయ్యడం, దానికి జనసేన పార్టీ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఘాటుగా అల్లు అర్జున్ పై కౌంటర్లు వెయ్యడం వంటి ఘటనలు అభిమానుల మధ్య చిచ్చు మరింత రేపింది.

Written By:
  • Vicky
  • , Updated On : August 29, 2024 / 03:43 PM IST

    Allu Arjun(5)

    Follow us on

    Allu Arjun: జనసేన పార్టీ నాయకులు అల్లు అర్జున్ ని చాలా తీవ్రంగా టార్గెట్ చేసారు. అల్లు అర్జున్ ఇటీవల ప్రవర్తిస్తున్న తీరు పట్ల ప్రతీ పవన్ కళ్యాణ్ అభిమానిలోనూ తీవ్రమైన అసంతృప్తి ఉంది. అయితే అది కేవలం అభిమానుల వరకే కదా, అల్లు అర్జున్ మరియు పవన్ కళ్యాణ్ మధ్య ఎలాంటి గొడవలు ఉండవని అందరూ అనుకున్నారు. కానీ ఇటీవల పలు న్యూస్ డిబేట్ ప్రోగ్రామ్స్ లో అల్లు అర్జున్ మామయ్య చంద్రశేఖర్ రెడ్డి ( స్నేహ రెడ్డి తండ్రి) పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ కి క్షమాపణలు చెప్పాలి అనడం, పుష్ప సినిమా గురించి కామెంట్స్ చెయ్యాల్సిన అవసరం పవన్ కళ్యాణ్ కి లేదు, అది కేవలం పాత్ర మాత్రమే, నిజజీ వితం లో అలా చేస్తే అప్పుడు మాట్లాడాలి అనడం, అభిమానులకు పవన్ కళ్యాణ్ వచ్చి సమాధానం చెప్పే వరకు ఈ గొడవలు సోషల్ మీడియా లో జరుగుతూనే ఉంటాయి అనడం సోషల్ మీడియా లో పెను దుమారం రేపింది.

    అంతే కాకుండా ఈమధ్యనే ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వెళ్లిన అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ అభిమానులను కవ్వించే ప్రయత్నం చెయ్యడం, దానికి జనసేన పార్టీ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఘాటుగా అల్లు అర్జున్ పై కౌంటర్లు వెయ్యడం వంటి ఘటనలు అభిమానుల మధ్య చిచ్చు మరింత రేపింది. ఇప్పుడు అభిమానుల మధ్య చిచ్చు మరింత రేగేలా జనసేన పార్టీ కి సంబంధించిన మరో ఎమ్మెల్యే అల్లు అర్జున్ పై కామెంట్స్ చేసాడు. జనసేన నాయకుడు చాలామాశెట్టి రమేష్ మాట్లాడుతూ ‘హీరో అల్లు అర్జున్ ఒక సంస్కార హీనుడు. భావితరాలకు ఆదర్శప్రాయుడైన చిరంజీవి కుటుంబం నుండి వచ్చిన నువ్వు నేర్చుకున్న సంస్కారం ఇంతేనా?, ఆ కుటుంబంలో ఎవరి మీదైనా ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే సహించేది లేదు, ఆయన మాట్లాడిన మాటలకు బాధ్యత వహిస్తూ చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగబాబు కళ్ళకు మొక్కి, ఆ కాళ్ళని కడిగి నీళ్లను నేతి మీద చల్లుకోవాలి. లేకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. పుష్ప 2 చిత్రం మా నియోజకవర్గం లో ఎలా విడుదల అవుతుందో నేను కూడా చూస్తా’ అంటూ సవాలు చేసాడు. దీనిపై అల్లు అర్జున్ అభిమానులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు.

    చిలికి చిలికి గాలి వానలాగా మారిన ఈ వివాదం ఇప్పుడు తుఫాను లాగా మారే ప్రమాదం కూడా ఉంది. అభిమానులు సోషల్ మీడియాలో తిట్టుకోవడం దగ్గర నుండి బయట కొట్టుకునే స్థాయికి వెళ్ళిపోతారు. దీనికి శుభం కార్డు పెట్టడం అల్లు అర్జున్ చేతిలోనే ఉంది. ఎందుకంటే ఆయనే గొడవని మొదలుపెట్టాడు కాబట్టి. నంద్యాల కి వెళ్లి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థికి సపోర్టు చేస్తే ఇంత రచ్చ జరుగుతుంది అనే విషయం తెలియకుండా ఉండడానికి అల్లు అర్జున్ ఏమి చిన్న పిల్లవాడు కాదంటూ సోషల్ మీడియా లో పవన్ కళ్యాణ్ అభిమానులు అంటున్నారు. మరి అల్లు అర్జున్ వీటిపై స్పందిస్తాడో లేదో చూడాలి.