Telugu Language Day 2024 : మాతృభాషను కాపాడుకుందాం.. తెలుగు భాషా దినోత్సవం వేళ ప్రముఖుల సందేశాలు ఇవిగో..

ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 29న గురువారం తెలుగు భాషా దినోత్సవాన్నిఘనంగా నిర్వహించుకున్నారు. తెలుగు కవి గిడుగు వెంకట రామమూర్తి జయంతిని పురస్కరించుకొని ఆయన భాషకు సేవలను స్మరించుకున్నారు.

Written By: Mahi, Updated On : August 29, 2024 3:31 pm

Telugu Language Day 2024

Follow us on

Telugu Language Day 2024 : దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు మన పెద్దలు. తెలుగు భాషలో ఉన్న మాధుర్యం మరే భాషలో లేదని కీర్తించారు మన కవులు. అమ్మదనం నిండిన కమ్మనైన భాష మన తెలుగు భాష. ఇంత గొప్ప భాష.. ప్రస్తుతం కాపాడుకోవాలనే డిమాండ్ వినిపిస్తున్నది. ఇతర భాషల పై మమకారంతో తెలుగు భాషకు కొందరు దూరమవుతున్నారు. ఇక దీని పరిరక్షణకు సాహితీవేత్తలు, కవులు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నా ప్రభుత్వాల నుంచి ఆశించినంతగా స్పందన లేకపోవడం విస్మయానికి గురిచేస్తున్నది. పాఠశాలల్లో తెలుగు పాఠ్యాంశ బోధన తప్పనిసరి చేసినా, ఇతర భాషలపైనే చాలా మంది మమకారం పెంచుకున్నారు. 1966లో ఉమ్మడి రాష్ర్టంలో ఏపీ అధికారిక భాషా చట్టం ప్రకారం తెలుగును అధికారిక భాషగా గుర్తించారు. దీంతో ప్రతి ఏడాది రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. దీంతో పాటు ఈ రోజే తెలుగు కవి గిడుగు వెంకట రామమూర్తి జయంతిని నిర్వహిస్తున్నారు. వాడుక భాషలోనే బోధన ఉండాలని గొంతెత్తి, ఆ అమలుకు కృషి చేసిన గిడుగు వెంకట రామమూర్తి ప్రత్యేకంగా ఈ రెండు రాష్ర్టాల్లో స్మరించుకుంటారు. ప్రత్యేకంగా తెలుగు భాషా పరిరక్షణకు కృషి చేస్తున్న వారికి ఆయన పేరిట అవార్డులు కూడా అందజేస్తున్నారు.

తెలుగు భాషాదినోత్సవం సందర్భంగా రెండు తెలుగు రాష్ర్టాల్లో వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. ప్రభుత్వ ప్రముఖులు, అధికారులు, కవులు, సాహితీవేత్తలు, భాషాప్రేమికులు, ఇలా ఎంతో మంది ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు. తెలుగ భాషా పరిరక్షణకు తీసుకోవాల్సిన కార్యక్రమాలపై ప్రత్యేకంగా చర్చించారు. ఇక దీంతో పాటు ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు.

ఇక ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రత్యేకంగా ఒక పద్యం ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ‘తెలుగుదేల యెన్న దేశంబు తెలుగును తెలుగు వల్లభుండ, తెలుగొకండ, యెల్ల నృపులు గొలువ నెరుగవే బాసాడి, దేశ భాషలందు తెలుగు లెస్స’ అంటూ ఆయన తెలుగు రాష్ర్టాల ప్రజలకు శుభాకాంక్షలుతెలిపారు.

ఇక ఏఫీ సీఎం చంద్రబాబు కూడా ఎక్స్ లో శుభాకాంక్షలు తెలిపారు. అమ్మభాషకు సేవల చేసిన పెద్దలకు ధన్యవాదాలు. భాషను సుసంపన్న చేసుకుందాం. తెలుగు భాష ఔన్నత్యాన్ని భావితరాలకు అందివ్వడమే తెలుగు భాషాభివృద్ధి కోసం కృషి చేసిన మహనీయులకు మనమిచ్చే ఘన నివాళి అంటూ పేర్కొన్నారు. తెలుగు వెలగాలి. తెలుగు భాష వర్ధిల్లాలి అని కోరుకున్నారు.దాని కోసం పని చేద్దాం అంటూ ట్వీట్ లో పేర్కొన్నారు.

ఇక ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఎక్స్ వేదిక మాతృభాష దినోత్సవ శుభకాంక్షలు తెలిపారు. ప్రభుత్వ కార్యకలాపాల్లోనూ తెలుగు భాష వినియోగం పెంచే దిశగా తమ ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. నిత్య వ్యవహారాల్లో మన భాషకు పట్టం కట్టినప్పుడే తెలుగు భాషా దినోత్సవానికి సార్ధకత ఉంటుందన్నారు. గిడుగు వెంకట రామమూర్తి అంజలి ఘటిస్తున్నా.. ఆయన సేవలను స్మరించుకోవడం మనకెంతో గర్వకారణం.

తెలుగు భాష గొప్పతనాన్ని ప్రతి పౌరుడు ఎలుగెత్తి చాటాల్సిందే. అమ్మభాషను గౌరవించుకోవడం మనందరి బాధ్యత. తెలుగు రాష్ట్రాల పౌరులందరూ ఆదిశగా కృషి చేయాలి. ఇక మంత్రి నారా లోకేశ్ కూడా స్పందించారు. తన కుమారుడు దేవాన్ష్ గురించి కూడా ఈ సందర్భంగా ప్రస్తావించారు. దేవాన్ష్ కు తెలుగు మాట్లాడడం, రాయించడం, చదివించడం కూడా తానే నేర్పిస్తున్నట్లు చెప్పారు. అమ్మ జన్మనిస్తే, మాతృభాష తెలుగు మన జీవితాల్లో వెలుగు నింపుతుందని పేర్కొన్నారు.