https://oktelugu.com/

Lunar Eclipse : చంద్రగ్రహణం సందర్భంగా ప్రతికూల శక్తి పోవాలంటే.. ఈ మంత్రాన్ని పఠించాలి.. అదేంటంటే?

హిందూ మతం ప్రకారం గ్రహణం సందర్భంగా ఆలయాలను మూసివేస్తారు. గర్భణులను బయటకు రానీయకుండా చేస్తారు. అయితే ఈరోజు ఏ పని చేయకుండా ఉన్న వారు ఓ మంత్రాన్ని జపిస్తే అనుకున్న పనులు నెరవేరుతాయని కొందరు ఆధ్యాత్మిక వేత్తలు తెలుపుతున్నారు. ఆ మంత్రం విశేషాలెంటో తెలుసుకుందాం.

Written By:
  • Srinivas
  • , Updated On : September 13, 2024 / 11:25 AM IST

    Lunar Eclipse

    Follow us on

    Lunar Eclipse : సౌర వ్యవస్థలో ఊహించని ఎన్నో విశేషాలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఎన్నో గ్రహాలు ఉండగా.. సూర్యడు, భూమి, చంద్రుడి మధ్య అనుబంధం ఉంటుంది. భూమికి సూర్యుడితో పాటు చంద్రుడి వెలుగు కడా ఉంటుంది. అయితే సూర్యుడు ఒకే చోట ఉన్నా.. భూమి, చంద్రుడు పరిభ్రమిస్తూ ఒకే సరళ రేఖపై వస్తాయి. దీంతో గ్రహణాలు ఏర్పడుతాయి. ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో చంద్రగ్రహణం ఏర్పడనుంది. అయితే చంద్రగ్రహణం సందర్భంగా ఖగోళ శాస్త్రం ప్రకారంగానే కాకుండా ఆధ్యాత్మికంగా కూడా కొన్ని పనులుచేస్తారు. హిందూ మతం ప్రకారం గ్రహణం సందర్భంగా ఆలయాలను మూసివేస్తారు. గర్భణులను బయటకు రానీయకుండా చేస్తారు. అయితే ఈరోజు ఏ పని చేయకుండా ఉన్న వారు ఓ మంత్రాన్ని జపిస్తే అనుకున్న పనులు నెరవేరుతాయని కొందరు ఆధ్యాత్మిక వేత్తలు తెలుపుతున్నారు. ఆ మంత్రం విశేషాలెంటో తెలుసుకుందాం..

    ఈ సంవత్సరం సెప్టెంబర్ 18న చంద్ర గ్రహణం ఏర్పడనుంది. ఈ సందర్భంగా ఇది ఇండియాలో ఉదయం 6.12 గంటలకు ప్రారంభమై నాలుగు గంటల 4 నిమిషాలు కొనసాగుతుంది. 10.16 చంద్ర గ్రహణం ముగుస్తుంది. ఇందులో 9 గంటలకు సూతక్ కాలం కూడా ప్రారంభం అవుతుంది. అయితే భారతదేశంలో ఈ సమయం ఉదయం కావడంతో చంద్ర గ్రహణం కనిపించదు. అయితే యూరప్, ఆఫ్రికా, ఉత్తర, దక్షిణ అమెరికాలో రాత్రి సమయం ఉండడం వల్ల అక్కడ ఇది స్పష్టంగా కనిపిస్తుంది. చంద్ర గ్రహణంను నేరుగా చూడొద్దని కొందరు అంటున్నారు. కానీ టెలీస్కోప్ ద్వారా చూడొచ్చని చెబుతున్నారు.

    ఈ ఏడాదిలో ఇది రెండో చంద్ర గ్రహణం అని చెప్పవచ్చు. ఇప్పటి వరకు మార్చి 25న చంద్ర గ్రహణం ఏర్పడింది. ఇప్పడు మరోసారి ఏర్పడుతుంది. అయితే భారత్ తో ఇది పాక్షికం అని చెప్పవచ్చు. కానీ దీని ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా ఉంటుందని కొందరు జ్యోతిష్యులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో గ్రహణం సమయంలో కొన్ని నియమాలు పాటించాలని అంటున్నారు. గ్రహణ సమయంలో ఎటువంటి పూజలు చేయకుండా ఉండాలని అంటున్నారు. ఆలయాలను మూసివేసి చంద్ర గ్రహణం వీడిన తరువాత శుద్ధి చేసుకోవాలని చెబుతున్నారు. అలాగే ఈసమయంలో ఎటువంటి ఆహారం తీసుకోవద్దని అంటున్నారు.

    ఇక చంద్ర గ్రహణం సందర్భంగా కొన్ని మంత్రాలు పఠించడం వల్ల ఆ తరువాత అన్నీ మంచి జరుగుతాయని కొందరు పండితులు పేర్కంటున్నారు. సర్వసృష్టికి, లయకు కారకుడైన మహా శివుడిని స్మరించుకుంటూ ‘ఓం నమ: శివాయా’ అంటూ స్మరించాలని చెబుతున్నారు. ఇలా గ్రహం పూర్తయ్యే వరకు పఠించడంతో ఆ తరువాత అంతా మంచే జరుగుతుందని చెబుతున్నారు. చంద్ర గ్రహణం సందర్భంగా గర్భిణులు బయటకు వెళ్లరాదని చెబుతున్నారు. మనకు పాక్షిక చంద్రగ్రహం అయినప్పటికి శాస్త్రోపేతంగా చూస్తే ఈ నియమం పాటించడమే మంచిదని అంటున్నారు. చంద్ర గ్రహణ సమయంలో ప్రతికూల వాతావరణం ఉంటుంది. ఈ కారణంగా ఈ మంత్రం పఠించడం వల్ల అది అనుకూల శక్తిగా మారుతుందని చెబుతున్నారు. అంతేకాకుండా చంద్ర గ్రహణ సమయంలో కొన్ని రాశుల వారు నేరుగా ఆకాశం వైపు చూడకుండా ఉండాలని చెబుతున్నారు.