Fahadh Faasil: సౌత్ ఇండియా మొత్తం మీద యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకునేం హీరోలలో ఒకరు ఫహాద్ ఫాజిల్. మలయాళం లో ప్రముఖ దర్శక నిర్మాత ఫాజిల్ కుమారుడిగా ఈయన 2000 సంవత్సరం లో వెండితెర అరంగేట్రం చేశాడు. మొదటి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఆడలేదు, ఆయన నటనపై కూడా చాలా ట్రోల్స్ వచ్చాయి. దీంతో కొంత కాలం సినిమాలకు దూరమై వ్యాపారాలు చేసుకొని మళ్ళీ పదేళ్ల తర్వాత ఇండస్ట్రీ లోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. రీ ఎంట్రీ తర్వాత ఫహాద్ ఫాజిల్ ఒక సెన్సేషన్ సృష్టించాడు అనే చెప్పాలి. కేవలం హీరోగా మాత్రమే కాకుండా, రకరకాల పాత్రల ద్వారా ఆయన మలయాళం లో పెద్ద సూపర్ స్టార్ గా ఎదిగాడు. మన టాలీవుడ్ ఆడియన్స్ కి ఈయన ‘పుష్ప’ చిత్రం ద్వారా పరిచయమయ్యాడు. ఆ తర్వాత కమల్ హాసన్ తో కలిసి నటించిన ‘విక్రమ్’ చిత్రం ద్వారా మంచి క్రేజ్ ని సంపాదించుకున్నాడు.
ఇక రీసెంట్ గా విడుదలైన ‘పుష్ప 2 ‘ చిత్రంతో పాన్ ఇండియా లెవెల్ లో ఒక రేంజ్ గుర్తింపు ని తెచ్చుకున్నాడు. విలక్షణ నటుడిగా ఆడియన్స్ లో చెరగని ముద్ర వేసుకున్నాడు. అయితే ‘పుష్ప 2 ‘ చిత్రం పట్ల ఫహాద్ ఫాజిల్ క్యారక్టర్ పై ఆయన అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సోషల్ మీడియా లో వార్తలు వినిపించాయి. సౌత్ ఇండియా లోనే గర్వించదగ్గ నటుడువి నువ్వు, నీ పైన మూత్రం పొసే సన్నివేశాలు ప్లాన్ చేస్తే ఎలా ఒప్పుకున్నావు అంటూ అభిమానులు మండిపడ్డారు. అంతే కాకుండా ఎంతో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారక్టర్ ని డైరెక్టర్ సుకుమార్ ‘పుష్ప 2’ లో చాలా కామెడీ గా చూపించారని, దయచేసి భవిష్యత్తులో ఇలాంటి పాత్రలు చేయొద్దు అంటూ వేడుకుంటున్నారు.
ఈ చిత్రంతో పాటు ఆయన గత ఏడాది రజినీకాంత్ తో కలిసి ‘వెట్టియాన్’ అనే చిత్రంలో నటించాడు. ఇందులో కూడా ఫహాద్ ఫాజిల్ ని కమెడియన్ గా చూపించారు. ఇలాంటి చిత్రాలు చేస్తే రాబోయే రోజుల్లో మలయాళం లో మీ సినిమాలు విడుదల కానివ్వకుండా బ్యాన్ చేస్తామని అభిమానులు హెచ్చరించడం గమనించాల్సిన విషయం. ఇదంతా పక్కన ‘పుష్ప 2’ విడుదల తర్వాత ఫహాద్ ఫాజిల్ ఒక మలయాళం ఇంటర్వ్యూ లో పాల్గొని మాట్లాడిన కొన్ని మాటలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఆయన మాట్లాడుతూ ‘పుష్ప సిరీస్ వల్ల నాకు ప్రత్యేకంగా మైలేజ్ వచ్చిందేమీ లేదు. ఈ సినిమా ద్వారా అభిమానులు కూడా నా నుండి ఏమి ఆశించలేదనుకుంటా. కేవలం సుకుమార్ గారి మీదున్న అభిమానం కారణంగా ఈ చిత్రాన్ని చేసాను. ఈ విషయాన్ని నేరుగా నేను సుకుమార్ కి కూడా చెప్పాను’ అంటూ చెప్పుకొచ్చాడు ఫహాద్ ఫాజిల్.