Gandhi Jayanti: భారతదేశ జాతిపితగా గాంధీజీ గొప్ప గుర్తింపును సంపాదించుకున్నాడు. ఆయనలా అహింసా మార్గాన్ని ఎంచుకొని బతకాలని చాలా దేశాలు ఆయన్ని ఆదర్శంగా తీసుకున్నాయి… అక్టోబర్ 2 వ తేదీన గాంధీజీ జయంతి సందర్భంగా ఆయనను గుర్తుచేసుకున్నారు…ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో గాంధీజీ గురించిన ప్రస్తావనను ఎక్కువగా తీసుకురావడం లేదు…అలాగే ఫ్యాక్షన్, యాక్షన్ సినిమాలకు ఉన్న గుర్తింపు గాంధీజీ సినిమాలకు రావడం లేదు…పోకిరి సినిమాలో షియాజీ షిండే చెప్పినట్టు ‘ గాంధీజీ సినిమాలను ఎవ్వరు చూడటం లేదు..కడప కింగ్ అని తీస్తే 200 సెంటర్స్ 100 డేస్ పక్కా’ అంటూ ఆయన చెప్పిన డైలాగులు ఇప్పుడు పర్ఫెక్ట్ గా సెట్ అవుతున్నాయి… నిజానికి బ్రిటిష్ వాళ్ల పాలనలో చాలా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్న సందర్భంలో ‘మోహన్ దాస్ కరంచంద్ గాంధీ’ అహింసా మార్గాన్ని ఎంచుకొని బ్రిటీష్ వాళ్ళకి కంటిమీద కునుకు లేకుండా చేసి మొత్తానికైతే ఇండియాకి స్వాతంత్ర్యాన్ని సంపాదించి పెట్టాడు…ఇక ఆ తర్వాత కాలంలో మహాత్మా గాంధీ గురించి ఇప్పటివరకు చాలా గొప్పగా చెప్పుకుంటూ వస్తున్నాం…ఇక ఇలాంటి సందర్భంలోనే ఆయన గొప్పతనాన్ని జనానికి తెలియజేయడానికి చాలామంది చాలా సినిమాలైతే తీశారు. అందులో ప్రథమంగా ‘గాంధీ’ అనే సినిమా వచ్చింది… ఇందులో ‘బెన్ కింగ్ స్లే’ గాంధీజీ పాత్ర ను పోషించి ఉత్తమ నటుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక ఈ సినిమాకి ఎనిమిది ఆస్కార్ అవార్డులు రావడం నిజంగా చాలా గొప్ప విషయం అనే చెప్పాలి… ఇక దక్షిణాఫ్రికాలో గాంధీజీ బాల్యం గురించిన ‘ది మేకింగ్ ఆఫ్ మహాత్మా’ అనే సినిమాని చేశారు. ఈ సినిమా కూడా మంచి విజయాన్ని సాధించింది…ఈ మూవీలో రజిత్ కపూర్ గాంధీజీ పాత్రను పోషించాడు…ఆయనకి నేషనల్ అవార్డ్ వచ్చింది…
1993 సర్దార్ వల్లభాయ్ పటేల్ జీవిత కథ ఆధారంగా ‘సర్దార్’ అనే సినిమా తెరకెక్కింది…అందులో గాంధీజీ పాత్రను అన్నూ కపూర్ పోషించారు…ఇక 2000 సంవత్సరంలో కమల్ హాసన్ ముఖ్యపాత్రల్లో నటించిన ‘హే రామ్’ సినిమా కూడా గాంధీజీ లో ఉన్న విభిన్న కోణాన్ని ఆవిష్కరించింది…ఇందులో మహాత్మా గాంధీ పాత్రను ‘నజీరద్దీన్ షా’ పోషించాడు…
ఇక ఆ తరువాత సంజయ్ దత్ హీరోగా వచ్చిన ‘లగేరహొ మున్నాభాయ్’ అనే సినిమాలో గాంధీజీ పాత్ర చాలా బాగుంటుంది…అహింస మార్గంలో నడవడం ఎలా? దాని వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి అనేది తెలియజేశారు… ఇక తెలుగులో చిరంజీవి ఈ సినిమాను రీమేక్ చేసినప్పటికి ఆ మూవీ ప్లాప్ అయింది…
అక్టోబర్ 2 వ తేదీన గాంధీజీ పుట్టిన రోజు సందర్భంగా గాంధీజీకి సంబంధించిన విషయాలను గుర్తుచేసుకోవడంలో గాని ఆయనకి సంబంధించిన సినిమాలు చూడటంలో కానీ, జనాలు పెద్దగా ఆసక్తిని చూపించడం లేదు. నిజానికి తెలుగు సినిమా ప్రేక్షకులైతే గాంధీజీ గురించి పట్టించుకోవడం లేదు.
ప్రస్తుతం గాంధీజీ సినిమాలకంటే ఫ్యాక్షన్, యాక్షన్ సినిమాలకే ఎక్కువ ఆదరణ దక్కుతోంది… బ్రిటిష్ వాళ్ల పాలనను ఎదిరించి ఇండియాకి స్వాతంత్ర్యాన్ని తీసుకొచ్చిన గాంధీజీ గురించి పట్టించుకోకపోవడం చాలా దుర్భరమైన పరిస్థితి అనే చెప్పాలి. ఇక తెలుగు సినిమా దర్శకులు సైతం ఆయన మీద ఎక్కువగా సినిమాలు చేయడం లేదు. ఈ జనరేషన్ వాళ్ళకి గాంధీజీ వ్యక్తి గొప్పతనం గురించి చెప్పే వాళ్ళు కరువైపోయారు. అందుకే ఆయన మీద తీసిన సినిమాల కంటే ఫ్యాక్షన్ సినిమాలకే ఆదరణ పెరిగిపోయింది…