https://oktelugu.com/

వెంకీ, వరుణ్, తమన్నాల రెమ్యూరేషన్లు ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

‘ఎఫ్ 3’.. ప్రస్తుతం ఈ సినిమా కోసం ఇండస్ట్రీలోని కామెడీ టైమింగ్ ఉన్న చాలామంది నటీనటులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే, ఈ సినిమాలో లెక్కకు మించిన కామెడీ పాత్రలు ఉన్నాయి. వాటిల్లో చిన్నాచితకా పాత్రలకు కూడా ఒక ఇంపార్టెన్స్ ఉంటుందట. అందుకేనేమో నిర్మాత దిల్ రాజుకి ఈ సినిమా పై ముందు నుంచీ బాగా నమ్మకం కుదిరింది. మరి అంతగా ఇష్టపడుతున్న ప్రాజెక్టు కాబట్టి.. బడ్జెట్ విషయంలో కూడా రాజుగారు ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. […]

Written By:
  • admin
  • , Updated On : December 16, 2020 / 11:11 AM IST
    Follow us on


    ‘ఎఫ్ 3’.. ప్రస్తుతం ఈ సినిమా కోసం ఇండస్ట్రీలోని కామెడీ టైమింగ్ ఉన్న చాలామంది నటీనటులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే, ఈ సినిమాలో లెక్కకు మించిన కామెడీ పాత్రలు ఉన్నాయి. వాటిల్లో చిన్నాచితకా పాత్రలకు కూడా ఒక ఇంపార్టెన్స్ ఉంటుందట. అందుకేనేమో నిర్మాత దిల్ రాజుకి ఈ సినిమా పై ముందు నుంచీ బాగా నమ్మకం కుదిరింది. మరి అంతగా ఇష్టపడుతున్న ప్రాజెక్టు కాబట్టి.. బడ్జెట్ విషయంలో కూడా రాజుగారు ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. అయితే ఈ సినిమా కోసం దిల్ రాజు భారీగా రెమ్యూరేషన్లు ఇవ్వటమే అందరికి ఆశ్చర్యం కలిగిస్తోంది.

    Also Read: బిగ్ బాస్ పై ఇంట్రస్ట్, నమ్మకం పోకూడదనే.. వాళ్ళను.. !

    ఇంతకీ దిల్ రాజు ఏవరికి ఎంతెంత ఇస్తున్నాడు అంటే.. వెంకటేష్ కి 11 కోట్లు, వరుణ్ తేజ్ కు 8 కోట్లు, తమన్నాకు 2 కోట్లు, ఇక మెహరీన్ కు 75 లక్షలు, అలాగే మరో కీలక పాత్ర చేస్తోన్న కమెడియన్ సునీల్ కు 55 లక్షలు, ఇక సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్ కు 3 కోట్లు, చివరగా టాలెంటెడ్ డైరక్టర్ అనిల్ రావిపూడికి 13 కోట్లు ఇస్తున్నట్లు తెలుస్తోంది. వీళ్ళు కాకుండా సినిమాలో రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్, శ్రీనివాసరెడ్డి, ఇంకా చాలామంది కామెడీ నటులు ఉన్నారు. మరి వీళ్ళు కూడా బాగానే తీసుకుంటారు. ఈ లెక్కన యాక్టర్లు, టెక్నీషియన్లు కలిపి రెమ్యూనిరేషన్లే ఏభై కోట్లు దాటడం ఖాయం.

    Also Read: బాలయ్య సినిమాలో మూగవాడిగా క్రేజీ హీరో !

    మరి రెమ్యూనిరేషన్లకే ఇంత బడ్జెట్ అయితే ఇక సినిమాకి ఎంత బడ్జెట్ అవుతుందో. పెద్ద సినిమా కాబట్టి షూటింగ్ డేస్ ఈజీగా 90 రోజులు కావాలి. అంటే వడ్డీలు, పబ్లిసిటీ ఇలా అన్నీ కలిసి సినిమాకి 85 కోట్ల వరకు బడ్జెట్ అవుతుంది. అసలు వెంకీ వరుణ్ పై అంత బడ్జెట్ వర్కౌట్ అవుతుందా..? ఎఫ్ 2 కే వంద కోట్లు మార్క్ కలెక్షన్స్ దాటితేనే.. నిర్మాత చేతికి వచ్చింది 63 కోట్లు. మరి దిల్ రాజు ఏ లెక్కన ఇంత ఖర్చు పెడుతున్నాడో చూడాలి .

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్