https://oktelugu.com/

ఫెయిల్యూర్ డైరెక్టర్ కు మెగాస్టార్ అభినందనలు !

ఆ దర్శకుడు తీసిన సినిమాలన్నీ భారీ బడ్జెట్ సినిమాలే. ఏ రాజమౌళి లాంటి డైరెక్టర్ కే అలాంటి సినిమా తీయడానికి చాల ఏళ్ళు పట్టింది. కానీ ఈ డైరెక్టర్ రెండో సినిమా నుండే భారీ బడ్జెట్ సినిమాలే తీశాడు. పైగా ఎన్టీఆర్ ను రెండు సార్లు డైరెక్ట్ చేశాడు, ప్రభాస్ ను ఒకసారి డైరెక్ట్ చేశాడు, వెంకటేష్ ను ఒకసారి డైరెక్ట్ చేశాడు, నిజంగా ఇవి ఎంత గొప్ప అవకాశాలు. కానీ.. ఆ డైరెక్టర్ ఒక్క హిట్ […]

Written By:
  • admin
  • , Updated On : December 16, 2020 / 11:02 AM IST
    Follow us on


    ఆ దర్శకుడు తీసిన సినిమాలన్నీ భారీ బడ్జెట్ సినిమాలే. ఏ రాజమౌళి లాంటి డైరెక్టర్ కే అలాంటి సినిమా తీయడానికి చాల ఏళ్ళు పట్టింది. కానీ ఈ డైరెక్టర్ రెండో సినిమా నుండే భారీ బడ్జెట్ సినిమాలే తీశాడు. పైగా ఎన్టీఆర్ ను రెండు సార్లు డైరెక్ట్ చేశాడు, ప్రభాస్ ను ఒకసారి డైరెక్ట్ చేశాడు, వెంకటేష్ ను ఒకసారి డైరెక్ట్ చేశాడు, నిజంగా ఇవి ఎంత గొప్ప అవకాశాలు. కానీ.. ఆ డైరెక్టర్ ఒక్క హిట్ కూడా తీయలేదు. కెరీర్ లో ఒక్క హిట్ కూడా ఇవ్వలేకపోయిన ఆ డైరెక్టరే మెహర్ రమేష్. తీసిన సినిమాలన్ని భారీ బడ్జెట్ సినిమాలు.. కాకపోతే అవి భారీ ప్లాప్ చిత్రాలుగా నిలిచిపోయాయి. దాంతో సినిమా లేక దాదాపు ఎనిమిది సంవత్సరాల నుండి పూర్తిగా ఇంటికే పరిమితం అయిన మెహ‌ర్ రమేష్ కి మంచి టాలెంట్ ఉంది.

    Also Read:  బిగ్ బాస్ పై ఇంట్రస్ట్, నమ్మకం పోకూడదనే.. వాళ్ళను.. !

    నిజంగానే మెహర్ రమేష్ మేకింగ్ హాలీవుడ్ స్థాయిలో ఉంటుంది. అందుకే వేదాళం రీమేక్ ను చేయడానికి మెగాస్టార్ పెద్ద మనసుతో పిలిచి మరీ ఆవకాశం ఇచ్చిన సంగతి తెలిసిందే. కాగా ఇప్పటికే మెగాస్టార్ లేని సీన్స్ ను షూట్ చేసిన మెహర్.. జనవరి నుండి మెగాస్టార్ పై కీలక సీన్స్ ను తీయనున్నాడు. జనవరి 22 నుండి రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ షూట్ జరగనుంది. కాగా మెహ‌ర్ ర‌మేష్ చేసిన స్క్రిప్ట్ వర్క్ మెగాస్టార్ కి చాల బాగా నచ్చిందని.. ముఖ్యంగా కథలోని మెయిన్ ఎమోషన్స్ ను మెహర్ చాలా బాగా పట్టుకున్నాడని మెగాస్టార్ అభినందించారట.

    Also Read: బాలయ్య సినిమాలో మూగవాడిగా క్రేజీ హీరో !

    మొత్తానికి మెహ‌ర్ ర‌మేష్.. మెగాస్టార్ ను ఇంప్రెస్ చేశాడంటే గొప్ప విషయమే. నిజానికి మెహ‌ర్ ర‌మేష్ ఎన్టీఆర్, ప్రభాస్, వెంకటేష్ లాంటి స్టార్ హీరోల‌తో ప్లాప్ సినిమాలు చేసి ఫెయిల్యూర్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నా.. ఒక దర్శకుడిగా ఎప్పుడూ ఫెయిల్ కాలేదనేది వాస్తవం. పైగా మెహర్ సినిమాల్లో క‌మ‌ర్శియ‌ల్ హంగులు బాగా జొప్పిస్తాడు. అన్నిటికి మించి భారీ బ‌డ్జెట్ సినిమాలను చేసిన అనుభవం ఉంది. అందుకే మెహ‌ర్ రమేష్ కి మెగాస్టార్ లైఫ్ చేంజింగ్ ఆఫ‌ర్ ఇచ్చారు. మరి మెహర్ రమేష్ తీస్తోన్న ఈ సినిమా అయినా హిట్ అవుతుందేమో చూడాలి.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్