నిధులు.. నీళ్లు.. నియమాకం కోసమే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది. ఎందరో యువకులు తెలంగాణ కోసం అమరులయ్యారు. మరెందరో లాఠీలదెబ్బలు తిన్నారు. నాడు పోలీసులు పెట్టిన కేసులకు ఎంతోమంది నేటికి కోర్టుల చుట్టూ తిరుగుతున్నవారు ఉన్నారు.
Also Read: ఏపీ నిరుద్యోగులకు శుభవార్త.. వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాలు..?
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి రెండుసార్లు టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినా యువత ఆశలు మాత్రం కలలుగానే మిగిలిపోయాయి. తెలంగాణ ఏర్పడితే లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వస్తాయని.. అందులో తమకో ఉద్యోగం రాకపోదా? అని భావించిన నిరుద్యోగులు ఆశలపై కేసీఆర్ సర్కార్ నీళ్లు చల్లింది.
కేసీఆర్ ఆరేళ్ల పాలనలో కొత్త ఉద్యోగాల భర్తీ నామమాత్రంగానే చేపట్టింది. లక్షల్లో ఖాళీలుగా ఉన్నప్పటికీ వేలల్లోనే భర్తీ చేసి చేతులు దులుపుకుంది. దీంతో నిరుద్యోగుల్లో కేసీఆర్ సర్కార్ పై వ్యతిరేకత ఏర్పడింది. నిరుద్యోగులు ఎన్నోసార్లు కొత్త ఉద్యోగాలు భర్తీ చేయాలని ఆందోళనలు చేపట్టినా సర్కార్ పట్టించుకున్న పాాపానా పోలేదు.
ఈక్రమంలోనే ఇటీవల జరిగిన దుబ్బాక ఉప ఎన్నిక.. గ్రేటర్ ఫలితాల్లో నిరుద్యోగులు సర్కార్ కు వ్యతిరేకంగా ఓటేయడంతో కారు స్పీడుకు బ్రేకులు పడ్డాయి. తత్వం బోధపడిన కేసీఆర్ త్వరలోనే 50వేల ఉద్యోగాల భర్తీ అంటూ ప్రకటనలు గుప్పిస్తున్నారు. అయితే నిరుద్యోగులు మాత్రం కేసీఆర్ మాటలను నమ్మడం లేదని తెలుస్తోంది.
Also Read: డిగ్రీ, బీటెక్ చదివిన విద్యార్థులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్..?
రాబోయే వరంగల్.. ఖమ్మం.. ఎమ్మెల్సీ పట్టభద్రుల స్థానాలు.. నాగార్జున్ సాగర్ ఉప ఎన్నిక.. జమిలి ఎన్నికలను దృష్టిలో ఉంచుకొనే సీఎం కేసీఆర్ 50వేల ఉద్యోగాల భర్తీపై ప్రకటన చేశారనే టాక్ విన్పిస్తోంది. కరోనా ఎంట్రీతో రాష్ట్రా ఆదాయం తగ్గిపోయింది. దీనికితోడు తెలంగాణ సర్కార్ అప్పులకే వేలకోట్ల వడ్డీని ప్రభుత్వం కడుతోంది.
ఇలాంటి సమయంలో కేసీఆర్ సర్కార్ 50వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని ప్రకటించడం వెనుక అనుమానాలను నిరుద్యోగులు వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ రెండోసారి అధికారంలోకి వచ్చాక నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి రెండేళ్లు గడిచినా కనీసం దానిపై ఉలుకు పలుకు లేకుండా పోయింది.
మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్
రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొనే కేసీఆర్ ఎన్నికల జిమ్మిక్కులు చేస్తున్నారని నిరుద్యోగులు భావిస్తున్నారు. ఈ కారణంగానే కేసీఆర్ స్వయంగా 50వేల ఉద్యోగాలు ప్రకటిస్తామని చెబుతున్నా నిరుద్యోగులు మాత్రం నమ్మడం లేదని తెలుస్తోంది. దీంతో సీఎం కేసీఆర్ రాబోయే ఎన్నికల్లోపు నిరుద్యోగులను తనవైపు ఎలా తిప్పుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.