సుధీర్ కు సీమంతం.. ఇదేందయ్యా ఇదీ..?!

“ఇదేందయ్యా ఇదీ.. నేనేడా చూల్లే” అనుకుంటున్నారా? ఈ ప్రకృతి వైపరిత్యాన్ని చూడాలంటే ఈ వేడుకకు హాజరవ్వాల్సిందే! అన్నట్టూ.. మల్లెమాల స్టేజ్ మీఎద జబర్దస్త్ గా జరిగే ఈ శుభ కార్యానికి అందరూ ఆహ్వానితులే! Also Read: మళ్లీ హోస్ట్‌గా ఎన్టీఆర్.. రెమ్యునరేషన్‌ ఎంతంటే ! ఎక్స్ ట్రా ఫన్.. డబుల్ డోస్ వినోదాన్ని పంచే ఎక్స్ ట్రా జబర్దస్త్ లేటెస్ట్ ప్రోమోలో ఈ డిఫరెంత్ రోల్ లో కనిపించి సందడి చేశారు సుడిగాలి సుధీర్, రష్మి. ఈ […]

Written By: Neelambaram, Updated On : December 12, 2020 5:42 pm
Follow us on


“ఇదేందయ్యా ఇదీ.. నేనేడా చూల్లే” అనుకుంటున్నారా? ఈ ప్రకృతి వైపరిత్యాన్ని చూడాలంటే ఈ వేడుకకు హాజరవ్వాల్సిందే! అన్నట్టూ.. మల్లెమాల స్టేజ్ మీఎద జబర్దస్త్ గా జరిగే ఈ శుభ కార్యానికి అందరూ ఆహ్వానితులే!

Also Read: మళ్లీ హోస్ట్‌గా ఎన్టీఆర్.. రెమ్యునరేషన్‌ ఎంతంటే !

ఎక్స్ ట్రా ఫన్.. డబుల్ డోస్ వినోదాన్ని పంచే ఎక్స్ ట్రా జబర్దస్త్ లేటెస్ట్ ప్రోమోలో ఈ డిఫరెంత్ రోల్ లో కనిపించి సందడి చేశారు సుడిగాలి సుధీర్, రష్మి. ఈ తాజా ప్రోమోలో.. సుడిగాలి సుధీర్ వాంతులు చేసుకుంటూ కనిపించాడు. వెంటనే హాస్పటల్‌కి తీసుకుని వెళ్తే.. సన్నీ డాక్టర్ అవతారంలో కనిపించాడు. చెయ్యి పట్టుకొని, “నువ్ నెల తప్పావ్” అని చెప్పి షాక్ ఇచ్చాడు. ఆ తరువాత సుడిగాలి సుధీర్‌కి సీమంతం వేడుక అంగరంగ వైభవంగా సాగింది.

Also Read: ‘బెల్‌ బాటమ్‌’ సినిమా ఎలా ఉంది అంటే.. ?

ప్రసవ వేదన..
సుధీర్ నిండు గర్భిణిగా నొప్పులు పడుతూ పొట్టపై చేయి వేసుకుని నడ్చాడు. సుధీర్‌ తండ్రి క్యారెక్టర్ లో కనిపించిన గెటప్ శీను.. సుధీర్ ను తీసుకొచ్చి కుర్చీలో కూర్చోబెట్టడం.. రాం ప్రసాద్‌తో కలిసి హారతి ఇవ్వడం కామెడీని పంచింది. అయితే.. పల్లెంలో పళ్లు పట్టుకుని ఎంట్రీ ఇచ్చిన రష్మి.. ‘‘కంగ్రాట్యులేషన్స్ అండీ.. అయినా 2 ఎలా తెచ్చుకున్నావ్’’ అంటూ పంచ్ వేసింది. తరువాత ఆపిల్ పండు సుధీర్ చేతిలో పెట్టి.. పండంటి బిడ్డను కనూ అని చెప్పడంతో డబుల్ ఫన్ నింపింది. ఆ ఫన్ మీరు కూడా ఫీలవ్వాలంటే.. తాజా ప్రోమోపై ఓ క్లిక్ వెయ్యాల్సిందే.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్