దేశంలో చాలామందికి బ్యాంకులతో పాటు పోస్టాఫీస్ లలో కూడా అకౌంట్లు ఉన్నాయి. అయితే పోస్టాఫీస్ లలో మినిమం బ్యాలన్స్ నిబంధనల గురించి అకౌంట్ ఉన్నవాళ్లు తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండాలి. లేకపోతే బ్యాలన్స్ కట్ కావడంతో పాటు కొన్నిసార్లు అకౌంట్ క్లోజ్ అయ్యే అవకాశం ఉంది. కొన్ని రోజుల క్రితం డిపార్ట్‌మెంట్ ఆఫ్ పోస్ట్ కౌంట్ ఖాతాదారులు ఈ నెల 11వ తేదీలోపు 500 రూపాయల మినిమం బ్యాలన్స్ కలిగి ఉండాలని సూచనలు చేసింది.
Also Read: 700 ట్రాక్టర్లలో రైతులు ఢిల్లీకి: రహదారి దిగ్బంధనం చేసిన రైతులు..
ఎవరైతే మినిమం బ్యాలన్స్ అకౌంట్ లో కలిగి ఉండలేదో వారి అకౌంట్ లో ఇప్పటికే 100 రూపాయలతో పాటు మెయింటెనెన్స్ ఫీజు రూపంలో జీఎస్టీ కట్ అయింది. ఇకపై కొత్తగా పోస్టాఫీస్ అకౌంట్ ఓపెన్ చేసే వాళ్లు సైతం కనీసం 500 రూపాయలు అకౌంట్ లో ఉంచాలి. అకౌంట్ లో బ్యాలన్స్ సున్నాగా ఉంటే సమాచారం ఇవ్వకుండానే అధికారులు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ను క్లోజ్ చేస్తారు. ఖాతాలో గరిష్టంగా ఎంత మొత్తమైనా డిపాజిట్ చేయవచ్చు.
Also Read: ఇకపై ఆ రాష్ట్రంలో ఉద్యోగులకు డ్రెస్ కోడ్..!
అయితే అకౌంట్ నుంచి నగదు విత్ డ్రా చేసే సమయంలో 500 రూపాయల కంటే ఎక్కువ ఉన్న మొత్తం మాత్రమే విత్ డ్రా చేసే అవకాశం ఉంటుంది. ఇప్పటివరకు బ్యాలన్స్ ఉంచని వాళ్లు కనీసం 500 రూపాయలు ఉండేలా జాగ్రత్త వహిస్తే అకౌంట్ క్లోజ్ కాదు. కేంద్ర ప్రభుత్వం దేశంలోని ప్రజలకు పోస్టాఫీసుల ద్వారా అనేక స్కీమ్ లను అమలు చేస్తోంది. 500 రూపాయల కంటే మినిమం బ్యాలన్స్ తక్కువగా ఉంటే వడ్డీ లెక్కించరు.
మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్
ఆర్థిక సంవత్సరం చివరలో మాత్రమే మినిమం బ్యాలన్స్ కంటే తక్కువ మొత్తం ఉన్నవారి ఖాతాలలో నగదు జమవుతుంది. సంవత్సరాల తరబడి అకౌంట్ లో లావాదేవీలు జరగకపోయినా అకౌంట్ క్లోజ్ అయ్యే అవకాశం ఉంటుంది.