https://oktelugu.com/

Bigg Boss Telugu 8: నేను లేకపోతే వాళ్లిద్దరు ‘జీరో’..ఎన్ని రోజులు హౌస్ లో ఉంటారో చూద్దాం అంటూ నిఖిల్, పృథ్వీ పై సోనియా సెటైర్లు!

ప్రోమో ప్రారంభం లో అర్జున్ 'నా స్టైల్ లోనే మిమ్మల్ని ప్రశ్నలు అడగమంటారా..?' అని సోనియా అని అడగగా, అందుకు ఆమె 'నా స్టైల్ లోనే సమాధానం చెప్పొచ్చా?' అని అంటుంది. హౌస్ లో మీకు మంచి రిలేషన్ ఎవరితో ఏర్పడింది అని అర్జున్ అడగగా, 'అభయ్, నిఖిల్, పృథ్వీ' అని సమాధానం చెప్తుంది సోనియా.

Written By:
  • Vicky
  • , Updated On : September 30, 2024 / 03:36 PM IST

    Bigg Boss Telugu 8(57)

    Follow us on

    Bigg Boss Telugu 8: బిగ్ బాస్ సీజన్ 8 లో ప్రేక్షకులందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన సోనియా ఎలిమినేషన్ ఎట్టకేలకు నిన్న జరగడంతో ఆడియన్స్ చాలా సంతోషంగా ఫీల్ అయ్యారు. బయటకి వచ్చిన తర్వాత ఈమె ఎలా మాట్లాడుతుంది?, ఆమెలో కాస్త అయినా మార్పు వచ్చిందా లేదా అని తెలుసుకోవడం కోసం అర్జున్ అంబటి వ్యాఖ్యాతగా వ్యవహరించే బిగ్ బాస్ 8 బజ్ ఇంటర్వ్యూ కోసం ఎదురు చూసారు ప్రేక్షకులు. ఈ ఇంటర్వ్యూ కి సంబంధించిన ప్రోమో కాసేపటి క్రితమే విడుదలైంది. ఈ ప్రోమో విడుదలైన అతి తక్కువ సమయంలోనే 1 మిలియన్ కి పైగా వ్యూస్ రావడం విశేషం. దీనిని బట్టి ఈ ఇంటర్వ్యూ కోసం ఆడియన్స్ ఎంతలా ఎదురు చూస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇక ఇంటర్వ్యూ బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూస్ హిస్టరీ లోనే ది బెస్ట్ అని చెప్పొచ్చు. అర్జున్ అంబటి ప్రేక్షకుల మనస్సులో సోనియా మీద ఉండే ప్రతీ అభిప్రాయాన్ని డొంకతిరుగుడు లేకుండా, సూటిగా ప్రశ్నలు అడిగి ఆమెకు చమటలు పట్టించాడు.

    ప్రోమో ప్రారంభం లో అర్జున్ ‘నా స్టైల్ లోనే మిమ్మల్ని ప్రశ్నలు అడగమంటారా..?’ అని సోనియా అని అడగగా, అందుకు ఆమె ‘నా స్టైల్ లోనే సమాధానం చెప్పొచ్చా?’ అని అంటుంది. హౌస్ లో మీకు మంచి రిలేషన్ ఎవరితో ఏర్పడింది అని అర్జున్ అడగగా, ‘అభయ్, నిఖిల్, పృథ్వీ’ అని సమాధానం చెప్తుంది సోనియా. అప్పుడు అర్జున్ ‘నిఖిల్ మీ మీద ఏ ఫీలింగ్ ఉంది’ అని అడగగా, ‘మా అన్నయ్య లాగా, యాష్ లాగా, ఇంట్లో వాళ్ళ లాగా అనిపిస్తాడు’ అని అంటుంది సోనియా. అప్పుడు అర్జున్ ‘హౌస్ లోపల కంటెస్టెంట్స్ ని మ్యానిప్యులేట్ చేసినట్టుగా నన్ను కూడా ఎందుకు అక్కడ మ్యానిప్యులేట్ చేయాలనుకుంటున్నావ్?..నువ్వు ఫీల్ అవ్వను అంటే ఒక మాట చెప్తాను’ అని అంటాడు అర్జున్. అప్పుడు సోనియా ‘నేనేమి ఫీల్ అవ్వను అడగండి’ అని అంటుంది. ‘పృథ్వీ కి కోపమే తన మైనస్ అని మీకు తెలిసినప్పటికీ కూడా మీరు వాడిని ఒక ఆయుధం లాగా వాడారని మేము అంటున్నాం’ అని అంటాడు అర్జున్.

    దానికి సోనియా సమాధానం ఇస్తూ ‘పృథ్వీ కి నేనేమి చెప్పాలో అది చెప్పాను’ అని అంటుంది. ‘ముందుండి మీరు ఆటపట్టిస్తున్నారు అంటున్నారు కానీ, వెనుక చేరి ఆట నడిపిస్తున్నారని మా ఆడియన్స్ నమ్ముతున్నారు’ అని అంటాడు అర్జున్. ‘నేను కేవలం నా విశ్లేషణ చెప్తాను అంతే’ అని అంటుంది సోనియా. ‘చేయాల్సింది అంతా చేసేసి, నాకేమి తెలియదు అన్నట్టు కూర్చుంటావు,కపట నాటక సూత్రదారి’ అంటూ సోనియా పై సెటైర్లు విసురుతాడు. మీరు బయటకి వచ్చేసారు కదా ఇప్పుడు నిఖిల్ కి గైడన్స్ ఎవరు ఇస్తారు అని సోనియా ని అర్జున్ అడగగా, దానికి సోనియా సమాధానం చెప్తూ ‘ఇన్ని రోజులు నేను గైడన్స్ ఇవ్వబట్టే మ్యానేజ్ చేస్తూ ఇక్కడ దాకా వచ్చాడు, నేను లేకపోతే వాళ్లిద్దరు ఎన్ని రోజులు వాళ్ళు హౌస్ లో ఉంటారో చూద్దాం’ అంటూ చెప్పుకొచ్చింది.