Homeఎంటర్టైన్మెంట్Bigg Boss Telugu 8: మీ క్రియేటివిటీ తగలెయ్యా..సోనియా ఎలిమినేషన్ ని పండుగ లాగా...

Bigg Boss Telugu 8: మీ క్రియేటివిటీ తగలెయ్యా..సోనియా ఎలిమినేషన్ ని పండుగ లాగా చేసుకుంటున్న ట్రోలర్స్..పొట్టచెక్కలు అయ్యేలా చేస్తున్న వీడియో!

Bigg Boss Telugu 8: గత సీజన్ బిగ్ బాస్ హౌస్ లో బాగా నెగటివిటీ ని సంపాదించుకున్న కంటెస్టెంట్స్ లో ఒకరు శోభా శెట్టి. ఆమె ప్రవర్తన, మాట తీరు కఠినంగా ఉండడం వల్ల నెగటివిటీ ఏర్పడింది కానీ, హౌస్ లో చాలా వరకు న్యాయంగానే వ్యవహరించింది. కాకపోతే దొంగాటలు బాగానే ఆడేది, అలా తప్పుగా ఆడినా కూడా ‘నేనింతే..ఇలాగే ఆడుతా’ అనే యాటిట్యూడ్ తో ఉండడం ఆడియన్స్ కి నచ్చేది కాదు. అందుకే ఆమెపై నెగటివిటీ ఉండేది. కానీ ఎంత నెగటివిటీ ఉన్నప్పటికీ కూడా ఈమె 10 వారాలకు పైగా హౌస్ లో కొనసాగుతూ వచ్చేది. ఎందుకంటే ఈమె అమర్ దీప్ కి బెస్ట్ ఫ్రెండ్ అవ్వడం, ఆయన నామినేషన్స్ లో లేని సమయం లో అమర్ అభిమానులు ఈమెకు ఓటు వేసి సేవ్ చేసేవారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు మాట్లాడుతున్నారు అనుకుంటున్నారా? , ఈ సీజన్ లో అలాంటి నెగటివిటీ ని సంపాదించుకున్న సోనియా కూడా ఉంది కాబట్టే ఉదాహరణ కోసం మాట్లాడుకోవాల్సి వచ్చింది.

ఈమె హౌస్ లోకి అడుగుపెట్టిన నాలుగు వారాల్లోనే బిగ్ బాస్ హిస్టరీ లో ఏ కంటెస్టెంట్ కూడా పోగు చేసుకోనంత నెగటివిటీ ని పోగు చేసుకుంది. ఈమె ఎలిమినేషన్ కోసం సోషల్ మీడియా లో ఒక ఉద్యమమే జరిగిందంటే అతిశయోక్తి కాదేమో. హౌస్ లో నామినేషన్స్ సమయంలో ఆమె తన తోటి కంటెస్టెంట్స్ మీద వదిలే అతి నీచమైన మాటలు, హౌస్ లో టాప్ కంటెస్టెంట్స్ గా పిలవబడే నిఖిల్, పృథ్వీ వంటి వారిని తన చేతిలో కీలు బొమ్మలుగా చేసి ఆడించడం, వారిని టాస్కులో తన చేతిలోని ఒక ఆయుధం లాగా వాడడం, ఇలాంటివి ప్రేక్షకులు సహించలేకపోయారు. అందుకే అందరూ కలిసికట్టుగా ఆమె ఓటమి కోసం పని చేసి బయటకి పంపేశారు. ఈ క్రమం లో సోషల్ మీడియా లో మీమెర్స్, ట్రోలర్స్ పండుగ చేసుకుంటున్నారు అనే చెప్పాలి. రకరకాల ట్రోలింగ్ వీడియోస్ తో సోనియా ని ఏకిపారేస్తున్నారు.

ముఖ్యంగా సీజన్ 6 కంటెస్టెంట్, బిగ్ బాస్ రివ్యూయర్ ఆది రెడ్డి సోనియా ఎలిమినేషన్ తర్వాత నిఖిల్ ఫ్యాన్స్ సెలెబ్రేషన్స్ ఎలా ఉంటాయో చెప్పేందుకు ఆయన బీభత్సం గా డ్యాన్స్ వేస్తూ ఇంస్టాగ్రామ్ లో అప్లోడ్ చేసిన ఒక వీడియో తెగ వైరల్ గా మారింది. నిన్న జరిగిన ఎపిసోడ్ కి సంబంధించి యూట్యూబ్ లో ఒక ట్రోలర్ అప్లోడ్ చేసిన వీడియో ఇప్పుడు తెగ వైరల్ గా మారింది. పలు సూపర్ హిట్ సినిమాలకు సంబంధించిన కామెడీ వీడియోలను జత చేస్తూ సోనియా పై సెటైర్ల వర్షం తో సాగిన ఈ వీడియో ని చూస్తే ఎలాంటి వాడైనా నవ్వుకోవాల్సిందే. మీరు కూడా ఈ వీడియో ని చూసి కడుపుబ్బా నవ్వుకోండి. పాపం బయటకి వచ్చిన సోనియా ఈ వీడియో ని చూస్తే నవ్వుకుంటుందో, ఏడుస్తుందో అని నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు.

 

S8 Funny Comedy Telugu Trolls Day 28 | 420 Troller 3.o

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.
Exit mobile version