Rahul Sipligunj: బిగ్ బాస్ సీజన్ 7 మొదలై మూడు వారాలు అవుతుంది. ఇప్పుడిప్పుడే గేమ్ లో అసలైన మజా స్టార్ట్ అయ్యింది. హౌస్ లోకి కంటెస్టెంట్స్ అందరూ తమ మాస్క్ లు తీసేసి అసలైన గేమ్ ఆడుతున్నారు. ఇక ఇందులో ముఖ్యంగా చెప్పాల్సింది రతిక గురించి హౌస్ లో ఎవరికీ అంతుచిక్కని మైండ్ సెట్ ఆమెది. ఎప్పుడు ఎవరితో ఎలా ఉంటుందో ఎవరికీ అర్థం కాదు. ఒకరి తో మంచిగా ఉంటున్నట్లు అనిపిస్తుంది, అదే సమయంలో వాళ్లనే ఇబ్బందుల్లోకి నెట్టేస్తుంది.
హౌస్ లో సేఫ్ గేమ్ ఆడుతూ , సెంటిమెంట్ పండిస్తున్న రతిక గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఆమె హౌస్ లో ఆడే గేమ్ కంటే కూడా గతంలో ఆమె నడిపిన ప్రేమాయణం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది. హౌస్ లో మాట్లాడుతూ నా మాజీ లవర్ గుర్తుకు వస్తున్నాడు. తాను గుర్తు వస్తే నా మైండ్ నా కంట్రోల్ లో ఉండదు, తాను ఒక సింగర్ అని హింట్ ఇచ్చింది. ఇక వెంటనే ఆమె లవర్ ఎవరై ఉంటారు అని ఆరాలు మొదలవడం ఆ వెంటనే రాహుల్ సిప్లిగంజ్ , రతిక యొక్క ఫోటోలు సోషల్ మీడియాలో దర్శనం ఇవ్వడం జరిగిపోయాయి.
దీనిపై సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. “ఈ ఫేక్ సింపతీ గేమ్స్ ఎప్పటి వరకు ? కొందరు పక్కనోళ్ళ పేరు, ఫేమ్ ఉపయోగించుకోవాలని అనుకుంటున్నారు . వారి గుర్తింపు కోసం నా పేరును అవసరానికి మించి వాడుకుంటున్నారు అంటూ ఫైర్ అయ్యాడు. ఇక సోషల్ మీడియాలో వాళ్ళిద్దరి పర్సనల్ ఫోటోలు లీక్ కావడం పై కూడా స్పందించారు రాహుల్. దాదాపు 6 ఏళ్ల తర్వాత వారి పర్సనల్ ఫోటోలు సోషల్ మీడియా లోకి ఎలా వస్తాయి ..? అంటే లోపలికి వెళ్ళడానికి ముందే ఇందంతా ప్లాన్ చేసుకున్నారా ? సమాధానం ఏంటో మీకు అర్థం అవుతుంది అనుకుంటున్నాను .
అక్కడ ఉంది అమ్మాయైనా, అబ్బాయైనా కానీ, వాళ్ళ జీవితాలతో నాకెలాంటి సంబంధం లేదు. ఇలాంటి ఫోటోలు అప్లోడ్ చేసే ముందు ఆలోచించాలి. ప్రతి ఒక్కరికి లైఫ్ ఉంటుంది. ఇలాంటి వాటి వలన వాళ్ళ ఫ్యామిలీ ఎంత ఇబ్బంది పడుతుందో ఆలోచించాలి. అదే విధంగా గతం , వర్తమానం అంటూ రెండు ఉంటాయి. అసలేం జరిగిందో తెలియకుండా ఎవరిది తప్పో ? ఎవరిదీ ఒప్పో ? డిసైడ్ చేయకండి అంటూ చెప్పుకొచ్చాడు రాహుల్ …