Bhagavanth Kesari: బ్యాడ్ టచ్.. భగవంత్ కేసరి చూస్తే అందరూ మారాల్సిందే.. ఇంతకీ ఏముంది అందులో?

ముఖ్యంగా ఈ సినిమాకి చాలా ప్లస్ అయిన సీన్ ఏంటి అంటే చిన్నపిల్లల మీద ఎవడుపడితే వాడు అనవసరమైన చోట టచ్ చేయడాలు కావాలనే ఎక్కడ పడితే అక్కడ పట్టుకోవడాలు చేస్తూ ఉంటారు. వాళ్ళకోసమే ఒక రేంజ్ లో ఈ సినిమాలో డైలాగ్స్ చెప్పడం జరిగింది.

Written By: Gopi, Updated On : October 21, 2023 3:21 pm

Bhagavanth Kesari

Follow us on

Bhagavanth Kesari: రీసెంట్ గా బాలయ్యబాబు హీరోగా, అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వచ్చిన భగవంత్ కేసరి సినిమా రిలీజ్ అయి మంచి పేరు ని సంపాదించుకొని ముందుకు దూసుకెళ్తుంది.ఇక ఇలాంటి క్రమంలో ఈ సినిమా మీద సగటు ప్రేక్షకుడికి మంచి అంచనాలున్నాయి. అలాగే కొన్ని సీన్లు అయితే అద్భుతంగా ఉన్నాయి. ముఖ్యంగా ఈ సినిమాకి చాలా ప్లస్ అయిన సీన్ ఏంటి అంటే చిన్నపిల్లల మీద ఎవడుపడితే వాడు అనవసరమైన చోట టచ్ చేయడాలు కావాలనే ఎక్కడ పడితే అక్కడ పట్టుకోవడాలు చేస్తూ ఉంటారు. వాళ్ళకోసమే ఒక రేంజ్ లో ఈ సినిమాలో డైలాగ్స్ చెప్పడం జరిగింది.

అయితే సినిమా లో ఈ సీన్ ఎలా జరుగుతుందంటే భగవంత్ కేసరి పోలీస్ స్టేషన్ లో ఉన్నప్పుడు ఒక కానిస్టేబుల్ ఒక ఆటో డ్రైవర్ ని తీసుకుని వచ్చి వీడు పాపకి చాక్లెట్స్ ఇచ్చి ఎక్కడ పడితే అక్కడ చేతులు వేస్తున్నాడు అని ఎస్ఐ తో చెప్తాడు అక్కడే ఉన్న భగవంత్ కేసరి కోపానికి వచ్చి ఆ పాపకి మన బాడీ మీద వేరే వాళ్ళు ఎక్కడెక్కడ చేతులు వేయకూడదు అనే విషయాలను చెప్తాడు అలాగే పాప చదువుకుంటున్న స్కూల్ లోకి వెళ్లి సమయానికి స్కూల్ ల్లో పిల్లలందరి మధ్య ఒక స్పీచ్ అనౌన్స్ మెంట్ జరుగుతుంటే ఆ స్పీచ్ లో భాగంగా భగవంత్ కేసరి అక్కడున్న పిల్లలకి ఎవడు పడితే వాడు చాక్లెట్ ఆశ చూపించి ఎక్కడ పడితే అక్కడ చేతులు వేస్తూ ఉంటారు అంటూ చెబుతూనే అలాగే కొన్ని ప్లేస్ ల్లో ఎవరు చేతులు వేయకూడదని పిల్లలకి ఎవరో ఒకరు చెప్పాలి అది ఎవరు చెపుతారు అంటే ఇంట్లో తల్లి అయినా చెప్పాలి లేదా స్కూల్ లో టీచర్ అయిన చెప్పాలి కానీ ఎవరు చెప్పడం లేదు అంటూ భగవంత్ కేసరి తీవ్ర ఆగ్రహానికి లోనై మాటలు చెప్తూ ఉంటాడు. ఇక ఆడపిల్లల మీద కొన్ని ప్లేసుల్లో ఎవరు చేతులు వేసిన అది ఇంట్లో ఉన్న తాతయ్య, తమ్ముడు అయిన చివరికి నాన్న అయిన సరే ఆ ప్లేస్ లో చేతులు వేస్తే ఇంట్లో ఉన్న అమ్మకు చెప్పాలి అంటూ చాలా ఎమోషనల్ డైలాగులు చెప్పడం జరిగింది. నిజంగా ఈ సినిమా ద్వారా బాలయ్య బాబు గానీ అనిల్ రావిపూడి కానీ సొసైటీ మొత్తానికి ఒక మంచి మెసేజ్ అయితే ఇచ్చారు ఇక దీనిలో చాలా డెప్త్ ఉందనే చెప్పాలి…

ఈ విషయం ద్వారా క్లియర్ గా చెప్పడం ద్వారా సినిమా స్థాయి ఇంకో మెట్టు పైకి ఎక్కిందనే చెప్పాలి. ఆడవాళ్లు సొసైటీలో ఎదుర్కొంటున్న ప్రాబ్లమ్స్ చాలా చక్కగా వివరించారు… ఇక ఇలాంటి సందర్భంలో బాలయ్య బాబు ఈ సినిమా చేసి చాలా మంచి పని చేసారంటూ బాలయ్య బాబు అభిమానులు కూడా ఆయన మీద ప్రశంసలు కురిపిస్తున్నారు. ముఖ్యంగా ఇలాంటి ఆడవాళ్ళ మీద జరిగే అసాంఘికగా చర్యల మీద బాలయ్య బాబు ఎప్పటికప్పుడు తన సినిమాలో చెబుతూనే ఉంటాడు. ఇంతకుముందు లెజెండ్ సినిమాలో కూడా ఆడపిల్లల్ని కనడం గురించి చాలా గొప్ప చెప్పారు ఆ సీన్ చాలా హైలైట్ గా ఉంటుంది… ఇక ఇప్పుడు భగవంత్ కేసరి సినిమాలోని ఆ డైలాగు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది…