https://oktelugu.com/

Koratala Siva: కొరటాల శివ దేవర కోసం అంత పెద్ద రిస్క్ చేస్తున్నారా..?మరి సినిమా వర్కౌట్ అవుతుందా..?

సినిమా ఇండస్ట్రీకి రైటర్ గా ఎంట్రీ ఇచ్చిన కొరటాల శివ చాలా తక్కువ సమయంలోనే దర్శకుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక ఆ తర్వాత ఆయన చేసిన మంచి సినిమాలు సూపర్ సక్సెస్ సాధించడమే కాకుండా తనను స్టార్ట్ డైరెక్టర్ ను కూడా చేశాయి..

Written By:
  • Gopi
  • , Updated On : September 15, 2024 / 11:28 AM IST

    Koratala Siva

    Follow us on

    Koratala Siva: సినిమా ఇండస్ట్రీలో కొరటాల శివ దర్శకుడి గా చాలా మంచి క్రేజ్ అయితే సంపాదించుకున్నాడు. నిజానికి ఆయన కెరియర్ మొదట్లోనే ప్రభాస్ లాంటి స్టార్ హీరోతో ‘మిర్చి ‘ సినిమా చేసి సూపర్ సక్సెస్ ని అందుకున్నాడు. ఇక తర్వాత మహేష్ బాబుతో చేసిన’ శ్రీమంతుడు ‘, ఎన్టీఆర్ తో చేసిన ‘జనతా గ్యారేజ్’, మరోసారి మహేష్ బాబు తో చేసిన ‘భరత్ అనే నేను’ లాంటి సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి. వరుసగా నాలుగు సక్సెస్ లు ఇచ్చిన ‘కొరటాల శివ’ చిరంజీవితో చేసిన ‘ఆచార్య ‘ సినిమాతో మాత్రం భారీగా దెబ్బ తిన్నాడు. ఈ సినిమా భారీ డిజాస్టర్ గా మిగలడమే కాకుండా సినిమా ఇండస్ట్రీలో కొరటాల శివకు చాలా బ్యాడ్ నేమ్ ని కూడా తీసుకువచ్చింది. అలాంటి కొరటాల శివ చేస్తున్న ప్రతి సినిమా మీద ఈ ఇంపాక్ట్ ఉండబోతుంది. ఇక ప్రస్తుతం దేవర సినిమాను కూడా ఆచార్య సినిమాతో పోలుస్తూ ఆచార్య పాదఘట్టం అయితే దేవర సముద్ర ఘట్టం అవుతుంది అంటూ మరికొంతమంది కామెంట్లు చేస్తున్నారు. కొరటాల శివ మీద రోజు రోజుకి తీవ్రమైన వ్యతిరేకత అయితే పెరుగుతుంది.

    దానికి కారణం ఏంటి అనే విషయం పక్కన పెడితే ఈయన వరుసగా నాలుగు సక్సెస్ లను ఇచ్చాడు. చిరంజీవితో చేసిన ఆచార్య ఒక్క సినిమా మాత్రమే ఫ్లాప్ అయింది. అయినప్పటికీ ఎందుకు ఇంత వ్యతిరేకత వస్తుంది అనేది మాత్రం ఎవ్వరికి అర్థం కావడం లేదు. నిజానికి ఆయన లాంటి దర్శకుడు సినిమా ఇండస్ట్రీలో ఉండడం ఒకంతుకు మంచి విషయం అనే చెప్పాలి. కానీ ప్రస్తుతం ఆయన అప్డేట్ అయి ఇప్పుడున్న జనాలకి నచ్చే విధంగా సినిమాలను చేయడం లేదు అంటూ కొన్ని వార్తలైతే వస్తున్నాయి.

    మరి దేవర సినిమా రిజల్ట్ ఎలా ఉంటుంది అనే దానిమీదనే ఇప్పుడు సర్వత్ర ఆసక్తి అయితే నెలకొంది. ఇక ఈ నెల 27వ తేదీన రిలీజ్ కి రెడీ అవుతున్న ఈ సినిమా మీద కొరటాల శివ భారీ ఆశలు పెట్టుకున్నాడు. ఒకవేళ ఈ సినిమా సక్సెస్ అయితే ఆయన పాన్ ఇండియా డైరెక్టర్ గా ఎదుగుతాడు. లేకపోతే మాత్రం ఆయనకి సినిమా ఇండస్ట్రీలో భారీ దెబ్బ పడే అవకాశాలైతే ఉన్నాయి…ఒక రకంగా ఈ సినిమాతో కొరటాల ఒక భారీ సాహసం చేస్తున్నాడనే చెప్పాలి.

    పాన్ ఇండియా సినిమా చేస్తున్న ఈయన డిజాస్టర్ ని మూట గట్టుకుంటే మాత్రం తన కెరియర్ మొత్తం రిస్క్ లో పడే అవకాశాలైతే ఉన్నాయి. ఇక ప్రస్తుతం వస్తున్న నెగిటివిటీని కనక చూసినట్లైతే ఈ సినిమా ప్రేక్షకులందరికీ నచ్చాలంటే ఒక వండర్ అనేది జరగాల్సిందే అంటూ మరి కొంతమంది కామెంట్లు చేస్తున్నారు…