Sankranthiki Vasthunam: సుమారుగా 450 కోట్ల రూపాయిల బడ్జెట్ తో నిర్మాత దిల్ రాజు తన కెరీర్ ని రిస్క్ లో పెట్టి తీసిన చిత్రం ‘గేమ్ చేంజర్’. మొదటి నుండి బడ్జెట్ విషయం లో చాలా కచ్చితంగా ఉండే దిల్ రాజు, ఈ చిత్రానికి డైరెక్టర్ శంకర్ ఎంత అడిగితే అంత డబ్బు ఇచ్చాడు. ఆయన ఏది కోరితే అది తెచ్చిపెట్టాడు. కేవలం పాటల కోసమే ఆయన 80 కోట్లు ఖర్చు చేశాడంటే ఏమనుకోవాలి..?, ప్రస్తుత జనరేషన్ ఆడియన్స్ కి పాటలు కేవలం కథలో అంతర్లీనంగా ఉంటేనే ఎంజాయ్ చేస్తున్నారు. అలా కాకుండా పాత సినిమాల్లో లాగ ఇష్టమొచ్చినట్టు డ్యూయెట్స్ పాడుకోవడం వంటివి ఈమధ్య నచ్చడం లేదు. అవి మూవీ స్క్రీన్ ప్లే కి స్పీడ్ బ్రేకర్స్ లాగా నిలుస్తున్నాయని అంటున్నారు. అలాంటి ట్రెండ్ ఉన్న కాలం లో పాటల కోసం డైరెక్టర్ అడిగాడని ముందు వెనుక ఆలోచించకుండా 80 కోట్లు ఖర్చు చేసాడు.
అలా భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించాడు కాబట్టి, బయ్యర్స్ కి కూడా భారీ రేట్ కి అమ్మాడు. #RRR వంటి సెన్సేషనల్ హిట్ తర్వాత రామ్ చరణ్ నుండి వస్తున్న సోలో చిత్రం కావడంతో బయ్యర్స్ కూడా ఎలాంటి భేరాలు చేయకుండా ఈ చిత్రాన్ని అన్ని ప్రాంతాల్లో ఫ్యాన్సీ రేట్ కి కొనుగోలు చేశారు. ఈ సినిమాతో పాటు దిల్ రాజు నిర్మించిన మరో చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’ ని కూడా ‘గేమ్ చేంజర్’ బయ్యర్స్ కి అమ్మాడు. ఈ చిత్రమే బయ్యర్స్ పాలిట సంజీవని అయ్యింది. మొదటి రోజు ఓపెనింగ్ వసూళ్ల దగ్గర నుండి ఈ చిత్రం అద్భుతాలను నెలకొల్పుతూ ముందుకు దూసుకుపోయింది. మొదటి వారం లోనే 200 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు, 100 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయి. బయ్యర్స్ పండగ చేసుకున్నారు.
‘గేమ్ చేంజర్’ కి వస్తాయి అనుకున్న భారీ వసూళ్లు ఈ చిత్రానికి వచ్చాయి. ఆ సినిమా వల్ల వాళ్లకు కలిగిన నష్టాలను, ఈ చిత్రం పూడ్చేసింది. కానీ ఈ లాభాలు మొత్తం దిల్ రాజు వరకు చేరే అవకాశాలు లేవని తెలుస్తుంది. ‘గేమ్ చేంజర్’ కి వచ్చిన నష్టాల్లో జమ చేసుకుంటున్నారట. మొదటి వారమే నష్టాల్లో నుండి దాదాపుగా బయ్యర్స్ బయటపడ్డారు. ఫుల్ రన్ లో ఈ సినిమాకి వంద కోట్ల రూపాయిల లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఈ లాభాల్లో కేవలం 25 శాతం మాత్రమే దిల్ రాజు జోబులోకి వెళ్లే అవకాశం ఉందట. ఒక్క మాటలో చెప్పాలంటే బయ్యర్స్ కి జాక్పాట్, దిల్ రాజు కి మాత్రం పంగనామాలు అన్నట్టుగా తయారైంది పరిస్థితి. కరోనా లాక్ డౌన్ తర్వాత పాపం దిల్ రాజు కి ఏది కలిసి రావట్లేదు. ఇప్పుడు సక్సెస్ ని అందుకున్నా కూడా సంతృప్తిగా ఎంజాయ్ చేయలేని పరిస్థితి ఏర్పడింది.