Pooja Hegde: యూత్ ఆడియన్స్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించిన హీరోయిన్స్ లిస్ట్ తీస్తే అందులో పూజ హెగ్డే ముందు వరుసలో ఉంటుంది. ‘ఒక లైలా కోసం’ అనే చిత్రం ద్వారా వెండితెర అరంగేట్రం చేసి తొలిసినిమాతోనే సక్సెస్ ని అందుకున్న ఈమె, ఆ తర్వాత వరుణ్ తేజ్ తో ‘ముకుంద’ చిత్రంలో నటించి తొలి పరాజయాన్ని అందుకుంది. కానీ ఈమె అందానికి ఫిదా అయినా బాలీవుడ్ డైరెక్టర్ ఆశుతోష్ గోవారికర్, ఏకంగా హ్రితిక్ రోషన్ ‘మోహెన్ జోడారో’ చిత్రంలో హీరోయిన్ గా నటించే అవకాశం ఇప్పించారు. ఈ సినిమా కూడా కమర్షియల్ గా డిజాస్టర్ ఫ్లాప్ అయ్యింది. దీంతో పూజ హెగ్డే కొంతకాలం వరకు సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. చాలా కాలం గ్యాప్ తర్వాత ఆమె ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో కలిసి ‘దువ్వాడ జగన్నాధం’ చిత్రం తో రీ ఎంట్రీ ఇచ్చింది.
ఈ సినిమా కమర్షియల్ గా పెద్ద హిట్ అవ్వకపోయిన, పూజ హెగ్డే కి మంచి క్రేజ్ ని తెచ్చిపెట్టింది. ఆమె హాట్ అందాలకు కుర్రాళ్ళు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఈ సినిమా తర్వాత ఆమె వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. వరుసగా కమర్షియల్ హిట్స్ ని అందుకుంటూ, స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా నటిస్తూ ఆనతి కాలంలోనే సౌత్ ఇండియా లో పెద్ద స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఈమధ్య కాలం లో వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ కారణంగా ఆమెకి అవకాశాలు తగ్గిపోయాయని అందరూ అనుకున్నారు. కానీ అందులో ఎలాంటి నిజం లేదని తెలిసింది. ప్రస్తుతం ఆమె బాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేస్తూ బిజీ అవ్వడం వల్లే తెలుగు సినిమాల్లో కనిపించడం లేదని తెలుస్తుంది. రీసెంట్ గా ఆమె బాలీవుడ్ లో షాహిద్ కపూర్ తో కలిసి ‘దేవా’ అనే చిత్రంలో హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రం ఈనెల 31 న విడుదల కాబోతుంది.
ఈ సందర్భంగా ఈ మూవీ ప్రొమోషన్స్ లో పూజా హెగ్డే రెగ్యులర్ గా పాల్గొంటుంది. ఇటీవలే ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ని ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్ లో ఆమె పొట్టి దుస్తులు ధరించి, వాటి కారణంగా ప్రైవేట్ భాగాలను కవర్ చేసుకోవడానికి చేతులు అడ్డం పెట్టుకుంటూ చాలా ఇబ్బందికి గురి కావాల్సి వచ్చింది. దానికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఆ వీడియో ని మీరు కూడా క్రింద చూడొచ్చు. ఈ ఈవెంట్ లో ఆమె మాట్లాడుతూ ‘కొన్నిసార్లు బాగున్న సినిమాలకు కలెక్షన్స్ రావు. కొన్నేళ్ల తర్వాత వాటిని ఆడియన్స్ కల్ట్ క్లాసిక్ అని అనేస్తుంటారు. నా వరకు ఒక సినిమాలో మంచి పాత్రలు చేశామా లేదా అనేదే చూస్తాను. ట్రెండ్ కి తగ్గట్టు తనని తాను మార్చుకుంటూ వెళ్తాను’ అంటూ చెప్పుకొచ్చింది పూజ హెగ్డే.