Pawan Kalyan: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎంత బిజీ గా ఉంటున్నాడో మనమంతా చూస్తూనే ఉన్నాం. పాలన బాధ్యతలు చేపడుతూ ఆయన క్షణం తీరిక లేకుండా గడుపుతున్నాడు. దీంతో ఆయన పూర్తి చేయాల్సిన సినిమాలు అలాగే ఉండిపోయాయి. ప్రస్తుతం ఆయన చేతిలో ‘హరి హర వీరమల్లు’, ‘ఓజీ’, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ వంటి చిత్రాలు ఉన్నాయి. వీటిలో ‘హరి హర వీరమల్లు’ చిత్రం షూటింగ్ చివరి దశలో లో ఉంది. పవన్ కళ్యాణ్ ఈ చిత్రానికి ఇప్పుడు కేవలం వారం రోజుల డేట్స్ కేటాయిస్తే సరిపోతుంది. కానీ ఆయన ఆ వారం రోజుల డేట్స్ ని కేటాయించలేకపోతున్నాడు. అంత బిజీ గా ఆయన పాలనాబాధ్యతలు చేపడుతున్నాడు. షూటింగ్ వెళ్తే తన వైపు నుండి నూటికి నూరు శాతం బెస్ట్ ఇవ్వాలని అనుకుంటున్నాడు. అందుకే కాస్త ఖాళీ సమయం దొరికినప్పుడు షూటింగ్ చేయాలని ఆయన భావిస్తున్నాడు.
మరో పక్క ఆయన ఓజీ మూవీ షూటింగ్ ని కూడా పూర్తి చేయాల్సి ఉంది. ఈ సినిమాకి పవన్ కళ్యాణ్ నుండి 20 రోజుల డేట్స్ కావాల్సి ఉంది. ఈ చిత్ర నిర్మాత DVV దానయ్య, డైరెక్టర్ సుజిత్ ఈ వారం పవన్ కళ్యాణ్ తో మంగళగిరి లో భేటీ కాబోతున్నారు. ఈ భేటీ లో ఈ సినిమాకి కావాల్సిన డేట్స్ గురించి చర్చించబోతున్నారు. ఫిబ్రవరి నెలలో ఆయన ఈ చిత్రానికి డేట్స్ కేటాయించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే పవన్ కళ్యాణ్ లేని సన్నివేశాల చిత్రీకరణ మొత్తం పూర్తి చేశారు. రీసెంట్ గానే బ్యాంకాక్ కి వెళ్లిన మూవీ టీం అక్కడ ఒక ఐటెం సాంగ్ తో పాటు విలన్ గ్యాంగ్స్ పై పలు యాక్షన్ సన్నివేశాలను కూడా చిత్రీకరించారు. అవి అద్భుతంగా వచ్చాయని తెలుస్తుంది. ఇటీవలే తిరుమల లో దర్శనం చేసుకున్న ఆ చిత్ర నిర్మాత దానయ్య, మీడియా తో మాట్లాడుతూ త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తామని చెప్పుకొచ్చాడు.
ఇక ‘హరి హర వీరమల్లు’ సినిమా విషయానికి వస్తే, గత వారం రోజుల నుండి బాబీ డియోల్ మీద కొన్ని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. మార్చి 28వ తారీఖున ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్టు అధికారిక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ పార్ట్ కి సంబంధించి చాలా వరకు షూటింగ్ బ్యాలన్స్ ఉండడంతో ఆ తేదీన విడుదల అవ్వడం అనుమానమే అనే వార్తలు సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్నాయి. క్లైమాక్స్ తర్వాత 8 నిమిషాల పాటు పార్ట్ 2 కి సంబంధించిన ఒక క్లిప్ హ్యాంగర్ ని ప్లాన్ చేశారట మేకర్స్. ఇది సినిమాకి చాలా పెద్ద హైలైట్ గా నిలవబోతుంది. ఈ సన్నివేశానికి సంబంధించిన షూటింగ్ కి ఇప్పుడు పవన్ కళ్యాణ్ డేట్స్ అవసరం ఉంది. ఆయన డేట్స్ ఇస్తే అనుకున్న సమయానికి సినిమా విడుదల అవుతుంది, లేదంటే మరో రెండు నెలలు వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి.