Bigg Boss 9 Telugu Emmanuel: ఈ బిగ్ బాస్ సీజన్ (Bigg Boss 9 Telugu) లో ప్రారంభం నుండి నేటి వరకు ఎంటర్టైన్మెంట్ పరంగా కానీ, టాస్కులు ఆడడం లో కానీ, తెలివిగా ఆలోచించడం లో కానీ, ఇలా విన్నర్ అవ్వడానికి ఒక కంటెస్టెంట్ లో ఎలాంటి లక్షణాలు ఉండాలో, అలాంటి లక్షణాలన్నీ ఉన్న ఏకైక కంటెస్టెంట్ ఇమ్మానుయేల్. కమెడియన్స్ కి బిగ్ బాస్ టైటిల్ కొట్టేంత సీన్ లేదు అని అందరూ అనుకుంటున్న సమయంలో ఇమ్మానుయేల్ ఆడియన్స్ కి విన్నర్ గా కనిపించాడు. కానీ అందరితో బాగా ఉండడం తో సేఫ్ ప్లేయర్ అనే ముద్ర గట్టిగా పడింది. అంతే కాకుండా కొన్ని సార్లు చాలా కన్నింగ్ గా కూడా అనిపిస్తుంటాడు. ఈ రెండు లక్షణాలే ఆయన్ని టైటిల్ రేస్ నుండి ఒక రెండు అడుగులు వెనక్కి వెళ్లేలా చేసింది. అయితే ఒక గేమర్ గా బిగ్ బాస్ హిస్టరీ లో ఇమ్మానుయేల్ ఒక తోపు కంటెస్టెంట్ అని చెప్పొచ్చు.
Also Read: ఎక్స్‌క్లూజివ్: ‘రాజా సాబ్’ కథ లీక్.. స్టోరీ ఇదేనట!
ఇదంతా పక్కన పెడితే ఇమ్మానుయేల్ బిగ్ బాస్ హిస్టరీ లో ఆల్ టైం రికార్డు ని నెలకొల్పాడు. ఈ సీజన్ లో ఆయన ఒకసారి కాదు, రెండు సార్లు కాదు, ఏకంగా మూడు సార్లు కెప్టెన్ అయ్యాడు. ఏ తెలుగు బిగ్ బాస్ సీజన్ లో కూడా ఒక కంటెస్టెంట్ ఇన్నిసార్లు కెప్టెన్ అవ్వడం ఎప్పుడూ జరగలేదు. మొదటిసారి కెప్టెన్ అయ్యినప్పుడు తన తల్లి సంజన కోసం త్యాగం చేయాల్సి వచ్చింది. రెండు వారాల తర్వాత టాస్కులు ఆడి కెప్టెన్సీ ని సొంతం చేసుకున్నాడు. ఇక ఈ వారం కూడా ఆయనే కెప్టెన్ అయ్యినట్టు విశ్వసనీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం. ఈ వారం టాస్కులు ఏ రేంజ్ లో జరుగుతున్నాయో మనమంతా చూస్తూనే ఉన్నాం. నిన్నటి ఎపిసోడ్ వాటర్ టాస్క్ లో ఇమ్మానుయేల్, గౌరవ్ విశ్వరూపం చూపించారు.
ఇక నిన్న ఎపిసోడ్ చివర్లో వేసిన ప్రోమో లో, రెండు రైలు బోగీలు ఉండడం, కంటెస్టెంట్స్ అందరూ బజర్ మ్రోగినప్పుడు పరిగెత్తుకుంటూ వెళ్లి డ్రైవర్ సీట్ లో కూర్చోవడం, తమకు ఇష్టం లేని కంటెస్టెంట్ ని కెప్టెన్సీ టాస్క్ నుండి తప్పించడం వంటివి చూశాము. ఈ టాస్క్ లో తనూజ కచ్చితంగా గెలుస్తుందని అనుకున్నారు. కానీ ఇమ్మానుయేల్ గెలిచాడట. దివ్య తనూజ ని కెప్టెన్సీ టాస్క్ నుండి తప్పించిందని టాక్. ఈ ఎపిసోడ్ తర్వాత దివ్య పై సోషల్ మీడియా లో తనూజ ఫ్యాన్స్ నుండి తీవ్రమైన వ్యతిరేకత ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. వచ్చే వారం ఆమె నామినేషన్స్ లోకి వస్తే ఎలిమినేట్ కూడా అవ్వొచ్చు. ఇదంతా పక్కన పెడితే ఇమ్మానుయేల్ నిన్నటితో ఎపిసోడ్ తో మరో ఆల్ టైం రికార్డు ని కూడా నెలకొల్పాడు. వరుసగా 9 వారాలు నామినేషన్స్ లోకి రాని కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారా అంటే అది ఇమ్మానుయేల్ మాత్రమే. ఇది ఆయన్ని విన్నర్ రేస్ నుండి తప్పించింది. పరిస్థితి చూస్తుంటే ఇమ్మానుయేల్ నామినేషన్స్ లోకి రాకుండానే టాప్ 5 లోకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.