Nara Lokesh: వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress) పార్టీ ఇంకా గుణపాఠాలు నేర్చుకోలేదు. ఏ ప్రచారం అయినా కొద్ది రోజులు మాత్రమే పని చేస్తుంది. ఎల్లకాలం పనిచేయదు అన్న విషయాన్ని గ్రహించాలి. కానీ అది మరిచిపోయినట్టు కనిపిస్తోంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. ఏదైనా ఒక అంశాన్ని ఊహించుకొని.. దానికి తగ్గట్టు రాజకీయం చేయడం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అలవాటైన విద్య. ఇప్పుడు మహిళా క్రికెట్ విషయంలో కూడా అదే చేస్తోంది. పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి నుంచి కడప జిల్లా నేత గడికోట శ్రీకాంత్ రెడ్డి వరకు ఒకటే అంశం. అయితే అధినేత నోటి నుంచి ఏ కంటెంట్ వస్తుందో.. అదే కంటెంట్ ను డెవలప్ చేయడం ఆ పార్టీ నేతలకు తక్షణ కర్తవ్యం. చంద్రబాబు విదేశాలకు వెళ్తాడు.. కుమారుడు లోకేష్ క్రికెట్ మ్యాచ్లు చూస్తాడు అంటూ జగన్మోహన్ రెడ్డి విమర్శలు చేశారు. అది మొదలు మహిళా క్రికెట్ విషయంలో వైసీపీ విమర్శలు జుగుప్సాకరంగా ఉన్నాయి.
Also Read: బీహార్ ఎన్నికల ప్రచారానికి దూరంగా చంద్రబాబు.. కారణం అదే!
* ప్రతిష్టాత్మక ప్రాజెక్టు నిలిపివేత..
2014లో అధికారంలోకి వచ్చింది తెలుగుదేశం( Telugu Desam). ఆ సమయంలో ఏపీలో క్రీడల అభివృద్ధిపై దృష్టి పెట్టింది. అనిల్ కుంబ్లే నేతృత్వంలో క్రీడాకారులకు శిక్షణ ఇచ్చేందుకు గాండీవం ప్రాజెక్టు ప్రారంభించింది. అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్టు నిలిచిపోయింది. కనీసం బిల్లులు కూడా చెల్లించలేదు. జాతీయ పోటీలు, రాష్ట్రస్థాయి క్రీడా పోటీల జాడలేదు. సరిగ్గా ఎన్నికలకు ఆరు నెలల ముందు ఆడుదాం ఆంధ్ర అంటూ వైసీపీ శ్రేణులతో క్రీడా పోటీలు నిర్వహించారు. వందల కోట్ల రూపాయలు పక్కదారి పట్టించారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. జాతీయ స్థాయిలో సైతం ఇది విమర్శలకు దారితీసింది. అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తోంది. అయినా సరే వ్యతిరేక ప్రచారాలు, విమర్శలు మానుకోవడం లేదు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ.
* క్రికెట్ ను అభివృద్ధి చేయాలని..
మంత్రి నారా లోకేష్ ( Minister Nara Lokesh)తన శక్తి యుక్తులను వినియోగిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ ను అభివృద్ధి చేయాలని చూస్తున్నారు. ప్రస్తుతం ఐసీసీ అధ్యక్షుడిగా ఉన్నారు జై షా. కేంద్రమంత్రి అమిత్ షా కుమారుడు జై షా. దీంతో నారా లోకేష్ కు అరుదైన అవకాశం దక్కింది. హోంమంత్రి అమిత్ షా హోంమంత్రి అమిత్ షా ద్వారా ఆయన కుమారుడికి మరింత దగ్గరయ్యారు. ఏపీలో క్రికెట్ క్రీడాభివృద్ధికి సంబంధించి సహాయ సహకారాలు తీసుకుంటున్నారు. మొన్న మహిళా క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జై షా తో కలిసి తిలకించారు. అది ఎంత మాత్రం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి మింగుడు పడడం లేదు. అందుకే జగన్మోహన్ రెడ్డి లోకేష్ విషయంలో క్రికెట్ మ్యాచ్ చూస్తారు అంటూ విమర్శలు చేయగలిగారు.
* ఆతిథ్య రాష్ట్రం కావడంతో..
మహిళా క్రికెట్ వరల్డ్ కప్ విశాఖలోనే ప్రారంభం అయింది. ఆతిథ్య రాష్ట్రంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసింది. మంత్రి లోకేష్ స్వయంగా హాజరయ్యారు. ఆ ప్రారంభ మ్యాచ్ కు ఐసీసీ అధ్యక్షుడు జై షా కూడా వచ్చారు. దీంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరింత మంట పుట్టింది. ఆపై లోకేష్ ఫైనల్ మ్యాచ్ కు హాజరు కావడం. క్రికెట్ దిగ్గజం టెండూల్కర్ తో సమావేశం కావడం. అటు వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో భారత్ గెలవడం.. కడపకు చెందిన శ్రీ చరణి మంచి నైపుణ్యం కనబరచడం.. ప్రభుత్వం సైతం ఆమెకు ప్రోత్సాహం అందించేందుకు సిద్ధపడటం.. ఈరోజు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి సచివాలయం వరకు భారీ స్వాగత ర్యాలీ ఏర్పాటు చేయడం వంటివి ఎంత మాత్రం మింగుడు పడటం లేదు. అందుకే ఈ విషయంలో నారా లోకేష్ ను టార్గెట్ చేస్తోంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. తాము చేయలేనిది లోకేష్ చేశారన్న బాధ జగన్మోహన్ రెడ్డిలో స్పష్టంగా కనిపిస్తోంది.