రూ.కోటి గెలుచుకున్నా దక్కించుకున్న మొత్తం ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే: జెమినీ టీవీలో గత కొద్ది రోజుల నుంచి ప్రసారమవుతున్న షో ‘ఎవరు మీలో కోటీశ్వరులు’(Evaru Meelo Koteswarulu). యంగ్ టైగర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఈ షో సక్సెస్ ఫుల్ గా సాగిపోతుంది. ఎన్టీఆర్ హోస్టింగ్ తో తనదైన సత్తా చూపుతూ అందరిని ఆకట్టుకుంటున్నాడు. కానీ ఈ షోలో ఇంతకీ ఏ ఒక్కరు కోటి రూపాయలు కూడా గెలుచుకోలేదు.
తమ ప్రతిభ ద్వారా సామాన్యులని కోటేశ్వరుని చేయడమే ఈ షో యొక్క ముఖ్య ఉద్దేశం. కౌన్ బనేగా కరోడ్పతి అనే పేరుతో హిందీలో ఈ షో మాత్రం అత్యంత ప్రజాదరణ పొంది సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. తద్వారా షో నిర్వాహకులు దీన్ని తదితర భాషల్లోకి కూడా తీసుకొచ్చారు. అలా తెలుగులో ఈ కార్యక్రమం ఎవరు మీలో కోటీశ్వరులు గా రూపుదిద్దుకున్నది.
అయితే నిన్న (మంగళవారం) ఎపిసోడ్ లో భద్రాద్రి జిల్లా, కొత్తగూడెం పట్టణానికి చెందిన సబ్ ఇన్స్పెక్టర్ బి. రాజా రవీంద్ర ఎవరు మీలో కోటేశ్వరులో కోటి రూపాయలు గెలుచుకున్న సంగతి తెల్సిందే. అయితే కోటి రూపాయలు గెలుచుకున్న ఆయన కి దక్కే ప్రైజ్ మనీ మాత్రం 68,80,000 మాత్రమే. మిగతా 31,20,000 వేలు పన్ను రూపం లో ప్రభుత్వానికి కట్టాల్సి ఉంటుంది. ఏదైనా గేమ్ షో లో రూ. 10,000 మించి గెలిస్తే కచ్చితంగా ప్రభుత్వానికి టాక్స్ రూపం లో చెల్లించాల్సి ఉంటుంది.