పండంటి బిడ్డకి జన్మనిచ్చిన నటరాజ్ మాస్టర్(Natraj Master): నటరాజ్ మాస్టర్ పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. ఈ మధ్య బిగ్ బాస్ పుణ్యమా అంటూ కాస్త అందరి దృష్టిలో పడ్డాడు. కొరియోగ్రాఫర్‌గా అనేక సినిమాలకు పనిచేసిన నటరాజ్ మాస్టర్.. ఓంకార్ ఆట డాన్స్‌తో పాపులర్ అయ్యారు. అయితే ఈ మధ్య కాలంలో యూట్యూబ్ ఇంటర్వ్యూలకే పరిమితం అయిన ఆయన.. బిగ్ బాస్ సీజన్ 5 కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చి అందర్నీ సర్ ప్రైజ్ చేశారు.
బిగ్ బాస్ హౌస్ లోకి 12వ కంటెస్టెంట్‌గా అడుగుపెట్టిన నటరాజ్ మాస్టర్.. క్లిష్టమైన పరిస్థితుల్లో ఇష్టం లేకకపోయినప్పటికీ తన భార్య నీతూ బలవంతంపై బిగ్ బాస్‌కి రావాల్సి వచ్చింది. కారణం ఏంటంటే నటరాజ్ మాస్టర్ భార్య నిండు గర్భిణి. తన డాన్స్ గ్రూప్‌లో డాన్సర్‌గా పనిచేసే నీతూ అనే డాన్సర్‌ని 2009లో ప్రేమ పెళ్లి చేసుకున్నారు నటరాజ్ మాస్టర్. ఏడేళ్ల పాటు నటరాజ్ మాస్టర్‌ని ప్రేమించి చివరికి తన ప్రేమను గెలుచుకుంది నీతూ.
అయితే నటరాజ్ మాస్టర్ బిగ్ బాస్ లో నాలుగో వారానికే ఎలిమినేట్ అయ్యారు. నటరాజ్ మాస్టర్ బిగ్ బాస్ హౌస్ లో కి రాకముందే నీతూ ఏడు మాసాలు నిండిన నిండు గర్భిణి. అయితే నటరాజ్ మాస్టర్ ఎలిమినేట్ అయ్యి నాలుగు వారాలు పైనే అయ్యింది. ఈ క్రమంలో నటరాజ్ తన సోషల్ మీడియా (ఇన్ స్టాగ్రామ్) ఖాతా నుండి తనకి పండంటి ఆడబిడ్డ జన్మించింది అని తెలిపాడు. ఈ పోస్ట్ కి ఎలిమినేట్ అయిన బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అందరూ నటరాజ్ మాస్టర్ దంపతులకి శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఈ మధ్యనే బిగ్ బాస్ సీజన్ 3 ఫేమ్ అలీ రెజా దంపతులు కూడా పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెల్సిందే.