Elnaaz Norouzi: ప్రస్తుతం ఇరాన్ దేశంపై ఇజ్రాయిల్ , అమెరికా దేశాలు చేస్తున్న దాడులు ఎంత ఉద్రిక్తత పరిస్థితులను నెలకొల్పుతున్నాయో మన కళ్లారా చూస్తూనే ఉన్నాం. ఈ యుద్ధం లో ఇరాన్ సుప్రీమ్ లీడర్ ఖమేనీ చనిపోవడం పెద్ద సంచలనంగా మారింది. ఇరాన్ దేశం ఎప్పుడైతే అణ్వాయుధాలను తయారు చేయడం మొదలు పెట్టిందో , అప్పటి నుండే ఈ యుద్దానికి భీజం పడింది. ఇరాన్ వద్ద అణ్వాయుధాలు ఉంటే ఇజ్రాయిల్ పై దాడి చేస్తుంది. ఈ ముప్పు ఎప్పటి నుండో ఉంది. అందుకే ఈ యుద్ధం జరుగుతోంది. అయితే ఈ యుద్ధం లో ఖమేనీ చనిపోవడం పై ఇరాన్ దేశ ప్రజలు సంబరాలు చేసుకుంటూ ఉంటే , మన దేశంలోని కొంతమంది ముస్లిమ్స్ మాత్రం తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేస్తూ ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడం హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపథ్యంలో ఇరాన్ హీరోయిన్ ఎల్నాజ్ నొరౌజీ చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.
ఖమేనీ చనిపోయిన తర్వాత ఈమె సంబరాలు చేసుకుంటూ సోషల్ మీడియా లో అప్లోడ్ చేసిన వీడియో బాగా వైరల్ అయ్యింది. అంతే కాకుండా, ఇప్పుడు నేను ఇరాన్ దేశానికీ వెళ్తే , నన్ను కచ్చితంగా చంపేస్తారు అంటూ చెప్పుకొచ్చింది. 8 ఏళ్ళ వయస్సులోనే ఎల్నాజ్ ఇరాన్ దేశాన్ని వీడింది. ఆ తర్వాత ఈమె యూరోప్ లో మోడలింగ్ నేర్చుకుంది. ప్రస్తుతానికి ఈమె ఇండియాలోనే ఉంటోంది. ఈమె సినీ ప్రస్థానాన్ని ఒకసారి చూస్తే, 2018 వ సంవత్సరం లో ‘మాన్ జావో నా ‘ అనే ఉర్దూ చిత్రం ద్వారా వెండితెర అరంగేట్రం చేసింది. ఆ తర్వాత ‘కిది కుంధీ’ అనే పంజాబీ చిత్రం లో నటంచింది. ఈ రెండు సినిమాల తర్వాత ఆమె ‘సాక్రేడ్ గేమ్స్’ అనే వెబ్ సిరీస్ లో నటించింది.
Also Read: రవితేజ తన రెమ్యూనరేషన్ ను వెనక్కి ఇచ్చేసిన సినిమా ఏంటో తెలుసా..?
ఈ వెబ్ సిరీస్ పెద్ద హిట్ అవ్వడం , అందులో నటించిన ఈమెకు మంచి క్రేజ్ రావడం తో , సినిమాల్లో అవకాశాలు క్యూలు కట్టాయి. బాలీవుడ్ లో వరుసగా ఒక పక్క సినిమాలు చేస్తూనే మరోపక్క వెబ్ సిరీస్ లు కూడా చేస్తూ ఫుల్ బిజీ గా మారి, యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ని సొంతం చేసుకుంది. అంతే కాదు ఈమె హాలీవుడ్ లోకి కూడా రీసెంట్ గానే అడుగుపెట్టింది. ప్రస్తుతం ఆమె ‘హోటల్ టెహ్రాన్ ‘ అనే ఇంగ్లీష్ చిత్రం లో హీరోయిన్ గా నటిస్తోంది.