Bigg Boss 7 Telugu: ఓట్లతో సంబంధం లేకుండా ఎలిమినేషన్… ఈ వారం ఆ కంటెస్టెంట్ అవుట్

ఓట్ల సరళి పరిశీలిస్తే... పల్లవి ప్రశాంత్ టాప్ లో ఉన్నాడని సమాచారం. మొదటి స్థానంలో ఉన్న శివాజీని ప్రశాంత్ అధిగమించాడట. అయితే ఇద్దరి మధ్య స్వల్ప ఓట్ల తేడా మాత్రమే ఉందని వినికిడి.

Written By: NARESH, Updated On : December 2, 2023 11:59 am

Bigg Boss 7 Telugu

Follow us on

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ హౌస్లో రానున్న మూడు వారాలు కీలకం. హౌస్లో 8 మంది కంటెస్టెంట్స్ ఉండగా ఐదుగురు ఫైనల్ కి వెళతారు. మిగతా ముగ్గురు ఎలిమినేట్ అవుతారు. మరి ఫైనల్ కి వెళ్ళేది ఎవరు? ఎలిమినేట్ అయ్యేది ఎవరు? అనే ఊహాగానాలు మొదలయ్యాయి. 13వ వారానికి జరిగిన నామినేషన్స్ లో 7 గురు నామినేట్ అయ్యారు. శివాజీ, అర్జున్, గౌతమ్, ప్రియాంక, శోభ, ప్రశాంత్, యావర్ నామినేట్ అయ్యారు. ఓట్ల ఆధారంగా ఒకరు ఎలిమినేట్ కావాల్సి ఉంది.

ఓట్ల సరళి పరిశీలిస్తే… పల్లవి ప్రశాంత్ టాప్ లో ఉన్నాడని సమాచారం. మొదటి స్థానంలో ఉన్న శివాజీని ప్రశాంత్ అధిగమించాడట. అయితే ఇద్దరి మధ్య స్వల్ప ఓట్ల తేడా మాత్రమే ఉందని వినికిడి. వీరిద్దరి తర్వాత మూడో స్థానంలో స్పై బ్యాచ్ కే చెందిన యావర్ ఉన్నాడట. నాలుగో స్థానంలో అనూహ్యంగా అర్జున్ వచ్చి చేరాడని సమాచారం. ఐదో స్థానంలో గౌతమ్ ఉన్నారట.

ఇక చివరి రెండు స్థానాల్లో ప్రియాంక, శోభ ఉన్నారట. అందరికంటే శోభకు తక్కువ ఓట్లు నమోదయ్యాయని తెలుస్తుంది. దీని ప్రకారం ప్రియాంక, శోభలలో ఒకరు ఎలిమినేట్ కావాలి. అయితే ఓటింగ్ తో సంబంధం లేకుండా గౌతమ్ ని ఎలిమినేట్ చేయనున్నారట. దీనికి సర్వం సిద్ధమైందని టాక్. ప్రియాంక, శోభలలో ఒకరు ఖచ్చితంగా ఫైనల్ లో ఉంటారట. ఇద్దరూ ఉన్నా ఆశ్చర్యం లేదంటున్నారు.

శివాజీ, పల్లవి ప్రశాంత్ ఫైనల్ లో ఉండటం ఖాయం. అర్జున్ ఫినాలే అస్త్ర గెలిచి మొదటి ఫైనలిస్ట్ అయ్యాడు. మరో ఇద్దరికి మాత్రమే ఛాన్స్ ఉంది. ప్రియాంక కూడా ఫైనల్ లో ఉండే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. మొత్తంగా చూడాలి ఇక ఏం జరగనుందో. గత వారం డబుల్ ఎలిమినేషన్ ద్వారా అశ్విని, రతిక రోజ్ ఎలిమినేట్ అయ్యారు.