Dinner: అందమైన జీవితం గడపాలని చాలా మంది అనుకుంటారు. అందుకోసం డబ్బు సంపాదనే ధ్యేయంగా పెట్టుకుంటారు. దీంతో రాత్రనక, పగలనక సంపాదన కోసం కష్టపడుతుంటారు. ఈ క్రమంలో ఆరోగ్యం గురించి మరిచిపోతుంటారు. ఆరోగ్యం విషయంలో కాస్త నిర్లక్ష్యం చేయడం వల్ల పెద్ద పెద్ద రోగాలను కొని తెచ్చుకున్నవారవుతారు. ముఖ్యంగా రోజూవారీ ఆహారపు అలవాట్లను పాటించకపోవడం వల్ల శరీరంలో అనేక ఆరోగ్య సమస్యలు ఎదురవుతున్నాయి. ప్రతిరోజూ ఒకే సమయంలో భోజనం చేయాలని చాలా మంది వైద్యులు సూచిస్తుంటారు. కానీ పనుల వల్ల సమయానికి తినలేకపోతుంటారు. అయితే కొంత మంది డిన్నర్ ను ఆలస్యంగా చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల ఏర్పడే నష్టాలేంటంటే?
పొద్దంతా కష్టపడి రాత్రి వచ్చిన తరువాత కాస్త రిలాక్స్ కావాలని చూస్తారు. ఇలా స్నేహితులతో, ఇంట్లో వారితో మాట్లాడుతూ సమయం గురించి ఆలోచించరు. కొందరు ఇతర వ్యాపకాల వల్ల సమయం వృథా చేసి తినే సమయం దాటిన తరువాత భోజనం చేస్తారు. ఎన్ సీబీఐ పరిశోధనల ప్రకారం రాత్రి 9 గంటల తరువాత భోజనం చేయొద్దని చెప్పారు. అలా చేయడం వల్ల అజీర్ణ సమస్యలు వస్తాయని పేర్కొన్నారు. ఆలస్యంగా భోజనం చేయడం వల్ల జీర్ణక్రియలో అనేక సమస్యలు వస్తాయని తెలిపారు.
చాలా మంది రాత్రి భోజనం చేసిన వెంటనే నిద్రలోకి వెళ్తారు. ఇలా తిన్న వెంటనే నిద్రపోవడం వల్ల శరీరం కదలిక లేకపోవడంతో ఆహారం జీర్ణం కాకుండా అలాగే ఉండిపోతుంది. దీంతో ఉదయం చాలా నీరసంగా ఉంటుంది. అందువల్ల తిన్న తరువాత కనీసం 2 గంటల ఆలస్యంగా నిద్రపోవాలని అంటున్నారు. లేదా భోజనం చేసిన తరువాత అటూ ఇటూ నడవాలి. అప్పుడే పొట్ట కాస్త కంట్రోల్ గా ఉండి జీర్ణక్రియ సక్రమంగా పనిచేస్తుది.
ఇక కొందరు అర్ధరాత్రి దాటిన తరువాత భోజనం చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల అనేక రోగాలు వస్తుంటాయని చెబుతున్నారు. అర్ధరాత్రి దాటిన తరువాత తిన్న ఆహరం అసలే జీర్ణం కాదని అంటున్నారు. ఎందుకంటే ఈ సమయంలో భోజనం చేసిన వారు వెటనే నిద్రిస్తారు. అలా చేయకపోతే శరీరం అలసట అవుతుంది. అందువల్ల అర్ధరాత్రి దాటిన తరువాత భోజనం చేయకూడదు. అవసరమనుకుంటే లైట్ ఫుడ్ తీసుకొని ఉదయం లేచిన తరువాత ఏదైనా బ్రేక్ ఫాస్ట్ చేయాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.