చివరికీ.. వేశ్యగా తెలుగు హీరోయిన్ !

తెలుగు బ్యూటీ ‘ఈషా రెబ్బ’ మరో ఛాలెంజింగ్ పాత్రలో కనిపించబోతోంది. నిజానికి ఈషాకి మొదటినుంచీ బాగానే అవకాశాలొచ్చినా ఆశించిన స్థాయిలో విజయాలు మాత్రం దక్కలేదు. దాంతో, పాపకి స్టార్ డమ్ రాకుండా పోయింది. అందుకే చివరికీ ఈ మధ్య హాట్ స్టిల్స్ తెగ వదులుతూ ‘నాలో కూడా హాట్ బ్యూటీ ఉంది, నన్ను వాడుకోండి మహాప్రభో’ అంటూ మేకర్స్ కి పరోక్షంగా మొర పెట్టుకుంటుంది. అయితే తాజాగా ఈ బ్యూటీకి ఒక బోల్డ్ క్యారెక్టర్ వచ్చింది. అన్నీ […]

Written By: admin, Updated On : January 17, 2021 2:48 pm
Follow us on


తెలుగు బ్యూటీ ‘ఈషా రెబ్బ’ మరో ఛాలెంజింగ్ పాత్రలో కనిపించబోతోంది. నిజానికి ఈషాకి మొదటినుంచీ బాగానే అవకాశాలొచ్చినా ఆశించిన స్థాయిలో విజయాలు మాత్రం దక్కలేదు. దాంతో, పాపకి స్టార్ డమ్ రాకుండా పోయింది. అందుకే చివరికీ ఈ మధ్య హాట్ స్టిల్స్ తెగ వదులుతూ ‘నాలో కూడా హాట్ బ్యూటీ ఉంది, నన్ను వాడుకోండి మహాప్రభో’ అంటూ మేకర్స్ కి పరోక్షంగా మొర పెట్టుకుంటుంది. అయితే తాజాగా ఈ బ్యూటీకి ఒక బోల్డ్ క్యారెక్టర్ వచ్చింది. అన్నీ అనుకున్నట్టు జరిగితే త్వరలోనే ఈ తెలుగు పిల్ల, ఓ వేశ్య పాత్రలో కనిపించబోతోంది.

Also Read: చిరు ‘ఆచార్య’లో రాంచరణ్ షాకింగ్ లుక్ రిలీజ్

దర్శకుడు వెంకీ కుడుముల ఓ వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తున్నాడు. తన దగ్గర చాన్నాళ్లుగా వర్క్ చేస్తున్న వినయ్ అనే కుర్రాడికి దర్శకత్వ బాధ్యతలు అప్పగిస్తూ.. మెట్రో సిటీ బ్యాక్ డ్రాప్ లో అల్లిన ఓ వేశ్య కథలో ఈషాను మెయిన్ లీడ్ గా పెట్టి సిరీస్ తీయబోతున్నారు. మొత్తానికి ఓ కాల్ గర్ల్ జీవితంలో మూడు దశల్లో జరిగిన వివిధ ఘటనల ఆధారంగా ఈ వెబ్ సిరీస్ నడుస్తోందట. పైగా సెమి న్యూడ్ లో కనిపించనుంది ఈషా. ఆల్రెడీ ఓ ఛాలెంజింగ్ రోల్ చేస్తోంది ఈషా రెబ్బా. త్వరలోనే స్ట్రీమింగ్ కు రాబోతున్న “లస్ట్ స్టోరీస్” వెబ్ సిరీస్ లో స్వయంతృప్తి పొందే గృహిణి పాత్రలో కనిపించబోతోంది.

Also Read: ప్రభాస్ కోసం మరో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ !

ఇప్పుడు కాల్ గర్ల్ క్యారెక్టర్ కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తన కెరీర్ పరంగా తానూ ఆశించేది ఒకటి.. కానీ తనకు దక్కుతుంది మరొకటి అందుకే గ్లామర్ డోస్ రోజురోజుకు పెంచుకుంటూ పోతుందట. ఇక ‘అంతకు ముందు ఆ తరువాత’ సినిమా ద్వారా తెలుగు వెండితెరకు హీరోయిన్ గా పరిచయమైన, ఈ అచ్చ తెలుగు బ్యూటీ ఆ తర్వాత ‘అమీతుమీ’, ‘అ’, అరవింద సమేత లాంటి సినిమాల్లో తన యాక్టింగ్ తో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. మరి ఇప్పుడు తనే ప్రధాన పాత్రలో రాబోతున్న బోల్డ్ వెబ్ సిరీస్ తో హిట్ అందుకుని స్టార్ డమ్ సంపాధిస్తుందేమో చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్