పెళ్లి.. చాలామంది జీవింతలో ఒకేసారే జరుగుతుంది. కానీ, నయనతార జీవితంలో మాత్రం ఇప్పటికే ఎన్నోసార్లు జరిగిపోయింది, మళ్ళీ జరుగుతూనే ఉంది. పుకార్లు అయినా, పెళ్లి అయిపోయిందనట్టే హడావుడి చేస్తారు మీడియా జనం. పాపం.. నయనతారకు తాజాగా మళ్ళీ పెళ్లి చేసింది తమిళ మీడియా. దాదాపు నాలుగేళ్లుగా విఘ్నేష్ శివన్ తో డేటింగ్ చేస్తూ.. సుఖంగా బతుకుతున్న నయనతారను, పుకార్లతో మాత్రం తెగ బాధ పెడుతున్నారట. ఈ జంట పెళ్లి చేసుకుంటుందంటూ గడిచిన 6-7 నెలలుగా అనేక రకాలుగా పుకార్లు పుట్టిస్తూనే ఉన్నారు.
Also Read: బికినీ వేయడం ఇష్టమే – అనసూయ
ఆ మధ్య ఈ లాక్ డౌన్ టైమ్ లో ఆ పుకార్లు మరింత ఎక్కువయ్యాయి. మరీ ముఖ్యంగా అటు విఘ్నేష్, ఇటు నయన్ వాటిని ఖండించకపోవడంతో మరిన్ని ఊహాగానాలు చెలరేగిపోయాయి. ముఖ్యంగా నయన్-విఘ్నేష్ సింపుల్ గా ఓ గుడిలో పెళ్లి చేసుకుంటారనే టాక్ బలంగా వినిపించింది. దాంతో నయనతారకు చాలమంది ప్రముఖులు ఫోన్స్ మీద ఫోన్స్ చేసి.. పెళ్లి రోజు శుభాకాంక్షలు కూడా చెప్పారట, వారందరికీ వివరణ ఇవ్వడం ఇష్టంలేని ఈ ముదురు హీరోయిన్, చివరకు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి కూర్చింది. అంతలా నయనతారను ఇబ్బంది పెట్టారట.
Also Read: చివరికీ.. వేశ్యగా తెలుగు హీరోయిన్ !
పాపం లేడీ సూపర్ స్టార్ గా నయనతార ఎంతవరకు ఆ స్టార్ డమ్ ను ఎంజాయ్ చేస్తోందో తెలియదు గానీ, తన ఇమేజ్ వల్ల వచ్చే పుకార్ల పరంపర పై మాత్రం బాగా ఫీల్ అవుతూ రోజురోజుకూ విరక్తి చెందుతుందట. దీనికితోడు నయనతార వ్యక్తిగత జీవితంలోని ప్రేమ కథల గురించి కథలుకథలుగా రాస్తూ.. ఇంకా బాధ పెడుతుంటారు రాతల రాయళ్లు. అయినా ప్రస్తుతం నయనతారకు సినిమా షూటింగ్స్ లేవు కాబట్టి, ఇప్పుడే పెళ్లి చేసుకుంటే కాల్షీట్ల సమస్య ఉండదు. పనిలోపనిగా వెంటనే కాపురం కూడా పెట్టేయొచ్చు అంటూ తాజాగా మళ్ళీ నయనతార పెళ్లి పై లొల్లి పెట్టారట తమిళ జనాలు.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్