https://oktelugu.com/

Pawan Kalyan: రాజకీయాలు సరే.. ఆగిన సినిమాల కథేంటి? పవన్ వద్దకు నిర్మాత.. తీవ్ర ఒత్తిడి.. కీలక నిర్ణయమిదీ…

సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎదగాలంటే వరుసగా సక్సెస్ లను సాధిస్తూ ఉండాలి. అలాగే వాళ్ళ ఎంటైర్ కెరియర్ లో కనీసం ఒక్కటైనా ఇండస్ట్రీ హిట్ కొట్టాలి. అలాగైతేనే ఇక్కడ స్టార్ హీరోగా గుర్తింపు సంపాదించుకుంటారు...

Written By:
  • Gopi
  • , Updated On : August 8, 2024 / 10:53 AM IST

    Pawan Kalyan

    Follow us on

    Pawan Kalyan: తెలుగు సినిమా ఇండస్ట్రీలో పవర్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న నటుడు పవన్ కళ్యాణ్… ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ సినిమాతో హీరోగా పరిచయం అయిన ఆయన వరుసగా 7 సినిమాలతో సూపర్ సక్సెస్ లను అందుకొని ఇండస్ట్రీలో తన లాంటి ఒక స్టైల్ ను క్రియేట్ చేసుకున్నాడు. ఇక దానితో పాటుగా అభిమానుల గుండెల్లో చెరగని ఒక ముద్ర వేసుకున్నాడనే చెప్పాలి… ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం గా తన పదవి బాధ్యతలను కొనసాగిస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు ఆయనకు సినిమాలు చేసే టైం అయితే ఉండటం లేదు. మరి ఆల్రెడీ సెట్స్ మీద ఉన్న సినిమాలను ఎప్పుడు పూర్తి చేస్తాడు అనే సందేహం ప్రతి ఒక్కరిలో కలుగుతుంది. ఇక దానికి రీసెంట్ గా ఒక క్లారిటీ కూడా వచ్చినట్టుగా తెలుస్తుంది. ఓజి సినిమా ప్రొడ్యూసర్ అయిన డివివి దానయ్య రీసెంట్ గా పవన్ కళ్యాణ్ ను కలిసారట… ఇతను సినిమా డేట్స్ గురించి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేసినట్టుగా కూడా సమాచారమైతే అందుతుంది. ఇక అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ అక్టోబర్ నుంచి షూటింగ్స్ లో పాల్గొని సెట్స్ మీద ఉన్న మూడు సినిమాలను కంప్లీట్ చేసిన తర్వాత మిగతా సినిమాలకు కమిట్ అవుతానని చెప్పినట్టుగా సమాచారం అయితే అందుతుంది. ఇక దీన్ని బట్టి చూస్తే అక్టోబర్ లో దసరా తర్వాత నుంచి పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్లో పాల్గొనబోతున్నాడు అనేది చాలా క్లారిటీగా తెలుస్తుంది… ఇక మొత్తానికైతే పవన్ కళ్యాణ్ మరోసారి తన సినిమాలతో అలరించడానికి మన ముందుకు రావడం అనేది నిజంగా ఒక గొప్ప విషయం అనే చెప్పాలి.

    ఇక ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రజల సమస్యలను తెలుసుకొని వాటి మీద పరిష్కారాన్ని చూపించే ప్రయత్నంలో తను ఉన్నట్టుగా తెలుస్తోంది…ఇక మొత్తానికైతే పవన్ కళ్యాణ్ ఇటు సినిమాలు, అటు రాజకీయాలు రెండింటిని ఏకకాలంలో సక్సెస్ ఫుల్ గా కొనసాగిస్తూ ముందుకు దూసుకెళ్లే ప్రయత్నంలో ఉన్నాడు…

    ఇక తను చేస్తున్న సినిమాలను లక్ష్యంగా పెట్టుకున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి. ఇక ఓజితోపాటు హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ లాంటి సినిమాలను కూడా పూర్తి చేసి 2025 లో ఈ మూడు సినిమాలను రిలీజ్ చేయాలనే తాపత్రయం లో ఉన్నట్టుగా తెలుస్తోంది… తన అభిమానులు సైతం ఆయన నుంచి ఒక సినిమా వస్తే బాగుండు అని ఎదురుచూస్తున్నారు. ఇక ఇప్పుడప్పుడే ఆయన నుంచి సినిమా రాకపోవడంతో ఆయన చేసిన పాత సినిమాలనే రీ రిలీజ్ చేస్తూ ఆ సినిమాలు చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.

    ఓజీ సినిమా డైరెక్టర్ అయిన సుజీత్ కూడా ప్రస్తుతం ఓజీ సినిమా పైనే కూర్చున్నాడు. ఆయన నానితో ఒక సినిమా కమిటీ అయినప్పటికీ క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల ఆ సినిమా క్యాన్సిల్ అయినట్టుగా కూడా తెలుస్తుంది. కాబట్టి ఓజి సినిమాతో తనను తాను ప్రూవ్ చేసుకుంటేనే మరోసారి స్టార్ హీరోల నుంచి ఆయనకు డేట్స్ దక్కే అవకాశాలైతే ఉన్నాయి. కాబట్టి ఎలాగైనా సరే ఈ సినిమాతో తనను తాను ప్రూవ్ చేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు…