https://oktelugu.com/

Insurance Companies : బీమా కంపెనీలపై కేంద్రం సీరియస్,, ఏకంగా 12 శాతం జరిమానా విధింపు.. పాలసీలపై వేటు పడనుందా?

కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి ఒక లోక్ సభలో ఒక ప్రకటన చేశారు. రైతులకు పంటల బీమా చెల్లించడంలో జాప్యాన్ని సహించబోమని చెప్పారు. ప్రధాని మంత్రి ఫసల్ బీమా యోజన కింద రైతులకు చెల్లించాల్సిన బీమా జాప్యమైతే ఇకపై 12 శాతం జరిమానా విధిస్తామని చెప్పారు. ఇక జరిమానా కూడా రైతుల ఖాతాల్లోనే జమ చేస్తామని చెప్పారు.

Written By:
  • NARESH
  • , Updated On : August 8, 2024 / 11:06 AM IST
    Follow us on

    Insurance companies : బీమా సంస్థలపై కేంద్రం సీరియస్ గా ఉందా.. పంటల బీమా చెల్లించడంపై అలసత్వంపై కఠిన చర్యలు తీసుకోబోతుందా అంటే అవుననే సమాధానం కేంద్ర వర్గాల నుంచి వస్తున్నది. తాజాగా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాటలు ఇందుకు ఊతమిస్తున్నాయి. ఏకంగా బీమా సంస్థలకు 12 శాతం పెనాల్టీ విధిస్తామని కఠిన నిర్ణయాన్ని ఆయన ప్రకటించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. దేశంలోని బీమా కంపెనీలపై కేంద్రం సీరియస్ అయ్యింది. పంటల బీమా చెల్లించడంలో ఆయా కంపెనీలు జాప్యం చేయడం సీరియస్ గా తీసుకుంది. ఇకపై జాప్యం చస్తే 12 శాతం పెనాల్టీ విధిస్తామని, మరిన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటామని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ హెచ్చరించారు. గతంలో ఉన్న ప్రభుత్వంలో పంటల బీమా కోసం 3.51 కోట్ల దరఖాస్తులు మాత్రమే వచ్చాయని, ప్రస్తుతం వాటి సంఖ్య ఏకంగా 8. 69 కోట్లకు చేరినట్టు తెలిపారు. ఇక మొత్తంగా దేశవ్యాప్తంగా రైతులు రూ. 32,404 కోట్ల ప్రీమియం చెల్లించి ఏకంగా రూ. 2.71 లక్షల కోట్ల బీమా పొందినట్లు ఆయన తెలిపారు. అయితే బీమా చెల్లింపులు కొంత ఆలస్యమవుతుండడంపై కేంద్రం మాత్రం సీరియస్ గా రియాక్ట్ అయ్యింది. పెనాల్టీ తప్పదనే సంకేతాలు ఆయన కంపెనీలకు ఇచ్చింది.

    కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి ఏమన్నారంటే.. 

    ఈ మేరకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి ఒక లోక్ సభలో ఒక ప్రకటన చేశారు. రైతులకు పంటల బీమా చెల్లించడంలో జాప్యాన్ని సహించబోమని చెప్పారు. ప్రధాని మంత్రి ఫసల్ బీమా యోజన కింద రైతులకు చెల్లించాల్సిన బీమా జాప్యమైతే ఇకపై 12 శాతం జరిమానా విధిస్తామని చెప్పారు. ఇక జరిమానా కూడా రైతుల ఖాతాల్లోనే జమ చేస్తామని చెప్పారు. పంటల బీమా రాష్ర్టాల ప్రీమియం చెల్లింపు ఆలస్యం అవుతోంది. బీమా చెల్లింపుల్లో జాప్యం లేకుండా కేంద్ర ప్రభుత్వం మాత్రం తన వాటాను సరైన సమయానికి నిర్ణయిస్తున్నది. ఏదేమైనా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పుకొచ్చారు.

    ఇదీ పెరిగిన విధానం..

    ఇక పంటల బీమా కోసం 8.69 కోట్ల దరఖాస్తులు వచ్చాయి. గతంలో ఈ దరఖాస్తుల సంఖ్య 3.51 కోట్లు ఉండేది. ఇప్పుడది రెట్టింపయ్యింది. రైతులు రూ. 32,404 కోట్ల ప్రీమియం చెల్లించి మొత్తంగా రూ. 2.71 లక్షల కోట్లకు బీమా పొందినట్లు సమాచారం. సహజ కారణాలతో పంటలు నష్టపోతే ఈ బీమా లభిస్తుంది. 2023లో ఏకంగా 5.01 లక్షల హెక్టార్లో భూమి బీమా పరిధిలోకి వచ్చింది. దీనికి బీమా కంపెనీలకు ప్రీమియం చెల్లింపులు పూర్తయ్యాయి. ఇక 2024లో 5.98 లక్షల హెక్టార్లకు ఈ ప్రీమియం చెల్లించింది. దీని ద్వారా ఏకంగా 3.57 కోట్ల మంది రైతులు ప్రయోజనం పొందినట్లు గా కేంద్రం తెలిపింది. అయితే సకాలంలో ప్రీమియం చెల్లిస్తున్నా పంటల బీమా చెల్లింపులు ఆలస్యమవడంపై ఆయన అగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వాటిని కేంద్ర ఊపేక్షించదని తెలిపారు.

    రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. బీమా జాప్యమైతే 12 శాతం పెనాల్టీ విధింపు ఉంటుందని హెచ్చరికలు జారీ చేశారు. మరి దీనిపై బీమా కంపెనీల నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. బీమా ఆలస్యమవడానికి కారణాలను కూడా వెల్లడించలేదు. కేంద్రం నిర్ణయంతో ఇకపై బీమా చెల్లింపు త్వరితగతిన వస్తుందని మాత్రం రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.