Gold Industry : దేశంలో బంగారు పరిశ్రమకు కొత్త అసోసియేషన్.. అప్పుడే భారీ మద్దతు కేంద్రం ఏమంటుందంటే?

భారత పసిడి పరిశ్రమ ఒక స్వీయ నియంత్రణ సంస్థను మంగళవారం (ఆగస్ట్ 6) సాయంత్రం ప్రకటించింది. ప్రపంచ స్వర్ణ మండలి మద్దతు కూడా ఈ కొత్త సంఘానికి లభించినట్లు సమాచారం. ఈ కొత్త సంఘం పేరును ఇండియన్ అసోసియేషన్ ఫర్ గోల్డ్ ఎక్స్ లెన్స్ అండ్ స్టాండర్డ్స్(ఐఏజీఈఎస్) పేరిట ఈ సంఘాన్ని ఏర్పాటు చేసింది.

Written By: NARESH, Updated On : August 8, 2024 10:51 am
Follow us on

Indian Gold Industry  : దేశీయ పసిడి పరిశ్రమ ఒక నియంత్రణ సంస్థను ప్రకటించింది. ప్రపంచ స్వర్ణ మండలి మద్దతుతో ఈ కొత్త సంఘాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ కొత్త సంఘంకు ఇండియన్ అసోసియేషన్ ఫర్ గోల్డ్ ఎక్స్ లెన్స్ అండ్ స్టాండర్డ్స్(ఐఏజీఈఎస్) పేరిట ఏర్పాటు చేసింది. కాగా పసిడి రంగంలో పారదర్శకతను పెంచేందుకు, దేశ వ్యాప్తంగా వినియోగదారుల్లో నమ్మకాన్ని పెంపొందించే లక్ష్యంతో ఈ సంస్థ పనిచేస్తుందని తెలిపింది. ఈ సంస్థ యొక్క లక్ష్యాలను ఈ మేరకు తాజాగా ప్రకటించింది. సంస్థను ప్రజల్లో నమ్మకం పెంచేలా పనిచేస్తామని తెలిపింది. స్వతంత్ర నిర్ణయాలు తీసుకోవడంతో పాటు పలు అంశాలను ఈ సంఘం నిర్ణయిస్తుందని తెలిపారు. ఇక ఈ సంఘం సభ్యులను త్వరలోనే ప్రకటించనున్నట్ల సమాచారం. ఆ తర్వాత ప్రత్యేక సమావేశం అనంతరం విధివిధానాలను ప్రకటిస్తారు. దీనిపై ఇప్పటికే ఒక ప్రణాళిక రూపొందించినట్లు తెలుస్తున్నది. ఈ ఏడాది చివరి కల్లా లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ సంస్థ తన కార్యకలాపాలను ప్రారంభిస్తుందని భారత్ లో ప్రపంచ సర్వమండలి ప్రాంతీయ కార్యనిర్వహణాధికారి (సీఈవో) సచిన్ జైన్ తెలిపారు. కాగా ఈ సంస్థ పనితీరును కూడా ఆయన వెల్లడించారు. ఇండియన్ అసోసియేషన్ ఫర్ గోల్డ్ ఎక్స్ లెన్స్ అండ్ స్టాండర్డ్స్ (ఐఏజీఈఎస్)ను జాతీయ పసిడి పరిశ్రమ సంఘాలైన ఇండియన్ బులియన్ అండ్ జువెల్లర్స్ అసోసియేషన్ (ఐబీజేఏ), ఆల్ ఇండియా జెమ్స్ అండ్ జువెలరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, జెమ్ అండ్ జువెలరీ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్, తదితర సంఘాలతో కలిపి ఈ కొత్త సంఘాన్ని ఏర్పాటు చేయనున్నారు. పరిశ్రమలో ఉన్న ఇతర సంఘాలతో కలిపి ఒక నూతన సంఘం ఏర్పాటు చేయడం ద్వారా వినియోగదారులతో పాటు ప్రభుత్వాల నమ్మకాన్ని పొందే అవకాశం ఉంటుందని తెలిపారు. ఇది మంచి పరిణామమని, రానున్న రోజుల్లో మరింత నిర్ణయాలు రావడానికి ఇది దోహదం చేస్తుందని తెలిపారు.

ఈ సంఘం ఏర్పాటు దేశ బంగారు పరిశ్రమలో ఒక పెద్ద మైలురాయిలా మారుతుందని జెమ్ అండ్ జువెలరీ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ చైర్మన్ విఫుల్ షా పేర్కొన్నారు. పారదర్శకత్వం, స్థిరత్వంతో పాటు అత్యున్నత ప్రమాణాలను రూపొందించడానికి తాము కట్టుబడి ఉండడాన్ని ఇది ప్రతిఫలించగలదన్నారు. వినియోగదారులు, పరిశ్రమ వర్గాల్లో విశ్వాసాన్ని పెంచడంతో పాటు అత్యున్నత నాణ్యతను ప్రోత్సహించడానికి కలిసి పని చేస్తామని జీజేసీ, ఐబీజేఏ నాయకులు తెలిపారు. ఇది భారత పసిడి పరిశ్రమలో ఇది మంచి మైలురాయి అని పేర్కొన్నారు. ప్రజల్లో విశ్వాసం పెంపొందించేలా ఈ సంస్థ పనితీరు ఉండబోతుందని ఆయన చెప్పారు.

అత్యంత విలువైన నైపుణ్యాలతో, భారత ప్రభుత్వ ప్రామాణికాలతో ఈ సంస్థ తన కార్యకలాపాలను కొనసాగిస్తుందని చెప్పారు. పసిడి రంగంలో పారదర్శకతను పెంచేందుకు, దేశ వ్యాప్తంగా వినియోగదారుల్లో నమ్మకాన్ని పెంపొందించే లక్ష్యంతో ఈ సంస్థ పనిచేస్తుందని ఆయన పేర్కొన్నారు. మిగిలిన సంస్థలు, ఇతర ప్రతినిధులు దీనికి పూర్తిగా సహకరిస్తారని, పూర్తి విశ్వాస పూరిత వాతావరణంలో దేశంలో మంచి సేవలందించేలా పనిచేస్తామనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.