Dulquer Salmaan: మలయాళం సినిమా ఇండస్ట్రీలో నటుడిగా గొప్ప పేరు సంపాదించుకున్న నటుడు దుల్కర్ సల్మాన్… ప్రస్తుతం తెలుగులో సైతం అదే రీతిలో రాణించాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు అతన్ని టాప్ లెవల్లో నిల్చోబెట్టాయి. ఇకమీదట చేయబోతున్న సినిమాల విషయంలో కూడా అతను చాలా కేర్ ఫుల్ గా వ్యవహరించాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే ఆయన తెలుగులో మహానటి, సీతారామం, లక్కీ భాస్కర్ లాంటి సినిమాలతో సూపర్ సక్సెస్ లను సాధించాడు. ఇక ఇప్పుడు ‘ఆకాశంలో ఒక తార’ అనే సినిమాని కూడా చేస్తున్నాడు. ఈ మూవీతో కూడా సూపర్ సక్సెస్ ను సాధిస్తే ఆయనకి ఇక తిరుగుండదనే చెప్పాలి. ఇక వీళ్ళ తో పాటుగా మరి కొంతమంది కొత్త దర్శకులతో కూడా అతను సినిమాలు చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటివరకు దుల్కర్ సల్మాన్ చాలా ఎక్కువ ఫ్యాన్ బేస్ ను ఏర్పాటు చేసుకున్నాడు. తెలుగులో మన స్టార్ హీరోలతో పాటు అతనికి చాలా మంచి క్రేజ్ దక్కుతుందంటే మామూలు విషయం కాదు. డిఫరెంట్ పాత్రలను పోషించడానికి ఆయన ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు. కాబట్టి ప్రతి పాత్రలో కూడా తనదైన మార్క్ చూపిస్తూ నటిస్తుంటాడు.
అందుకే ఆయన డిఫరెంట్ సినిమాల వైపు అడుగులు వేస్తున్నాడు. తెలుగులో ఎక్కువగా మార్కెట్ ని క్రియేట్ చేసుకోగలిగితే ఆటోమేటిక్ గా పాన్ ఇండియాలో సైతం భారీ క్రేజ్ దక్కుతుందని తెలుగు దర్శకులు చేయబోయే పాన్ ఇండియా సినిమాల్లో తను హీరోగా చేస్తే తన మార్కెట్ పెరుగుతుంది.
అలాగే తను కూడా స్టార్ హీరోల్లో ఒకడిగా మారిపోతారనే ఉద్దేశ్యంతోనే దుల్కర్ సల్మాన్ తెలుగు సినిమాలు చేయడానికి ఎక్కువ ఆసక్తిగా ఉన్నట్టుగా తెలుస్తుంది… ఇక ఏది ఏమైనా కూడా రాబోయే రోజుల్లో దుల్కర్ సల్మాన్ తనకంటూ ఒక మంచి మార్కెట్ ను క్రియేట్ చేసుకోవాలనే ఉద్దేశ్యంతో ముందుకు దూసుకెళ్తున్నాడు.
తను అనుకున్నట్టుగానే భారీ క్రేజ్ ను క్రియేట్ చేసుకోగలుగుతాడా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్దిగా వెయిట్ చేయాల్సిందే…మన తెలుగు హీరోలతో పోటీపడే స్థాయిలో తను ఉంటాడా లేదా అనేది తెలియాలంటే మాత్రం తను చేయబోయే సినిమాల సెలక్షన్ ను బట్టి ఆధారపడి ఉంటుందని మరి కొంతమంది సినిమా మేధావులు చెబుతున్నారు…
