Pushpa Movie: కేరళ అభిమానులను నిరాశ పరిచిన పుష్ప… కారణం ఏంటంటే

Pushpa Movie: అల్లు అర్జున్, సుకుమార్‌ల నుంచి వస్తున్న తొలి పాన్ ఇండియా మూవీ పుష్ప. తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఈ సినిమాకు తెలుగు తర్వాత ఎక్కువ క్రేజ్ ఉన్నది మలయాళంలోనే. కేరళలో చాలా ఏళ్ల నుంచి బన్నీకి మంచి ఫాలోయింగ్ ఉండటం… గత కొన్నేళ్లలో అది ఇంకా పెరగడం ‘పుష్ప’కు బాగా ప్లస్ అయ్యింది. గతంలో బన్నీ సినిమాలు తెలుగులో రిలీజయ్యాక… కొన్నాళ్లకు మలయాళంలో […]

Written By: Raghava Rao Gara, Updated On : December 17, 2021 6:12 pm
Follow us on

Pushpa Movie: అల్లు అర్జున్, సుకుమార్‌ల నుంచి వస్తున్న తొలి పాన్ ఇండియా మూవీ పుష్ప. తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఈ సినిమాకు తెలుగు తర్వాత ఎక్కువ క్రేజ్ ఉన్నది మలయాళంలోనే. కేరళలో చాలా ఏళ్ల నుంచి బన్నీకి మంచి ఫాలోయింగ్ ఉండటం… గత కొన్నేళ్లలో అది ఇంకా పెరగడం ‘పుష్ప’కు బాగా ప్లస్ అయ్యింది. గతంలో బన్నీ సినిమాలు తెలుగులో రిలీజయ్యాక… కొన్నాళ్లకు మలయాళంలో అనువాదం అయి రిలీజయ్యేవి. కానీ ‘పుష్ప’ను తెలుగుతో పాటే మలయాళంలోనూ రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరిగాయి. చాలా జాగ్రత్తగా డబ్బింగ్ వర్క్ కూడా చేశారు. బన్నీ కేరళకు వెళ్లి సినిమాను ప్రమోట్ చేశాడు కూడా. అక్కడ ఈ సినిమాను పెద్ద హీరోల స్ట్రెయిట్ మూవీ స్థాయిలో విడుదలకు సిద్ధం చేశారు.

Pushpa Movie

Also Read: వాళ్ళల్లో మరో వాణిశ్రీ, బ్రహ్మానందం.. గొప్ప నటులయ్యేది చిన్న పాత్రలతోనే !

ఇప్పుడు పెద్ద షాక్ తగిలింది. ‘పుష్ప’ మలయాళ వెర్షన్ శుక్రవారం విడుదల కావట్లేదు. ఒక రోజు ఆలస్యంగా శనివారం సినిమా రిలీజవుతుంది. ఈ సినిమా ఫైనల్ కాపీని సరైన సమయానికి డెలివర్ చేయడంలో చిత్ర బృందం విఫలమైంది. తెలుగులో కాస్త ముందే సెన్సార్ చేయించి.. తర్వాత కొన్ని మార్పులు చేర్పులు చేశారు. వాటికి కూడా సెన్సార్ బోర్డు నుంచి ఆమోదం తెచ్చుకున్నారు. కానీ సుకుమార్ ముంబయిలో కూర్చుని విడుదలకు రెండు రోజుల ముందు కూడా మార్పులు చేర్పులు చేయడం.. ఆ కంటెంట్ కేరళకు ఆలస్యంగా అందడం, దానికి డబ్బింగ్ పూర్తి చేసి, సెన్సార్ పూర్తి చేయించడంలో ఆలస్యం జరగడంతో శుక్రవారం షోలన్నీ క్యాన్సిల్ చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. ఇంత హైప్ ఉన్న సినిమాకు తొలి రోజు షోలు పడకపోవడంతో కేరళ బన్నీ అభిమానులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు.

Also Read: ‘పుష్ప’కు అక్కడ మైనస్.. ఇక్కడ ప్లస్?