NTR and Charan: అంతర్జాతీయ స్థాయిలో భారీ పిరియాడిక్ యాక్షన్ డ్రామాగా రాబోతున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ఇప్పటికే అన్ని విధాలుగా రెడీ అయింది. ప్రస్తుతం టీం అన్ని పనులను సరి చూసుకుంటుంది. ఎడిటింగ్, డబ్బింగ్ దగ్గర నుంచి ప్రమోషన్స్ లో మాట్లాడుతున్న విషయాల వరకూ మొత్తం ఓ సమీక్ష చేసుకుంటుంది. ఆ సమీక్షలో తేలిన అంశాల పై చిత్రబృందం ఒక మీటింగ్ పెట్టుకుంది.
సినిమా గురించి ఏ భాషలో ఎలా చెప్పాలి ? ఆ భాషకు తగ్గట్టు, అక్కడి ప్రేక్షకులకు తగ్గట్టు స్పీచ్ లను రెడీ చేసుకుంటుంది. అయితే, ఆ స్పీచ్ లను రాస్తోంది ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకి డైలాగ్ రైటర్స్. తెలుగు డైలాగ్ రైటర్ సాయి మాధవ్ బుర్రా ఇప్పటికే ఇద్దరి హీరోల స్పీచ్ లను రెడీ చేశాడు. మరో వారం రోజుల్లో ఆడియో ఫంక్షన్ ను ప్లాన్ చేస్తారు.
ఆ ఫంక్షన్ లో ఈ స్పీచ్ లను హీరోలు ఇవ్వనున్నారు. ఇదే విధంగా అన్నీ భాషల్లోనూ డైలాగ్ రైటర్స్ రెడీ చేసే స్పెషల్ స్పీచ్ లను హీరోలిద్దరూ తమ స్పీచ్ లో భాగం చేయనున్నారు. ఆ స్పీచ్ లు వెరీ ఎమోషనల్ గా ఉంటాయట. మరి ఆ స్పీచ్ లో మ్యాటర్ ఏ విధంగా ఉంటుందో చూడాలి. ఇక ట్రైలర్ తో ఈ సినిమాకి వచ్చిన హైప్, ఊపు పాన్ ఇండియా స్థాయిని మించిపోయింది.
అన్నట్టు ముంబైలో ఆర్ఆర్ఆర్ కి సంబంధించి పెద్ద ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు. ఈ ఈవెంట్ కి స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ముఖ్య అతిథిగా రానున్నాడు. ఇక హైదరాబాద్ లో కూడా భారీ ఈవెంట్ జరగనుంది. ఇక “ఆర్ఆర్ఆర్” వచ్చే జనవరి 7న విడుదల కాబోతుంది. రికార్డులన్నీ బ్రేక్ కాబోతున్నాయి.
Also Read: Pawan Kalyan: మరో రీమేక్ చిత్రానికి రెడీ అవుతున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్…
ఏది ఏమైనా తెలుగు చారిత్రక వీరులైన కొమరం భీమ్, అల్లూరి సీతారామ రాజు జీవిత కథల ఆధారంగా రాజమౌళి ఈ సినిమా చేస్తున్నందుకు అభినందించాలి. పైగా ఈ సినిమాలో ఇంగ్లీష్ నటీ ఒలివియా మోరీస్ ఎన్టీఆర్ కి జోడిగా నటిస్తోంది. అన్నిటికీ మించి తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడలో కూడా స్వయంగా ఎన్టీఆర్ తన పాత్రకు డబ్బింగ్ చెప్పడం విశేషం.
Also Read: RRR Movie: రామ్, రామారావు ల కొత్త ఫోటోలు రిలీజ్ చేసిన “ఆర్‌ఆర్‌ఆర్” యూనిట్…