https://oktelugu.com/

2021 Hit Movies: 2021లో వచ్చిన హిట్ సినిమాల్లో ఎక్కువ శాతం ఈ కోవకు చెందినవే..

2021 Hit Movies:  కరోనా ప్రభావం ఎక్కువుగా ఎఫెక్ట్ చూపింది సినీ ఇండస్ట్రీకి అని చెప్పడంలో ఎలాంటి అతియసోక్తి లేదు. సినీ పరిశ్రమ కరోనా కారణంగా సినిమాలన్నీ వాయిదా పడడంతో కొన్ని కోట్ల నష్టం వాటిల్లింది. 2020 వ ఏడాదిలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంది. థియేటర్స్ మూతపడడం, సినిమా షూటింగ్స్ అన్ని నిలిచి పోవడం వంటి వాటి వల్ల ఎక్కువ సినిమాలే 2021లో ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అయితే ఈ సినిమాల్లో కూడా కొన్ని సినిమాలు మాత్రమే […]

Written By:
  • Mallesh
  • , Updated On : December 17, 2021 / 05:09 PM IST
    Follow us on

    2021 Hit Movies:  కరోనా ప్రభావం ఎక్కువుగా ఎఫెక్ట్ చూపింది సినీ ఇండస్ట్రీకి అని చెప్పడంలో ఎలాంటి అతియసోక్తి లేదు. సినీ పరిశ్రమ కరోనా కారణంగా సినిమాలన్నీ వాయిదా పడడంతో కొన్ని కోట్ల నష్టం వాటిల్లింది. 2020 వ ఏడాదిలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంది. థియేటర్స్ మూతపడడం, సినిమా షూటింగ్స్ అన్ని నిలిచి పోవడం వంటి వాటి వల్ల ఎక్కువ సినిమాలే 2021లో ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.

    2021 Hit Movies

    అయితే ఈ సినిమాల్లో కూడా కొన్ని సినిమాలు మాత్రమే హిట్ కొట్టాయి. అయితే 2021 లో విజయాలు సాధించిన సినిమాల్లో ఎక్కువ శాతం మాత్రం రీమేక్ సినిమాలే ఉండడం విశేషం. ఈ సంవత్సర కాలంలో తెలుగులో రీమేక్ అయ్యి సూపర్ హిట్ అందుకున్న సినిమాలు ఏమిటో.. ఏ స్టార్ హీరో ఏ రికార్డ్ ను అందుకున్నాడో తెలుసుకుందాం..

    పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కిన సినిమా వకీల్ సాబ్. ఈ సినిమాలో శృతి హాసన్ కథానాయికగా నటించగా.. అంజలి, నివేదా థామస్, అనన్య కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా బాలీవుడ్ లో సూపర్ హిట్ అయినా పింక్ సినిమాకు రీమేక్ గా రూపొందింది. ఇక్కడ కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. థమన్ అందించిన పాటలు ఈ సినిమాకు మరింత ప్లస్ అయ్యాయి.

    ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమాల్లో సత్య దేవ్ తిమ్మరుసు కూడా ఉంది. ఈ సినిమా ఇన్వెస్టిగేషన్ త్రిల్లర్ గా వచ్చి మంచి హిట్ అందుకుంది. ఈ సినిమా కొరియన్ సినిమా న్యూ ట్రయల్ అనే సినిమాకు రీమేక్ గా తెరకెక్కింది.

    అలాగే సుమంత్ కపటదారి సినిమా కూడా బాగానే ఆకట్టుకుంది. ఈ సినిమా కన్నడ సినిమా కవలధారి అనే సినిమాకు రీమేక్ గా తెరకెక్కింది.

    నితిన్ మాస్ట్రో సినిమా కూడా హిందీ అంధాదున్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కింది. ఈ సినిమా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కింది. తమన్నా ఈ సినిమా కీలక పాత్రలో నటించగా.. నభా నటేష్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా నేరుగా ఓటిటి లో రిలీజ్ అవ్వగా భారీ స్పందన అందుకుంది.

    Also Read: Pawan Kalyan: మరో రీమేక్ చిత్రానికి రెడీ అవుతున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్…

    ఇక వెంకటేష్ నటించిన రెండు రీమేక్ సినిమాలు ఈ ఏడాది విడుదల అయ్యి మంచి హిట్ అందుకున్నాయి. అందులో శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించిన నారప్ప సినిమా కూడా ఉంది. ఈ సినిమా తమిళ్ మూవీ అసురన్ సినిమాకు రీమేక్ గా వచ్చింది. అలాగే ఇటీవలే రిలీజ్ అయినా దృశ్యం 2 కూడా రీమేక్ గానే తెరకెక్కింది. ఈ రెండు సినిమాలు ఓటిటి లోనే రిలీజ్ అయ్యాయి.

    వీటితో పాటు మేఘ ఆకాష్ నటించిన డియర్ మేఘ.. కన్నడ దియా సినిమాకు రీమేక్ గా తెరకెక్కినది. దీంతో పాటు తేజ సజ్జ, ప్రకాష్ వారియర్ ఇష్క్ సినిమా మలయాళంలో వచ్చిన అదే పేరుతొ తెరకెక్కి హిట్ అనిపించుకున్నాయి.

    Also Read: NTR and Charan: ఎన్టీఆర్ – చరణ్ కోసం స్పెషల్ స్పీచ్ లు రెడీ !

    Tags