https://oktelugu.com/

డ్రగ్స్ కేసు.. హీరోయిన్లకు 20ఏళ్ల జైలు శిక్ష పడనుందా?

బాలీవుడ్ నటుడు సుశాంత్ ఆత్మహత్య తర్వాత ఇండస్ట్రీలోని చీకటి కోణాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. గతంలోనే బాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖులకు మాఫియాతో సంబంధాలు.. డ్రగ్స్ లింకులు ఉన్నట్లు తేలింది. డగ్స్ కేసులో పలువురు ప్రముఖులు అరెస్టయి జైలుకు వెళ్లిన సంఘటనలు కూడా చూశాం. సుశాంత్ ఆత్మహత్య తర్వాత మళ్లీ డగ్స్ లింకులు ఇండస్ట్రీలో వెలుగుచూడటంతో సెలబ్రెటీలంతా ఆందోళన చెందుతున్నారు. Also Read: కృతిశెట్టికి బర్తేడ్ గిప్ట్ ఇచ్చిన ‘ఉప్పెన’ టీమ్ సుశాంత్ ఆత్మహత్య కేసులో డ్రగ్స్ లింకులు బయటపడటంతో […]

Written By: , Updated On : September 22, 2020 / 10:22 AM IST
Drug case tollywood

Drug case tollywood

Follow us on

Drug case tollywood

బాలీవుడ్ నటుడు సుశాంత్ ఆత్మహత్య తర్వాత ఇండస్ట్రీలోని చీకటి కోణాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. గతంలోనే బాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖులకు మాఫియాతో సంబంధాలు.. డ్రగ్స్ లింకులు ఉన్నట్లు తేలింది. డగ్స్ కేసులో పలువురు ప్రముఖులు అరెస్టయి జైలుకు వెళ్లిన సంఘటనలు కూడా చూశాం. సుశాంత్ ఆత్మహత్య తర్వాత మళ్లీ డగ్స్ లింకులు ఇండస్ట్రీలో వెలుగుచూడటంతో సెలబ్రెటీలంతా ఆందోళన చెందుతున్నారు.

Also Read: కృతిశెట్టికి బర్తేడ్ గిప్ట్ ఇచ్చిన ‘ఉప్పెన’ టీమ్

సుశాంత్ ఆత్మహత్య కేసులో డ్రగ్స్ లింకులు బయటపడటంతో సీబీఐ, ఎన్సీబీ అధికారులు ఆ దిశగా దర్యాప్తును వేగవంతం చేస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో సుశాంత్ మాజీ ప్రియురాలు రియా చక్రవర్తి.. ఆమె సోదరుడు షోవిక్, డ్రగ్స్ డీలర్ బాసిత్, శశాంక్ లను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. ఈ సందర్భంగా పలు సంచలన విషయాలు వెలుగుచూశాయి. పోలీసులు వీరిని కోర్టు ఎదుట హాజరుపర్చి రిమాండ్ కు తరలించారు. వీరంతా పెట్టుకున్న బెయిల్ పిటిషన్ ను కోర్టు వేసింది.

డ్రగ్స్ కేసులో భాగంగా రియా చక్రవర్తితోపాటు హీరోయిన్లు రాగిణి ద్వివేది, సంజనా గల్రానీని కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. పలు ఆరోపణల కింద వీరిని అరెస్టుచేసి జైలుకు తరలించారు. వీరిద్దరు కోర్టులో బెయిల్ కోసం దాఖలు చేసుకున్నారు. తొలుత రాగిణి ద్వివేది.. ఆ తర్వాత సంజనా దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను పరిశీలించి విచారణను గురువారానికి వాయిదా వేసింది.

ఈ సందర్భంగా రాగిణి తరపు న్యాయవాది కోర్టులో పలు వాదనలు విన్పించారు. ఆమె అరెస్టు సమయంలో పోలీసులు నిబంధనలు పాటించలేదని.. రాగిణి ఇంట్లో సిగరెట్లు మినహా మాదకద్రవ్యాలు దొరకలేదని.. డ్రగ్స్ కేసులో నిందితుడిగా ఉన్న ఓ వ్యక్తి ఆరోపణలతో ఆమెను అరెస్టు చేశారని తెలిపారు. ఇక ఆమె తండ్రి ఒక మాజీ సైనికాధికారి అని.. కోవిడ్ సమయంలో ఆమె ఎంతోమందికి సాయం చేశారని కోర్టుకు విన్నవించాడు.

Also Read: ‘ర‌కుల్ ప్రీత్ సింగ్’.. మళ్ళీ అడవిలోకి !

ఇక సీసీబీ పోలీసులు సైతం వారికి బెయిల్ ఇవ్వకుండా రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఆమె డ్రగ్స్ విక్రయించినట్లు ఆధారాలున్నాయని.. ఆమె వైద్య పరీక్షలకు కూడా సహకరించలేదని తెలిపారు. ఐదేళ్లుగా ఆమె ఇతర నిందితులతో కలిసి పలు పార్టీల్లో పాల్గొన్నట్లు ఆధారాలున్నాయని కోర్టుకు విన్నవించారు. ఈ కేసులో ఆమెకు 20ఏళ్ల జైలుశిక్ష పడే అవకాశం ఉందని.. బెయిల్ మంజూరు చేస్తే తదుపరి విచారణ కష్టమవుతుందని కోర్టుకు విన్నవించినట్లు సమాచారం. న్యాయవాదుల వాదనలు విన్న కోర్టు విచారణను గురువారానికి వాయిదా వేసింది.