https://oktelugu.com/

బిగ్ బాస్: ఈ వారం నామినేషన్లో ఉన్నది వీరే..

బిగ్‌బాస్‌ 4వ సీజన్‌ ప్రారంభమై రెండు వారాలు గడిచి మూడో ప్రారంభమైంది. హౌస్‌లో అంతగా తెలిసిన కంటెస్టెంట్లు లేకపోవడంతో ఫస్ట్‌ వీక్‌ కొంచెం వీక్‌లా అనిపించినా.. ఇప్పుడిప్పుడే కొంత అలరిస్తోంది. కంటెస్టెంట్ల నుంచి ఎంటర్‌‌టైన్మెంట్‌ డోస్‌ పెంచుతున్నాడు బిగ్‌బాస్‌. Also Read: మరణానికి ముందు సుశాంత్ సంకేతాలు? నిబంధనల ప్రకారమే హౌస్‌ నుంచి వారం వారం ఒక్కో కంటెస్టెంట్‌ను ఎలిమినేట్ చేస్తున్నారు. ఇప్పటివరకు ఇద్దరు కంటెస్టెంట్లు ఎలిమినేట్‌ కాగా.. మరో ఇద్దరిని వైల్డ్‌ కార్డు ద్వారా హౌస్‌లోకి […]

Written By: , Updated On : September 22, 2020 / 10:05 AM IST
Bigg Boss 4: This time their domination

Bigg Boss 4: This time their domination

Follow us on

Bigg Boss 4: This time their domination
బిగ్‌బాస్‌ 4వ సీజన్‌ ప్రారంభమై రెండు వారాలు గడిచి మూడో ప్రారంభమైంది. హౌస్‌లో అంతగా తెలిసిన కంటెస్టెంట్లు లేకపోవడంతో ఫస్ట్‌ వీక్‌ కొంచెం వీక్‌లా అనిపించినా.. ఇప్పుడిప్పుడే కొంత అలరిస్తోంది. కంటెస్టెంట్ల నుంచి ఎంటర్‌‌టైన్మెంట్‌ డోస్‌ పెంచుతున్నాడు బిగ్‌బాస్‌.

Also Read: మరణానికి ముందు సుశాంత్ సంకేతాలు?

నిబంధనల ప్రకారమే హౌస్‌ నుంచి వారం వారం ఒక్కో కంటెస్టెంట్‌ను ఎలిమినేట్ చేస్తున్నారు. ఇప్పటివరకు ఇద్దరు కంటెస్టెంట్లు ఎలిమినేట్‌ కాగా.. మరో ఇద్దరిని వైల్డ్‌ కార్డు ద్వారా హౌస్‌లోకి పంపించారు. మొదటి వారం సూర్యకిరణ్‌, రెండో వారంలో కరాటే కళ్యాణి హౌస్‌ నుంచి ఎలిమినేట్‌ అయ్యారు. కళ్యాణి నాగ్ ఇచ్చిన బిగ్‌బాంబ్‌ని దేవిపై వేశారు. దీంతో దేవి డైరెక్ట్‌గా ఎలిమినేషన్‌కు నామినేట్ అయ్యారు. దీంతో దేవిని మరెవరూ నామినేట్‌ చేయలేదు.

ఈ వారానికి సంబంధించి ఎలిమినేషన్‌ ప్రక్రియ సోమవారం ప్రారంభమైంది. ఎవరు ఎవరిని ఎలిమినేషన్‌కు నామినేట్‌ చేయాలనుకుంటే వారి ఫొటోలను కాల్చాలని బిగ్‌బాస్‌ సూచించారు. దీంతో ఒక్కో కంటెస్టెంట్‌ నామినేషన్ల ప్రక్రియను స్టార్ట్‌ చేశారు. ఈ నామినేషన్‌ ప్రక్రియలో కంటెస్టెంట్ల మధ్య హాట్‌హాట్‌గా డిస్కషన్‌ నడిచింది. కాగా.. ఈ వారం ఏడుగురు కంటెస్టెంట్లు నామినేషన్‌లో ఉన్నారు. యాంకర్ దేవి, లాస్య, అరియానా గ్లోరి, కుమార్ సాయి, మెహబూబ్, మోనాల్ గజ్జర్, హారికలు ఈ వారం నామినేట్ అయ్యారు. ఈ ఏడుగురిలో వచ్చే వారం ఎవరో ఒకరు బయటకు రానున్నారు.

Also Read: పెళ్లికి సిద్ధమవుతున్న రేష్మి.. కాబోయే భర్త ఎవరో తెలుసా?

* ఎవరెవరు ఎవరిని నామినేట్ చేశారంటే..

మెహబూబ్‌:-అరియానా, హారిక,
దేవి:-అమ్మ రాజశేఖర్, కుమార్ సాయి
హారిక:-మెహబూబ్‌, సుజాత
అవినాష్‌: మెహబూబ్, హారిక
దివి: మోనాల్, కుమార్ సాయి
అభిజిత్‌:-అరియానా, సుజాత
కుమార్ సాయి:-మెహబూబ్, అఖిల్
గంగవ్వ:-మోనాల్, కుమార్
మోనాల్:-దివి, అరియానా
అఖిల్‌: -కుమార్ సాయి, అరియానా
సొహైల్‌:-అరియానా, కుమార్
అమ్మ రాజశేఖర్:-అరియానా, సాయి కుమార్
లాస్య:-కుమార్, అరియానా
అరియానా:-మోనాల్, మెహబూబ్‌
సుజాత:-హారిక, అభిజిత్‌.