Drishyam: ఒక సినిమా సక్సెస్ ను సాధించింది అంటే ఆ సినిమాకు సీక్వెల్ ను తెరకెక్కించాలి అనుకుంటారు దర్శకనిర్మాతలు. ఇది కేవలం ఒక ఇండస్ట్రీకి మాత్రమే పరిమితం అవుతుంది. కానీ ఒక సినిమా మాత్రం టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ అంటూ అన్ని భాషల్లోకి పాకిపోయింది. అంతే కాదు ఇప్పుడు హాలీవుడ్ లో కూడా రీమేక్ అవడానికి సిద్దమైంది. మరి ఆ సినిమా ఏంటి అనుకుంటున్నారా? అయితే ఓ లుక్ వేసేయండి.
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరోగా జీతూ జోసెఫ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా దృశ్యం. ఈ సినిమా 2013లో ఆడియన్స్ ముందుకు వచ్చి మంచి సక్సెస్ ను సాధించింది. సస్పెన్స్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ సినిమా ఇతర భాషల్లో కూడా ప్రేక్షకులను అలరించింది. తమిళంలో కమల్ హాసన్, తెలుగులో వెంకటేష్, హిందీలో అజయ్ దేవగన్ తో పాటు కన్నడ, కొరియా, జపాన్ భాషల్లో స్టార్స్ కూడా ఈ సినిమాను రీమేక్ చేశారంటే ఈ సినిమా ఏ రేంజ్ లో హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
రిలీజైన ప్రతి భాషల్లో హిట్ అందుకున్న ఈ సినిమాకు 2021లో సీక్వెల్ ను తెరకెక్కించారు. ఆ సీక్వెల్ ని కూడా రీమేక్ చేసి ఆయా భాషల హీరోలు హిట్స్ ను అందుకున్నారు. ప్రస్తుతం మూడో పార్ట్ వస్తే దానిని కూడా రీమేక్ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు దర్శకనిర్మాతలు. ఇదిలా ఉంటే ఈసినిమా ఇప్పుడు హాలీవుడ్ కూడా వెళ్లడానికి సిద్దమవుతుందట. ఓ హీలీవుడ్ నిర్మాన సంస్థ ఈ సినిమాను ఇంగ్లీష్ అండ్ స్నానిష్ భాషల్లో రీమేక్ చేయబోతున్నట్టు ప్రకటించారు.
హాలీవుడ్ గల్ఫ్ స్ట్రీమ్ పిక్చర్స్ నిర్మాణ సంస్థ మరో ప్రొడక్షన్ కంపెనీతో కలిసి.. ఈ సినిమాను హాలీవుడ్ ఆడియన్స్ కు కూడా చూపించడానికి సిద్దమయ్యారు. ఈ క్రమంలోనే ఆల్రెడీ అంతర్జాతీయ రీమేక్ హక్కులను కూడా ఆ హాలీవుడ్ నిర్మాణ సంస్థ సొంతం చేసుకొని.. సినిమాను సెట్స్ పైకి తీసుకు వెళ్లేందుకు సిద్దమవుతున్నారని టాక్. అయితే రీమేక్ తో దృశ్యం సినిమా హాలీవుడ్ లో రీమేక్ అవుతున్న తొలి చిత్రంగా నిలవబోతుంది ఈ సినిమా. ఇక ఈ సినిమా 3వ పార్ట్ అన్ని భాషల్లో రీమేక్ అవడానికి సిద్దమవుతుందట.