Rajamouli
Rajamouli : సూపర్ స్టార్ మహేష్ బాబు(Superstar Mahesh Babu), రాజమౌళి(SS Rajamouli) కాంబినేషన్ లో రాబోతున్న సినిమాకి సంబంధించిన మొదటి షెడ్యూల్ ఇటీవలే ఒడిశాలో మొదలైన సంగతి తెలిసిందే. ఈ షెడ్యూల్ లో మహేష్ బాబు తో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా పాల్గొన్నారు. నిన్నటితో ఈ మొదటి షెడ్యూల్ కి సంబంధించిన షూటింగ్ పూర్తి అయ్యింది. ఒడిశాలోని కోరాపుట్ జిల్లాలో ఈ సినిమా షూటింగ్ జరిగింది. అక్కడ సిమిలిగూడ సమీపం లోని మాలి, పుట్ సీల్, బాల్డా వంటి ప్రాంతాల్లో ఈ మొదటి షెడ్యూల్ ని తెరకెక్కించారు. ఇది వరకు ప్రియాంక చోప్రా(Priyanka Chopra) ఈ ప్రదేశాలకు సంబంధించిన అందమైన లొకేషన్స్ ని తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేసింది. వాటికి మిలియన్ల సంఖ్యలో లైక్స్, కామెంట్స్ వచ్చాయి. ఇప్పుడు రాజమౌళి కూడా ఒడిశా లోని తన అనుభూతిని పంచుకుంటూ ఒక వీడియో ని షేర్ చేసాడు.
Also Read : రాజమౌళి కి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న లీకేజీలు…
పూర్తి వివరాల్లోకి వెళ్తే ఒడిశాలో అత్యంత ఎత్తైన శిఖరం గా పిలవబడే దేవ్ మాలిని ని రాజమౌళి ఒంటరిగా ఎక్కే ప్రయత్నం చేసాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ఈ పర్వతాన్ని ఒంటరిగా ఎక్కే ప్రయత్నం చేయడం ఒక అద్భుతమైన అనుభూతి. ఇక్కడి నుండి వ్యూ పాయింట్ అద్భుతంగా ఉంది. కానీ ఈ పరిసర ప్రాంతాల్లో అపరిశుభ్ర పరిస్థితులు నన్ను బాధించాయి. పౌర స్పృహ తో గట్టిగ సంకల్పించుకుంటే ఈ పరిస్థితిని మార్చవచ్చు. సందర్శకులు తాము వినియోగించిన ప్లాస్టిక్ పరికరాలను ఇక్కడే పడేయకుండా, తమతో పాటు తీసుకెళ్తే బాగుంటుంది. దయచేసి ఇలాంటి అరుదైన ప్రదేశాలను కాపాడండి..సురక్షితంగా ఉంచే ప్రయత్నం చేయండి’ అంటూ చెప్పుకొచ్చాడు. పరోక్షంగా ఆయన ఒడిశా ప్రభుత్వాన్ని ఈ అంశంపై విమర్శలు చేస్తున్నట్టుగా భావించవచ్చు. ఇటీవలే ఒడిశా ఉప ముఖ్యమంత్రి తమ రాష్ట్రంలో రాజమౌళి, మహేష్ బాబు మూవీ షూటింగ్ జరగడం అదృష్టం అంటూ ట్విట్టర్ లో కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే.
ఇకపోతే ఫారెస్ట్ అడ్వెంచర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రియాంక చోప్రా, పృథ్వీ రాజ్ సుకుమారన్ విలన్స్ గా నటిస్తున్నారు. హీరోయిన్ ఎవరు అనే విషయం పై ఇంకా క్లారిటీ రాలేదు. బాలీవుడ్ లో లేటెస్ట్ యంగ్ సెన్సేషన్ ని హీరోయిన్ గా తీసుకోబోతున్నట్టు ఒక వార్త ప్రచారం లో ఉంది. మరి ఎవరు ఆ యంగ్ సెన్సేషన్ అనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. ఈ సినిమాని మొత్తం మీద మూడు భాగాలుగా తెరకెక్కించే ఆలోచనలో ఉన్నాడు రాజమౌళి.
Also Read : అడవుల్లో మహేష్ బాబుతో గుర్రపు స్వారీ చేయిస్తున్న రాజమౌళి…మరో వీడియో లీక్ అయిందా..?