పవన్ పై అసాధారణ అభిమానమే సమస్యా ?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఈ పేరులోనే ఓ పవర్ ఉంది. లక్షల మందికి ఎక్కడా లేని ఉత్తేజం తీసుకువచ్చే ఎనర్జీ ఉంది. సినిమా స్టార్ కి అభిమానులు ఉండటం సర్వసాధారణం.. కానీ భక్తులు ఉండటమే బహు అరుదు. ఆ ఘనత తెలుగునాట ఇద్దరికే సాధ్యం అయింది. మొదట సీనియర్ ఎన్టీఆర్ కి.. ఆ తరువాత పవన్ కళ్యాణ్ కే. కానీ ఇక్కడే ఓ సమస్య కూడా ఉంది. అలాంటి అసాధారణ అభిమానం ఉన్న హీరోలు చిన్న […]

Written By: admin, Updated On : July 9, 2020 5:43 pm
Follow us on


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఈ పేరులోనే ఓ పవర్ ఉంది. లక్షల మందికి ఎక్కడా లేని ఉత్తేజం తీసుకువచ్చే ఎనర్జీ ఉంది. సినిమా స్టార్ కి అభిమానులు ఉండటం సర్వసాధారణం.. కానీ భక్తులు ఉండటమే బహు అరుదు. ఆ ఘనత తెలుగునాట ఇద్దరికే సాధ్యం అయింది. మొదట సీనియర్ ఎన్టీఆర్ కి.. ఆ తరువాత పవన్ కళ్యాణ్ కే. కానీ ఇక్కడే ఓ సమస్య కూడా ఉంది. అలాంటి అసాధారణ అభిమానం ఉన్న హీరోలు చిన్న చిన్న కథలు చేస్తే ప్రజలు జీర్ణించుకోలేరు. వీరు వెండితెరపై అద్భుతాలు చేయాలి. అద్భుతమైన హీరోయిజమ్ చూపించాలి. అలా చూపించకపోతే ఆ సినిమాని జనం చూడలేరు. ఎన్టీఆర్ ఖాతాలో మిగిలిపోయిన కొన్ని ప్లాప్ సినిమాలకు కూడా రీజన్ అదే. పవన్ కెరీర్ లో ప్లాప్ ల పరంపరకు కూడా కారణం అదే.

కరోనా టైంలో రేవంత్ కు ఛాన్స్ దొరికిందా?

ఇప్పుడు వేణు శ్రీరామ్ డైరెక్షన్లో పవన్ చేస్తున్న ‘పింక్’ రీమేక్ వకీల్ సాబ్ పరిస్థితి కూడా అలాగే ఉంది. పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దాంతో ఈ సినిమా పై భారీ అంచానాలు పెరిగిపోయాయి. కానీ పింక్ సబ్జెక్టు చిన్న కథ. పైగా పక్కా కమర్షియల్ అంశాలు లేని ఓ ఎమోషనల్ స్మాల్ స్టోరీ. మరి అలాంటి సినిమా పై ఫ్యాన్స్ అంచనాలు మరి ఎక్కువ అయితే.. సినిమాలో పవన్ నుండి అద్భుతాలు జరగవు కాబట్టి.. ఫ్యాన్స్ నిరాశ పడటం ఖాయం. నిజానికి అజ్ఞాతవాసికి కూడా ఇలాగే జరిగిందనేది వాస్తవం.

కరోనా టైంలో రేవంత్ కు ఛాన్స్ దొరికిందా?

ఒక్కసారి పవన్ రేంజ్ సినిమా కాదు అని పేరు బయటకు వస్తే.. ఇక పవన్ అభిమానులు ఆ సినిమాని పట్టించుకోరు. ‘వకీల్ సాబ్’ అలాంటి టాక్ వచ్చే అవకాశమే ఎక్కువ. ఇదే భయం నిర్మాత దిల్ రాజుకు ఉంది. అందుకే పవన్ పాత్రను మార్పులు చేయించాడు. కానీ కథ చిన్నది అయినప్పుడు పాత్ర పరిధిని పెంచింతే అసలుకే మోసం వచ్చే అవకాశం లేకపోలేదు. మరి ఏమి జరుగుతుందో చూడాలి. ఇకపోతే పవన్ కళ్యాణ్ క్రిష్ డైరెక్షన్లో ఓ పిరియాడిక్ మూవీని చేస్తున్నారు. ఈ సినిమా మాత్రం పవన్ రేంజ్ సినిమానే.