రాష్ట్రంలో కరోనా ఉధృతి కొనసాగుతున్న నేపథ్యంలో శాసనసభ స్పీకర్, మరో మంత్రి తీసుకున్న నిర్ణయం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. వీరు తమ చాంబర్ లను మూసి వేసి 15 రోజుల పాటు తమను కలిసేందుకు ఎవరూ రావద్దని నోటీస్ బోర్డు పెట్టారు. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో మంత్రులు సైతం కోవిడ్ భారిన పడ్డారు. ఏపీలో ప్రస్తుతం మంత్రులు ఎవరికీ కోవిడ్ సోకపోయినా ఎమ్మెల్యేలు ఒకరిద్దరు వైరస్ భారిన పడ్డారు. దీంతో ముందు జాగ్రత్త చర్యలలో భాగంగా స్పీకర్, మంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారు.
కేసీఆర్ ని ఎదుర్కోవడానికి జగన్ ని దించుతారా?
శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం, ఆర్ అండ్ బి శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ లు ఈ రోజు నుంచి తమ చాంబర్ లు మూసివేసి బయటి వారిని కలవకుండా ముందు జాగ్రత్త చర్యలకు సిద్ధమయ్యారు. రాష్ట్రంలోని మరి కొందరు మంత్రులు ఇదే బాట పట్టే అవకాశం కనిపిస్తోంది. ఎపి అసెంబ్లీలో కొద్ది రోజుల కిందట సెక్యూరిటీ సిబ్బందికి కరోనా సోకింది.సచివాలయంలో వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు ఛాంబర్ లో పనిచేసే అటెండర్ కు కరోనా అని తేలింది. సచివాలయంలో మరికొన్ని శాఖల సిబ్బందికి వైరస్ సోకింది. వీరంతా ఇప్పుడు కోలుకున్నారు.
ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐఏఎస్ కు సీఎంఓలో అందలం!
మరోవైపు రాష్ట్రంలో ఇప్పటివరకూ 23,814 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి వచ్చిన వారిని మినహాయిస్తే 21,071 కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 1,500 కొత్త కేసులను వైద్య ఆరోగ్య శాఖ అధికారులు గుర్తించారు. దీంతో ఇటు ప్రజాప్రతినిధులలో, అటు అధికారులలో కొత్త వ్యక్తులను కలవడానికి ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రంలో విద్యా సంస్థలు మూసివేత కొనసాగుతుంది. ఈ నెల 13 నుంచి ప్రాధమిక స్థాయి పాఠశాలలు వారానికి ఒక రోజు, ప్రాధమికొన్నత పాఠశాలలు వారానికి రెండు రోజులు తరగతులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇది ఎంత వరకూ అమలు జరుగుతుందనేది ప్రశ్నఅర్ధకంగా మారింది.