జగన్ సర్కార్ పై అంబులెన్స్ మరక ఇదేనా..?

జగన్ సర్కార్ పై 108 అంబులెన్స్ మరక అంటినట్లుగాతెలుస్తోంది. అంబులెన్స్ నిర్వహిస్తున్న బీవీజీ ఇండియా లిమిటెడ్ ని తప్పించి.. అరబిందో ఫౌండేషన్‌ కు అప్పగించింది. బీవీజీ సంస్థ ఒక్కో అంబులెన్స్ నిర్వహణకు.. నెలకు రూ. లక్షా 31వేలు ఇచ్చింది. అరబిందో ఫౌండేషన్‌ కు ఒక్కో అంబులెన్స్‌ కు రూ. లక్షా 78వేలు ఇచ్చేందుకు అంగీకరించారు. అంటే.. ఒక్కో అంబులెన్స్‌కు నెలకు రూ. 47వేలు ఎక్కువ ఇవ్వడం మొదలైయింది. ఇలా 300 అంబులెన్స్‌ లు ఉన్నాయి. అంటే.. ఏడాదికి […]

Written By: Neelambaram, Updated On : July 9, 2020 5:25 pm
Follow us on


జగన్ సర్కార్ పై 108 అంబులెన్స్ మరక అంటినట్లుగాతెలుస్తోంది. అంబులెన్స్ నిర్వహిస్తున్న బీవీజీ ఇండియా లిమిటెడ్ ని తప్పించి.. అరబిందో ఫౌండేషన్‌ కు అప్పగించింది. బీవీజీ సంస్థ ఒక్కో అంబులెన్స్ నిర్వహణకు.. నెలకు రూ. లక్షా 31వేలు ఇచ్చింది. అరబిందో ఫౌండేషన్‌ కు ఒక్కో అంబులెన్స్‌ కు రూ. లక్షా 78వేలు ఇచ్చేందుకు అంగీకరించారు. అంటే.. ఒక్కో అంబులెన్స్‌కు నెలకు రూ. 47వేలు ఎక్కువ ఇవ్వడం మొదలైయింది. ఇలా 300 అంబులెన్స్‌ లు ఉన్నాయి. అంటే.. ఏడాదికి రూ. 17 కోట్లు ఎక్కువ. కొత్తగా మరో 412 అంబులెన్స్‌ లను కొనుగోలు చేసింది. వాటి నిర్వహణకు మరింత ఎక్కువగా రూ. 2 లక్షల 21వేలు ఇచ్చేందుకు ఒప్పందం చేసుకుంది. అంటే.. ఇక్కడ ఏటా మరో రూ. 21 కోట్లు ఎక్కువ. పాత, కొత్త వాహనాలకు కలిపి ఏడాదికి రూ. 38 కోట్లు ఎక్కువ చెల్లిస్తున్నారు. ఇక ఇతరత్రా మెయింటెనెన్స్ లు కలిపి మొత్తం రూ. 300కోట్ల కంటే ఎక్కువే కుంభకోణమని తెదేపా ఆరోపణలు చేస్తోంది.

అరబిందో కష్టాలు ప్రభుత్వానివా..?: కాంట్రాక్ట్ తీసుకున్న సంస్థ ఏదైనా పెరగబోయే ఖర్చులు.. మిగలబోయే సంపదకు బాధ్యత తీసుకుంటుంది. ప్రభుత్వం తీసుకోదు. కానీ ఇక్కడ నిర్వహణ ఖర్చులు పెరగబోతున్నాయని అందుకే.. రేట్లు పెంచామని చెబుతున్నారు. అంబులెన్స్‌ లో పని చేసే డ్రైవర్లు, ఇతర మెడికల్ టెక్నిషియన్లకు జీతాలు పెంచుతారని.. ఏడేళ్లలో ఇంధన ధరలు భారీగా పెరుగుతాయని… నిర్వహణ వ్యయం పెరుగుతుంది. కాబట్టి ఎక్కువ రేటు కేటాయించాల్సి వచ్చిందని వాదిస్తోంది. పాత వాహనాలకు ఎక్కువ రిపేర్లు వస్తాయి కాబట్టి కొత్త, పాత వాహనాలకు వేర్వేరు రేట్లు చెల్లిస్తున్నామని ప్రభుత్వం తరపున ఆరోగ్య శాఖ వివరణ ఇస్తుంది. ఇక్కడ కొత్త వాహనాలకే ఎక్కువ నిర్వహణ వ్యయం చెల్లిస్తూండటం విశేషం.