Samantha: మీ స్థాయిని తగ్గించుకోకండి… వారిని ఉద్దేశిస్తూ సమంత ఘాటు వ్యాఖ్యలు

విజయ్ దేవరకొండ తో కలిసి నటిస్తున్న ఖుషి సినిమా ట్రైలర్ లాంచ్ లో సమంత పాల్గొనలేదు. దీంతో కొందరు అసలు విషయం తెలియక ఆమెను టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేశారు . దీనిపై సమంత మాట్లాడుతూ "మీరు ఈ ప్రపంచం కోసం జీవించాల్సిన అవసరం లేదు.

Written By: Shiva, Updated On : August 14, 2023 9:26 am

Samantha

Follow us on

Samantha: హీరోయిన్ సమంత గురించి గత కొద్ది నెలలుగా సోషల్ మీడియాలో అనేక వార్తలు వస్తూనే ఉన్నాయి. నాగ చైతన్య తో విడిపోయిన నాటి నుంచి సమంత సోషల్ మీడియా ద్వారా సమస్యలు ఎదుర్కొంటూనే ఉంది. అనేక సార్లు వీటి వలన తాను ఎన్ని ఇబ్బందులు పడిందో చెపుతూనే ఉన్న కానీ, ఆమె మీద జరుగుతున్న ఒక రకమైన ప్రచారం మాత్రం ఆగడం లేదు.

అదే సమయంలో మరో టైటిస్ జబ్బుతో బాధపడుతున్న సమంత దాని నుంచి కోలుకోవడానికి సినిమాలకు బ్రేక్ ఇచ్చేసి విదేశాలు వెళ్లి ట్రీట్మెంట్ తీసుకోవడానికి సిద్ధమైంది. ఈ విషయంలో కూడా అనేక మంది తెలిసి తెలియక తమకు ఇష్టం వచ్చిన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. వాస్తవాలు తెలియకుండా ఎవరిని విమర్శించటం కానీ, వాళ్ళ లైఫ్ గురించి ఆరోపణలు చేయడం కానీ కరెక్ట్ కాదు. సమంత విషయంలో కూడా వాస్తవాలు తెలియకుండా ఆరోపణలు చేసే సరికి ఆమెకు కోపం వచ్చింది.

విజయ్ దేవరకొండ తో కలిసి నటిస్తున్న ఖుషి సినిమా ట్రైలర్ లాంచ్ లో సమంత పాల్గొనలేదు. దీంతో కొందరు అసలు విషయం తెలియక ఆమెను టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేశారు . దీనిపై సమంత మాట్లాడుతూ “మీరు ఈ ప్రపంచం కోసం జీవించాల్సిన అవసరం లేదు. మీ గౌరవాన్ని మీరు తెలుసుకోవాలి. మీ స్థాయి ని మీరు పెంచుకోవాలి. మీ కోసం మీరు జీవించండి. ఇతరుల కోసం కాదు. ఈ సమాజం మిమ్మల్ని గుర్తించకపోవచ్చు. కానీ మీరు అలా ఉండకూడదు. పది మందిలో ఒకరికి కాకుండా మీ కోసం మీరు నిలబడటం అనేది ముఖ్యం ” అంటూ సమంత పేర్కొంది.

ప్రస్తుతం ఆమె చేసిన ట్విస్టు సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. సమంత విషయంలో నిజానిజాలు ఏమిటో తెలియకుండా కామెంట్స్ చేస్తున్న వాళ్ళు ఇది చూసి ఇకనైనా మారితే మంచిది అని సమంత ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. సెప్టెంబర్ ఒకటో తేదీ విడుదల కాబోతున్న ఖుషి సినిమా యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ త్వరలో జరిగే అవకాశం ఉంది. ఇందులో సమంత పాల్గొనే అవకాశం ఉంది. ఇక సమంత కొన్నాళ్ళు సినిమాల నుండి బ్రేక్ తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఆమె చికిత్స కోసం అమెరికా వెళ్లనున్నారట.