Independence Day 2023
Independence Day 2023: ఇప్పటి పాకిస్తాన్ ఒకప్పుడు భారత్‌లో భాగమే. దేశంలో నెలకొన్న పరిస్థితుల వల్ల నాడు పాకిస్తాన్ ప్రత్యేక దేశమైంది. ఈక్రమంలో లాహోర్ పాక్ లో ప్రధాన నగరంగా పేరుపొందింది. అయితే పంజాబ్ ఒకప్పుడు పాక్‌లో భాగంగా ఉండేది. విభజన సమయంలో అనేక మార్పులకు చేర్పులకు గుర యింది. చివరకు రెండు ముక్కలయింది. పశ్చిమ పంజాబ్ పాకిస్తాన్‌కు మరలిపోయింది. దక్షిణ పంబాబ్ భారత్‌లో భాగమైంది. విభజనకు ముందు, పంజాబ్ బ్రిటిష్ వలస పాలనలో ఒక ప్రావిన్స్. ఈ ప్రాంతంలో ముస్లింలు, హిందువులు, సిక్కు మతస్తులు ఎక్కువగా ఉండేవారు. వీరిలో ముస్లింలు తమ ప్రత్యేక దేశం కోసం డిమాండ్ చేయడం ప్రారంభించారు. చివరికి అది పాకిస్తాన్ ఆవిర్భావానికి దారి తీసింది. ఇది 20వ శతాబ్దం ప్రారంభంలో ఊపందుకుంది.
మహమ్మద్ అలీ జిన్నా నేతృత్వంలోని ఆల్ జిన్నా నేతృత్వంలోని ఆల్ ఇండియా ముస్లిం లీగ్, ముస్లిం గుర్తింపు కోసం పోరాడింది. సుమారు ఆరు నెలల పాటు ఉద్యమాలు జరిగాయి. ఫలితంగా 10 మిలియన్ల మంది పశ్చిమ పంజాబ్‌కు తరలివెళ్లారు. వీరిలో 5.5 మిలియన్ల మంది ముస్లింలు ఉన్నారు. ఇక హిందువులు, సిక్కులు, తూర్పు పంజాబ్‌కు మకాం మార్చారు. మతపరమైన ఉద్రిక్తతలు, రెండు దేశాల సిద్ధాంతం, రాజకీయ చర్చలు, మత హింస, సరిహద్దు కమిషన్, ఆస్తుల విభజన, సాంస్కృతిక సామాజిక మార్పులు విభజనకు దోహదం చేశాయి. బ్రిటీష్ వారు భారత్‌కు స్వాతంత్య్రం ఇవ్వడానికి బ్రిటీష్ వారు సిద్ధమైనప్పుడు ఈ ప్రాంతం భవిష్యత్ నిర్ణయించేందుకు వివిధ రాజకీయ పార్టీల మధ్య చర్చలు జరిగాయి. ఉపఖండాన్ని మత ప్రాతిపదికన విభజించాలనే బ్రిటీష్ నిర్ణయం పంజాబ్ విభజనతో సహా పలు డిమాండ్‌లకు ఆజ్యం పోసింది. విభజన సమయంలో పంజాబ్‌లో చెలరేగిన మత హింస చెలరేగింది. ముస్లిం, సిక్కు, హిందువుల మధ్య దాడులు జరిగాయి. వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు.
మత హింస నిరోధానికి ప్రత్యేక దేశం ఏర్పాటు అనివార్యమైంది. జూన్ 1947లో బ్రిటిష్ ప్రభుత్వం భారత్, పాక్ మధ్య సరిహద్దులను గుర్తించేందుకు రాడ్ క్లిఫ్ కమిషన్‌ను నియమించింది. మతపరమైన జనాభా, ఆర్థిక సాధ్యత, భౌగోళిక పరిశీలనల ఆధారంగా సరిహద్దులను నిర్ణయించే అఽధికారం రాడ్ క్లిఫ్ కమిషన్ కు కట్టబెట్టింది. పంజాబ్ విభజన ఫలితంగా లక్షలాది మంది ప్రజలు వలస వెళ్లారు. పాక్ నుంచి హిందువులు, సిక్కులు భారత్‌కు, భారత్ నుంచి ముస్లింలు పాక్‌కు వలస వెళ్లారు. విభజన సమయంలో భూమి, మౌలిక సదుపాయాలు, వనరులు, ఇతర ఆస్తుల పంపకం కూడా జరిగింది. ఆస్తి యాజమాన్య హక్కులు కొత్త వివాదానికి కారణమయ్యాయి. విభజన వల్ల 14 నుంచి 17 మిలియన్ల మంది ప్రజలు తీవ్రంగా ఇబ్బందిపడ్డారు. జీవనోపాధిని కూడా కోల్పోయారు. విభజన పంజాబ్‌లో గణనీయమైన సాంస్కృతిక, సామాజిక మార్పులకు కారణమైంది. బ్రిటీష్ ఇండియా సైనిక నియామకాలకు పంజాబ్ కీలక ప్రదేశం. రెండో ప్రపంచ యుద్ధం ప్రారంభమైనప్పుడు భారత సైన్యంలో 48శాతం పంజాబీ సైనికులు ఉండేవారు. విభజన సమయంలో వీరు తుపాకీలతో ఒకరిపై మరొకరు దాడులు చేసుకున్నారు. ఇది అపారమైన ప్రాణ నష్టం సంభవించడానికి ఇది కూడా ఒక కారణమైంది. 1947లో జరిగిన పంజాబ్ విభజన నేటికీ ఈ దేశం మీద ప్రభావం చూపిస్తూనే ఉంది. నాడు పంజాబ్‌ను విడదీసి.. మత పరమైన సాకు చూపి లాహోర్‌ను వదిలేయడం.. నేటికీ ఒక మాయని మచ్చగా ఉంది. నాటితరం వారు కన్నుమూసినప్పటికీ ఆ విభజన భారత్ ఉపఖండం మీద ఒక నెత్తుటి మరకను మిగిల్చింది.