Vettaiyan: సూపర్ స్టార్ రజినీకాంత్ వరుస సినిమాలను చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ప్రస్తుతం ఆయన చేస్తున్న వెట్టయాన్ సినిమాతో మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా భారీ కలెక్షన్స్ కూడా రాబట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక గత సంవత్సరం ఆయన చేసిన జైలర్ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోవడమే కాకుండా ఈ సినిమా భారీ సక్సెస్ ని కూడా సాధించింది. మరి మొత్తానికైతే ఇప్పుడు ఆయన చేస్తున్న వేట్టయన్ సినిమాతో కూడా భారీ సక్సెస్ ని సాధించాలని చూస్తున్నాడు. ఇక ఈ సినిమా అక్టోబర్ 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపధ్యంలో నిన్న ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇక ట్రైలర్ కొంతమంది ప్రేక్షకులను అలరించినప్పటికి మరికొంతమంది ప్రేక్షకులను అలరించడం లో చాలా వరకు విఫలమైందనే చెప్పాలి. ఇది ఒక మర్డర్ మిస్టరీ మీద ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది. అలాగే ఈ సినిమా రజనీకాంత్ ఇమేజ్ కి ఎంతవరకు సరిపోతుంది అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరి మొత్తానికైతే రజనీకాంత్ ఈ సినిమాతో మరోసారి తనను తాను స్టార్ హీరోగా ప్రూవ్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు. ఇక పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా 300 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది.
ఇక ఇప్పుడు ఈ సినిమా 500 కోట్ల వరకు కలెక్షన్స్ రాబడుతుందనే అంచనాలో రజనీకాంత్ ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి ఆయన అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమా సూపర్ సక్సెస్ గా నిలుస్తుందా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక మొత్తానికైతే ఆయన ఇమేజ్ కు సరిపడే కథ ఇది కాదని విమర్శకులు తేల్చి చెప్పేశారు. మరి ఈ కథలో రజనీకాంత్ ఎలా నటిస్తాడు.
ఇందులో ఆయన పాత్రకి ఎంతవరకు ఇంపార్టెన్స్ ఉంటుందనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక అమితాబచ్చన్ కూడా ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డట్టుగా తెలుస్తుంది. మరి ఈ లెంజండరీ యాక్టర్లు ఇద్దరూ కలిసి చేసిన ఈ సినిమా పాన్ ఇండియాలో సూపర్ సక్సెస్ గా నిలుస్తుందా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.
ఇక రజినీకాంత్ ఈ సినిమాని అక్టోబర్ 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చి సూపర్ సక్సెస్ గా నిలిపి ఆ తర్వాత లోకేష్ కనక రాజ్ డైరెక్షన్ లో చేస్తున్న కూలీ సినిమా మీదనే తన పూర్తి ఫోకస్ ని కేటాయించబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక జ్ఞానవెల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న వేటాయన్ సినిమా మీదనైతే తమిళనాడు ప్రేక్షకులకు మంచి అంచనాలైతే ఉన్నాయి. కాబట్టి రజనీకాంత్ తన స్టామినాను మరింత పెంచుకోవాలంటే మాత్రం ఈ సినిమా సూపర్ సక్సెస్ అవ్వాల్సిందే…