https://oktelugu.com/

Kanguva: సూర్య కంగువా సినిమాకు తప్పని కష్టాలు…సూర్య పాన్ ఇండియా హీరో అవుతాడా లేదా..?

సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ సాధించాలనే కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ ఇక్కడ సక్సెస్ సాధించడం అనేది అంత ఈజీ కాదు. దానికోసం కొన్ని సంవత్సరాలపాటు ఎదురు చూడాల్సిన అవసరం కూడా ఉంటుంది.

Written By:
  • Gopi
  • , Updated On : October 3, 2024 / 09:52 AM IST

    Suriya Kanguva Movie

    Follow us on

    Kanguva: తమిళంలో చాలామంది స్టార్ హీరోలు తమకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను ఏర్పాటు చేసుకున్నారు. ముఖ్యంగా కమల్ హాసన్, రజినీకాంత్ లాంటి నటులు కూడా సూపర్ సక్సెస్ లను సాధించడమే కాకుండా వరుస సినిమాలను చేస్తూ తెలుగు ఇండస్ట్రీ యొక్క పరిధిని కూడా పెంచే ప్రయత్నం అయితే చేశారు. ఇక అందులో బాగానే వాళ్లకు తెలుగులో కూడా భారీ మార్కెట్ అయితే క్రియేట్ అయింది. ఆ తర్వాత సూర్య, విక్రమ్ లాంటి హీరోలు కూడా వాళ్ళ మార్కెట్ ను కాపాడుకుంటూనే తెలుగులో కూడా భారీ సక్సెస్ ని అందుకునే ప్రయత్నం చేశారు. ఇక దానికి తగ్గట్టుగానే వాళ్ళ ప్రయత్నాలు కూడా చాలా వరకు సక్సెస్ సాధించాయి. ఇక మొత్తానికైతే వాళ్ళు చేసిన సినిమాలు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపును సంపాదించుకోవడమే కాకుండా వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను తీసుకొచ్చి పెట్టాయి. ఇక ఇప్పుడు స్టార్ హీరోల సినిమాలు ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలను అందుకుంటున్నాయి. అందులో భాగంగానే విక్రమ్ హీరోగా వచ్చిన తంగలాన్ సినిమా భారీ సక్సెస్ ను సాధించగా, సూర్య హీరోగా వస్తున్న కంగువా సినిమా మీదనే అందరి అంచనాలు ఉన్నాయి…

    ఇక మొత్తానికైతే ఈ సినిమాతో తనను తాను మరొకసారి స్టార్ హీరోగా ప్రూవ్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు. అలాగే పాన్ ఇండియాలో ఒకటి భారీ సక్సెస్ ని సాధిస్తే ఇండియన్ ఇండస్ట్రీలో ఆయన మార్పురుగుతుందని ఆయన సక్సెస్ కోసం తీవ్రమైన ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ఇక కంగువా సినిమా దసర కానుకగా ప్రేక్షకులు ముందుకు రావాల్సింది. కానీ రజనీకాంత్ వెట్టయాన్ మూవీతో దసర కి ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. కాబట్టి ఆ సినిమా కోసం సూర్య తన సినిమాను పోస్ట్ పోన్ చేసుకున్నాడు.

    మరి మొత్తానికైతే కంగువా సినిమా దీపావళి కానుకగా వచ్చిన కూడా ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుంది అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇక ఏది ఏమైనా కూడా కంగువా సినిమా భారీ సక్సెస్ ని సాధిస్తేనే సూర్య కెరియర్ అనేది సూపర్ స్టార్ గా ముందుకు సాగుతుంది. లేకపోతే మాత్రం ఆయన మార్కెట్ భారీగా పడిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి.

    ఇక తెలుగులో ఆయన చేసిన సినిమాలు పెద్దగా మ్యాజిక్ నైతే క్రియేట్ చేయలేకపోతున్నాయి. సింగం సిరీస్ తర్వాత ఆయనకు తెలుగులో పెద్దగా సక్సెస్ అయితే రాలేదు. మరి ఇలాంటి సందర్భంలో ఆయన ఇప్పుడు తెలుగు మార్కెట్ ను భారీగా సంపాదించుకోవాలంటే మాత్రం ఈ సినిమాతో ఏదైనా మ్యాజిక్ చేయాల్సిందే అని సినీ మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు…